ఒకే ఓటీటీలోకి నాలుగు భాషల్లో నాలుగు సూపర్ హిట్ సినిమాలు.. థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ జానర్లలో.. ఓ తెలుగు మూవీ కూడా..

ఒకే ఓటీటీలోకి ఈవారం రెండు రోజుల్లో ఏకంగా నాలుగు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. మూడు భాషలకు చెందిన మూవీస్ ఇందులో ఉన్నాయి. క్రైమ్ థ్రిల్లర్, థ్రిల్లర జానర్లకు చెందిన వీటిలో ఓ తెలుగు మూవీ కూడా ఉండటం విశేషం.

Published on: Jun 27, 2025 4:00 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఒకే ఓటీటీలోకి రెండు రోజుల వ్యవధిలో నాలుగు భాషలకు చెందిన నాలుగు సూపర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్ కు రావడం విశేషం. సన్ నెక్ట్స్ ఓటీటీ ఈవారం దూకుడు మీద ఉంది. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషలకు చెందిన నాలుగు సినిమాలను తీసుకొచ్చింది. ఈ వీకెండ్ వీటిని చూడటానికి ప్లాన్ చేసేయండి.

ఒకే ఓటీటీలోకి మూడు భాషల్లో నాలుగు సూపర్ హిట్ సినిమాలు.. థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ జానర్లలో.. ఓ తెలుగు మూవీ కూడా..
ఒకే ఓటీటీలోకి మూడు భాషల్లో నాలుగు సూపర్ హిట్ సినిమాలు.. థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ జానర్లలో.. ఓ తెలుగు మూవీ కూడా..

సన్ నెక్ట్స్‌లోకి వచ్చిన మూవీస్ ఇవే

సన్ నెక్ట్స్ ఓటీటీ ఈవారం గురు, శుక్రవారాల్లో నాలుగు సౌత్ భాషలకు చెందిన నాలుగు హిట్ సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. ఆ మూవీస్ ఏవో ఇక్కడ చూడండి.

ఒక పథకం ప్రకారం

తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఒక పథకం ప్రకారం శుక్రవారం (జూన్ 27) స్ట్రీమింగ్ కు వచ్చింది. ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సుమారు ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. రెండు హత్యల్లో ఇరుక్కున్న సిద్ధార్థ్ (సాయిరాం శంకర్) అనే లాయర్ అలాంటి మరెన్నో హత్య గురించి తెలుసుకొని వాటిని ఎలా పరిష్కరిస్తాడన్నదే ఈ సినిమా స్టోరీ. ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమాకు ఐఎండీబీలో 8.4 రేటింగ్ ఉంది.

ది వర్డిక్ట్ - తమిళ క్రైమ్ థ్రిల్లర్

వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ది వర్డిక్ట్. ఈ సినిమా గురువారం (జూన్ 26) నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. వరలక్ష్మితోపాటు శృతి హరిహరన్, సుహాసినిలాంటి వాళ్లు కూడా ఇందులో నటించారు. ఈ కోర్ట్ రూమ్ డ్రామా ఓ హత్య కేసు చుట్టూ తిరుగుతుంది.

ఆజాదీ - మలయాళ థ్రిల్లర్ మూవీ

మలయాళంథ్రిల్లర్ మూవీ ఆజాదీ శుక్రవారం (జూన్ 27) ఈ సన్ నెక్ట్స్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఓ పొలిటీషియన్ హత్య కేసులో జైలు పాలై తన డెలివరీ కోసం హాస్పిటల్ కు వచ్చిన ఓ మహిళ తన భర్తతో కలిసి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ సినిమా కథ. మంజుమ్మెల్ బాయ్స్ ఫేమ్ శ్రీనాథ్ భాసి ఇందులో లీడ్ రోల్లో నటించాడు.

నిమ్మ వస్తుగలిగే నీవే జవాబుదారరు - కన్నడ క్రైమ్ డ్రామా

నిమ్మ వస్తుగలిగే నీవే జవాబుదారరు ఓ కన్నడ క్రైమ్ డ్రామా. ఇదో ఆంథాలజీ. మూడు వేర్వేరు కథల సమాహారం. సరదా కోసం దొంగతనం చేసే కోటీశ్వరుడు, బైకు చోరీ చేసే మరో వ్యక్తి, ప్రొఫెషనల్ బ్లాక్‌మెయిలర్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా గురువారం (జూన్ 26) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇలా రెండు రోజుల వ్యవధిలోనే ఒకే ఓటీటీ నాలుగు భాషలకు చెందిన నాలుగు హిట్ సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. మరి ఎందుకు ఆలస్యం. ఈ వీకెండ్ వీటిని చూసేందుకు ప్లాన్ చేసుకోండి.