బోర్డర్ 2 తర్వాత సన్నీ డియోల్ మరో ఇండో-పాక్ డ్రామా.. ప్రీతి జింటా రీ ఎంట్రీ.. ప్రొడ్యూసర్ అమీర్ ఖాన్.. రిలీజ్ డేట్ ఇదే

బోర్డర్ 2 సక్సెస్ తో జోష్ మీదున్న సన్నీ డియోల్ మరో ఇండో-పాక్ డ్రామాతో థియేటర్లలోకి రాబోతున్నాడు. సన్నీ హీరోగా అమీర్ ఖాన్ నిర్మిస్తున్న ‘లాహోర్ 1947’ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. 8 ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రీతి జింటా చేసిన సినిమా ఇది. 

Published on: Feb 10, 2026 9:44 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రిపబ్లిక్ డే సందర్భంగా ‘బోర్డర్ 2’ మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు సన్నీ డియోల్. అతను ఇప్పుడు మరో ఇండో-పాక్ డ్రామా మూవీ చేస్తున్నాడు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న లాహోర్ 1947 మూవీలో సన్నీ హీరో. ఈ చిత్రం రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు. 8 ఏళ్ల తర్వాత ప్రీతి జింటా ఈ మూవీతో రీ ఎంట్రీ ఇస్తుంది.

సన్నీ డియోల్ కొత్త సినిమా లాహోర్ 1947 (Instagram)
సన్నీ డియోల్ కొత్త సినిమా లాహోర్ 1947 (Instagram)

లాహోర్ రిలీజ్ డేట్

సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న లాహోర్ 1947 మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా రెండు రోజులు ముందుగానే ఈ సినిమా ఆగస్టు 13, 2026న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకు రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్నారు. సన్నీ-రాజ్ కుమార్ కాంబినేషన్లో గతంలో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.

ఫస్ట్ మూవీ

హీరో సన్నీ డియోల్, డైరెక్టర్ రాజ్ కుమార్ తో కలిసి అమీర్ ఖాన్ నిర్మిస్తున్న ఫస్ట్ మూవీ లాహోర్ 1947. రాజ్ కుమార్ దర్శకత్వంలో గతంలో సన్నీ డియోల్ సినిమాలు చేశారు. ఘాతక్, ఘయల్, దామిని వంటి సూపర్ హిట్ సినిమాలను ఈ జోడీ అందుకుంది. ఇప్పుడు లాహోర్ 1947 కోసం హిట్ పెయిర్ రాజ్ కుమార్- సన్నీ కలిశారు. వీళ్లతో కలిసి ప్రొడ్యూసర్ గా అమీర్ ఖాన్ కు ఇదే తొలి చిత్రం.

8 ఏళ్ల తర్వాత

సొట్ట బుగ్గల బ్యూటీ ప్రీతి జింటా మళ్లీ బిగ్ స్క్రీన్ పై కనిపించనుంది. 8 ఏళ్ల గ్యాప్ తర్వాత లాహోర్ 1947తో ఆమె రీ ఎంట్రీ ఇస్తుంది. చివరగా 2018లో వచ్చిన భయ్యాజీ సూపర్ హిట్ సినిమాలో నటించింది ప్రీతి. ఆ మూవీలోనూ సన్నీ డియోల్ హీరో. ఇప్పుడు సన్నీ సినిమాతోనే ప్రీతి జింటా రీ ఎంట్రీ ఇస్తుంది. ఫర్జ్, ది హీరో లవ్ స్టోరీ ఆఫ్ ఏ స్పై లాంటి సినిమాల్లో సన్నీ, ప్రీతి కలిసి నటించారు.

లాహోర్ 1947 సినిమాలో షబానా అజ్మీ, అలీ ఫజల్, కరన్ డియోల్, అభిమన్యు సింగ్ తదితరులు కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్.

లాహోర్ 1947 గురించి

అస్గర్ వజాహత్ రాసిన 'జిస్ లాహోర్ నై దేఖ్యా, ఓ జమ్యాయ్ ని' అనే నాటకం ఆధారంగా లాహోర్ 1947 సినిమా తెరకెక్కుతుందని టాక్. భారత్-పాకిస్థాన్ విభజన నేపథ్యంలో రెడీ అవుతున్న ఈ సినిమా.. లక్నోకు చెందిన ఒక ముస్లిం కుటుంబం లాహోర్‌కు మారడం చుట్టూ తిరుగుతుంది. హిందూ కుటుంబం ఖాళీ చేసిన ఒక ఇంట్లో ఈ ముస్లిం ఫ్యామిలీ ఉంటుంది.