ఈ సినిమా నా ఇమేజ్, నా కెరీర్‌ను మార్చేస్తుంది.. మరిన్ని అవకాశాలు వస్తాయనుకుంటున్నా: సన్నీ లియోనీ కామెంట్స్
ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన 'కెన్నెడీ' (Kennedy) సినిమా తన కెరీర్‌ను మలుపు తిప్పుతుందని నటి సన్నీ లియోనీ నమ్ముతోంది. ఇందులో ఆమె 'చార్లీ' అనే కీలక పాత్ర పోషిస్తోంది. ఫిబ్రవరి 20న జీ5 (ZEE5)లో విడుదల కానున్న ఈ సినిమా విశేషాలు, అనురాగ్‌తో పని చేయడంపై సన్నీ స్పందన ఇక్కడ చూడండి.
అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రాబోతున్న 'కెన్నెడీ' సినిమా పరిశ్రమలో తనపై ఉన్న ముద్రను మారుస్తుందని, భవిష్యత్తులో తనకు మంచి పాత్రలు రావడానికి ఇది దోహదపడుతుందని సన్నీ లియోనీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో ఆమె 'చార్లీ' (Charlie) అనే పాత్రలో కనిపించనుంది. రాహుల్ భట్ పోషిస్తున్న ఉదయ్ శెట్టి (మాజీ పోలీస్ ఆఫీసర్, కాంట్రాక్ట్ కిల్లర్) ప్రపంచంలోకి ఆమె పాత్ర ప్రవేశిస్తుంది. తన పాత్ర చాలా మిస్టరీగా, సున్నితంగా ఉంటూనే ఎంతో బలంగా ఉంటుందని సన్నీ వివరించింది.

ఫోన్ రాగానే భయమేసింది..
ఈ సినిమాలో అవకాశం రావడం గురించి సన్నీ లియోనీ ఆసక్తికర విషయాలు పంచుకుంది. అనురాగ్ కశ్యప్ మొదట సన్నీ భర్త, ఆమె మేనేజర్ అయిన డానియల్ వెబర్‌ను సంప్రదించాడు. అయితే సన్నీతోనే నేరుగా మాట్లాడాలని డానియల్ సూచించడంతో అనురాగ్ ఆమెకు కాల్ చేశాడు.
"ఆయన నాకు ఫోన్ చేసి 'ఒక పాత్ర ఉంది, ఆడిషన్‌కు వస్తావా?' అని అడుగుతారని నేను కలలో కూడా అనుకోలేదు. ఆ ఆఫర్ వినగానే మైండ్ బ్లాక్ అయ్యింది. ఫోన్ పెట్టేశాక చాలా భయంతోపాటు నెర్వస్ గానూ ఫీలయ్యాను. నేను ఇప్పటివరకు చేసిన సినిమాల కంటే ఇది చాలా పెద్దది, గొప్పది" అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ తెలిపింది.
ఇప్పటికీ కలలాగే ఉంది..
"ఆయనతో కలిసి పనిచేయడం నిజంగా ఒక కల లాంటిది. ఇప్పటికీ అది కలగానే అనిపిస్తోంది. చాలా రోజులు నేను నమ్మలేకపోయాను. సెట్‌కి వెళ్లేంత వరకు నేను ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నానని నమ్మలేకపోయాను" అని సన్నీ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
కెరీర్ మలుపు తిరుగుతుందా?
'బేబీ డాల్', 'లైలా మై లైలా', 'చార్ బోతల్ వోడ్కా' వంటి స్పెషల్ సాంగ్స్‌తో పాపులర్ అయిన సన్నీ లియోనీ.. 'కెన్నెడీ' సినిమా తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 20న జీ5లో విడుదల కానుంది.
"నేను కలిసిన చాలా మంది డైరెక్టర్లు, నిర్మాతలు ఈ సినిమా నా ఇమేజ్‌ను మారుస్తుందని చెప్పారు. ఇది నన్ను నటిగా మరో మెట్టు ఎక్కిస్తుందని, దీని ద్వారా నాకు మరింత మంచి పని దొరుకుతుందని ఆశిస్తున్నాను" అని ఆమె పేర్కొంది.
అనురాగ్ కశ్యప్‌తో సాన్నిహిత్యం
బిగ్ బాస్, స్ప్లిట్స్ విల్లా, జిస్మ్ 2, మస్తీజాదే వంటి ప్రాజెక్టులు చేసిన సన్నీ.. అనురాగ్ కశ్యప్‌తో పనిచేయడం ఇదే తొలిసారి. "అనురాగ్ సార్‌తో నాకు కొన్ని మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయి. మేము మా గతం గురించి, జీవితంలోని అనేక విషయాల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఆయన దగ్గర నేను సురక్షితంగా ఉన్నానని, నా మాటలకు విలువ ఉందని అనిపించింది. మానసికంగా ఆ కంఫర్ట్ ఉండటం వల్ల నేను స్క్రీన్ మీద బాగా నటించగలిగాను. చాలా తక్కువ మంది మాత్రమే ఇలాంటి కంఫర్ట్ ఇస్తారు" అని సన్నీ చెప్పుకొచ్చింది.
ఈ సినిమాలో మోహిత్ తకల్కర్, మేఘా బర్మన్, అమీర్ దల్వీ, అభిలాష్ తప్లియల్, కరిష్మా మోడీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
కెన్నెడీ మూవీ కథ
'కెన్నెడీ' ఒక నియో-నోయిర్ క్రైమ్ మూవీ. ఇది ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'మిడ్ నైట్ స్క్రీనింగ్స్' విభాగంలో ప్రదర్శితమైంది. ఈ కథ ఉదయ్ శెట్టి అలియాస్ కెన్నెడీ (రాహుల్ భట్) చుట్టూ తిరుగుతుంది. అతను బయటకు క్యాబ్ డ్రైవర్‌గా కనిపిస్తూనే, అవినీతి పోలీస్ కమిషనర్ రషీద్ ఖాన్ కోసం రహస్యంగా హత్యలు చేస్తుంటాడు. తన కొడుకును కోల్పోయిన బాధ, విచ్ఛిన్నమైన కుటుంబం అతన్ని వెంటాడుతుంటాయి. తన గతం నుంచి పారిపోలేని ఆ నగరంలో అతను విముక్తి కోసం వెతుకుతుంటాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


