Taapsee Pannu: హీరోగారి భార్యకు నేను నచ్చలేదట.. అందుకే ఆ సినిమాలో నుంచే తీసేశారు: తాప్సీ కామెంట్స్ వైరల్

Taapsee Pannu: తాప్సీ పన్ను మరోసారి బోల్డ్ కామెంట్స్ చేసింది. తనను ఓ సినిమా నుంచి తప్పించడానికి మేకర్స్ చెప్పిన కారణం గురించి వెల్లడించింది. ఆ మూవీ హీరో భార్యకు తాను నచ్చలేదట అని ఆమె చెప్పి ఆశ్చర్యపరిచింది.

Published on: Sep 25, 2026, 16:43:55 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Taapsee Pannu: బాలీవుడ్ వర్సటైల్ నటి తాప్సీ పన్ను ఇండస్ట్రీలో తనకు ఎదురైన దారుణమైన అనుభవాలను బయటపెట్టి తీవ్ర కలకలం రేపింది. డేట్స్ కేటాయించి, ప్రాజెక్ట్‌కి కమిట్ అయిన తర్వాత కూడా తనను ఎలాంటి సరైన కారణం చెప్పకుండా సినిమా నుంచి తొలగించారని సంచలన నిజాలు వెల్లడించింది. రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మేకర్స్ తనను రీప్లేస్ చేయడానికి చెప్పిన వింతైన కారణాలను షేర్ చేసుకుంది.

Taapsee Pannu: హీరోగారి భార్యకు నేను నచ్చలేదట.. అందుకే ఆ సినిమాలో నుంచే తీసేశారు: తాప్సీ కామెంట్స్ వైరల్
Taapsee Pannu: హీరోగారి భార్యకు నేను నచ్చలేదట.. అందుకే ఆ సినిమాలో నుంచే తీసేశారు: తాప్సీ కామెంట్స్ వైరల్

'ఆ హీరో భార్యకి నువ్వంటే పడదంట!'.. తాప్సీ షాకింగ్ కామెంట్స్

పాపులర్ జర్నలిస్ట్ నయన్ దీప్ రక్షిత్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.. సినిమాలో తనను వద్దని హీరోలే స్వయంగా తీయించేసేవారని సంచలన వ్యాఖ్యలు చేసింది. "నన్ను సినిమా నుంచి ఎందుకు తీసేశారో నాకు సరైన క్లారిటీ కూడా ఇచ్చేవారు కాదు. హీరోకి నా మీద అభద్రతా భావం ఉండొచ్చు లేదా తనకు నచ్చిన, తనకు బాగా క్లోజ్‌గా ఉండే వేరే హీరోయిన్‌ని తీసుకోవాలనుకోవచ్చు. కానీ నాకు మాత్రం అసలు రీజన్ చెప్పకుండా దాచేసేవారు" అని తన ఆవేదన వ్యక్తం చేసింది.

ఇక తనకు చెప్పిన అత్యంత చెత్త కారణం ఏంటో కూడా తాప్సీ బయటపెట్టింది. "ఒక సినిమా విషయంలో అయితే 'ఈ హీరో భార్యకి నువ్వంటే అస్సలు పడదు.. అందుకే నిన్ను తీసేస్తున్నాం' అని చెప్పారు. ఆ హీరో భార్యకి నాపై ఎందుకు అంత కోపమో నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు" అని తాప్సీ బాంబ్ పేల్చింది. అయితే ఆ హీరో పేరు కానీ, ఆయన భార్య ఎవరనేది కానీ తాప్సీ బయటపెట్టలేదు.

ఒక్కసారే రిజెక్ట్ చేసేంత రేంజ్..

ఇండస్ట్రీలో తనకంటూ ఒక సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తాప్సీ.. ఒకే తరహా పాత్రలు చేసి బోర్ కొట్టించడం తన వల్ల కాదని తేల్చి చెప్పేసింది. 'తప్పడ్', 'హసీన్ దిల్‌రుబా', 'డంకీ' వంటి కంటెంట్ డ్రివెన్ సినిమాలతో మెప్పించిన ఈ బ్యూటీ.. రీసెంట్‌గా కొన్ని సినిమాలను రిజెక్ట్ చేయడానికి గల కారణాలను కూడా వివరించింది.

"ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరూ సేఫ్ జోన్‌లో ఆడటానికి ట్రై చేస్తున్నారు. గ్లామరస్ రోల్స్ అనగానే ఒక ఐదుగురు హీరోయిన్లు, సీరియస్ ఎమోషనల్ లేదా మెసేజ్ ఓరియెంటెడ్ రోల్స్ అనగానే మరో ఐదుగురు హీరోయిన్లు అని ఫిక్స్ అయిపోతున్నారు. అలా నన్ను ఒకే మార్క్ రోల్స్‌కే పరిమితం చేస్తుంటే వద్దని ముందే చెప్పేస్తున్నా" అని తాప్సీ స్పష్టం చేసింది. అంతేకాకుండా, అలాంటి రొటీన్ సినిమాలు చేస్తే ఆడియెన్స్ కి క్లైమాక్స్ ఈజీగా అర్థమైపోతుందని, తనను ఆ సినిమాల్లో వద్దని డైరెక్టర్లకే ఉచిత సలహా ఇచ్చి వచ్చేస్తున్నట్లు తెలిపింది.

'అస్సి' కోర్టురూమ్ డ్రామా నుంచి 'గాంధారి' ఇంటెన్స్ యాక్షన్ దాకా..

తాప్సీ పన్ను కేవలం మాటలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన సినిమాలతో ఆడియెన్స్‌ను అలరిస్తోంది. రీసెంట్‌గా ప్రముఖ డైరెక్టరు అనుభవ్ సిన్హా తెరకెక్కించిన 'అస్సి' సినిమాలో లాయర్ రావి భట్కల్ పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. లైంగిక వేధింపుల కేసు ఆధారంగా సాగే ఈ ఇంటెన్స్ కోర్టురూమ్ డ్రామాలో తాప్సీ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉందనే టాక్ వచ్చింది.

దీంతో పాటు దేవాశిష్ మఖిజా డైరెక్షన్ లో వచ్చిన 'గాంధారి' మూవీలో తన కిడ్నాప్ అయిన కూతురి కోసం పోరాడే పవర్‌ఫుల్ మదర్ రోల్‌లో అదరగొట్టింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌లో తాప్సీ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు, హై-వోల్టేజ్ సీన్స్ ఓటీటీ ఆడియెన్స్‌ని బాగా ఆకట్టుకుంటున్నాయి. దక్షిణాదిలో 'ఝుమ్మంది నాదం' మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ఢిల్లీ బ్యూటీ.. సొంత టాలెంట్‌తోనే బాలీవుడ్‌లో టాప్ పొజిషన్‌కి చేరుకుంటూ నేటితరం నటీమణులకు రోల్ మోడల్‌గా నిలుస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More