ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ కామెడీ మూవీ.. ఐఎండీబీలో 9.4 రేటింగ్.. ఇక్కడ చూడండి
ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. ఐఎండీబీలో ఏకంగా 9.4 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. మరి ఈ సినిమా ఏంటి? ఎప్పుడు, ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
తమిళ కామెడీ మూవీ ఒకటి ఈవారమే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమా పేరు మద్రాస్ మ్యాటినీ (Madras Matinee). జూన్ 6న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. ఐఎండీబీలో 9.4 రేటింగ్ ఉంది. ఇక ఇప్పుడు శుక్రవారం (జులై 4) డిజిటల్ ప్రీమియర్ కానుంది.

మద్రాస్ మ్యాటినీ ఓటీటీ రిలీజ్ డేట్
ఓటీటీలోకి రాబోతున్న తమిళ కామెడీ సినిమా పేరు మద్రాస్ మ్యాటినీ. ఈ మూవీని సన్ నెక్ట్స్ ఓటీటీ జులై 4 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని సోమవారం (జూన్ 30) ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
“అతడు చేసే ప్రతి ప్రయాణం, అతడు చేసే ప్రతి త్యాగం.. తన కుటుంబం కోసమే. మద్రాస్ మ్యాటినీ స్టోరీ మాత్రమే కాదు.. తన పిల్లలు పెద్ద కలలు కనడానికి తన కలలను పక్కన పెట్టే తండ్రికి ఇచ్చే గొప్ప ట్రిబ్యూట్” అనే క్యాప్షన్ తో ఓ చిన్న టీజర్ రిలీజ్ చేసింది.
మద్రాస్ మ్యాటినీ మూవీ గురించి..
మద్రాస్ మ్యాటినీ మూవీని కార్తికేయన్ మణి డైరెక్ట్ చేశాడు. ఇందులో సత్యరాజ్, కాళీ వెంకట్, రోషిని హరిప్రియన్, షెల్లీ కిశోర్ లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ రచయిత జ్యోతి రామయ్య (సత్యరాజ్) చుట్టూ తిరుగుతుంది. ఈ జానర్ కథలు రాసే అతని జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. అతనికి ఫాంటసీ కాకుండా, నిజ జీవితంలోని వ్యక్తుల గురించి ఒక పుస్తకం రాయాలన్న సవాలు ఎదురవుతుంది.
దీంతో అతడు ఒక దిగువ మధ్యతరగతి ఆటో డ్రైవర్, చెత్త సేకరించే వ్యక్తి అయిన కన్నన్ (కాళీ వెంకట్) కథను ఎంచుకుంటాడు. మధ్యతరగతి జీవితాలు నిస్తేజంగా, బోరింగ్‌గా ఉంటాయని, ఎవరి జీవితంలోనూ ఎలాంటి ఉత్సాహభరితమైన సంఘటనలు జరగవని రామయ్య మొదట చెబుతాడు. మరి కన్నన్ జీవితం ఇందుకు భిన్నంగా ఉందా? అతని కథ ద్వారా జ్యోతి రామయ్య మనకు చెప్పేది ఏమిటి అన్నదే ఈ మద్రాస్ మ్యాటినీ కథ.
మధ్యతరగతి జీవితాల్లోని డ్రామాకు కామెడీ జోడించి ఈ సినిమాను కార్తికేయన్ మణి తెరకెక్కించాడు. అయితే థియేటర్లలో దీనికి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఐఎండీబీ రేటింగ్ బాగానే ఉన్నా.. మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. మరి జులై 4 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



