నెల రోజుల్లోపే ఓటీటీలోకి వరలక్ష్మి శరత్‌కుమార్ తమిళ క్రైమ్ డ్రామా.. ఐఎండీబీలో 8.9 రేటింగ్.. ఇక్కడ చూసేయండి

ఓటీటీలోకి నెల రోజుల్లోపే వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన తమిళ క్రైమ్ డ్రామా స్ట్రీమింగ్ కు వస్తోంది. ఐఎండీబీలో ఏకంగా 8.9 రేటింగ్ ఉన్న ఈ సినిమా పేరు ది వర్డిక్ట్. ఈ మూవీ విశేషాలు, స్ట్రీమింగ్ డేట్ గురించి ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jun 17, 2025, 20:36:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళ క్రైమ్ కోర్ట్ రూమ్ డ్రామా ది వర్డిక్ట్ (The Verdict). మే 30వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్, సుహాసినిలాంటి వాళ్లు నటించిన ఈ సినిమాకు ఐఎండీబీలో 8.9 రేటింగ్ ఉంది. ఈ మూవీ జూన్ 26 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

నెల రోజుల్లోపే ఓటీటీలోకి వరలక్ష్మి శరత్‌కుమార్ తమిళ క్రైమ్ డ్రామా.. ఐఎండీబీలో 8.9 రేటింగ్.. ఇక్కడ చూసేయండి
నెల రోజుల్లోపే ఓటీటీలోకి వరలక్ష్మి శరత్‌కుమార్ తమిళ క్రైమ్ డ్రామా.. ఐఎండీబీలో 8.9 రేటింగ్.. ఇక్కడ చూసేయండి

ది వర్డిక్ట్ ఓటీటీ రిలీజ్ డేట్

కొత్త దర్శకుడు కృష్ణ శంకర్ దర్శకత్వం వహించిన సినిమా ది వర్డిక్ట్. శ్రుతి హరిహరన్, వరలక్ష్మి శరత్కుమార్, సుహాసిని మణిరత్నం, ప్రకాష్ మోహన్‌దాస్, విద్యుల్లేఖ రామన్ తదితరులు నటించిన 'ది వర్డిక్ట్' మూవీ మే 30న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను పూర్తిగా అమెరికాలోనే షూట్ చేయడం విశేషం.

ఈ మూవీని జూన్ 26 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది. ఓ హత్య, ఎంతో మంది అనుమానితులు, కోర్టు రూమ్ లో వాదనల చుట్టూ తిరిగే ఈ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. 'ది వర్డిక్ట్' థియేటర్లలో విడుదలైన నెల రోజుల లోపే ఓటీటీలోకి వస్తోంది.

ది వర్డిక్ట్ మూవీ గురించి..

ది వర్డిక్ట్ మూవీని కృష్ణ శంకర్ డైరెక్ట్ చేశాడు. ఓ ధనవంతురాలైన ఓ అమెరికన్ మహిళను హత్య చేసినట్లుగా ఓ ఇండియన్ మహిళపై ఆరోపణలు వస్తాయి. ఆమెను ఎంతగానో ప్రేమించే భర్త.. తన భార్యను ఈ కేసు నుండి బయటపడేయడానికి ప్రయత్నిస్తాడు. ఇందులో నమ్రత అనే ఇండియన్ మహిళ పాత్రలో శృతి హరహరన్ నటించింది.

ఇక హత్యకు గురయ్యే అమెరికన్ మహిళ ఎలిజాగా సుహాసిని కనిపించింది. నమ్రత తరఫున కోర్టులో వాదించే లాయర్ గా వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో నటించింది. ఈ సినిమా ఓ కోర్ట్ రూమ్ డ్రామానే కాదు.. ఇందులో ఓ లవ్ స్టోరీ, రివేంజ్, థ్రిల్లర్ అంశాలు కూడా ఉన్నాయని రిలీజ్ కు ముందు శృతి చెప్పింది.

ది వర్డిక్ట్ కథేంటంటే?

ది వర్డిక్ట్ మూవీలో నమ్రత, ఎలిజా మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. ఎలిజా తన వీలునామాను నమ్రతకు కూడా భారీ లబ్ధి చేకూరేలా రూపొందిస్తుంది. దీంతో ఎలిజా హత్యలో నమ్రతే ప్రధాన అనుమానితురాలిగా ఉంటుంది. మరి ఆమె నిజంగానే తన ఫ్రెండ్ ను చంపిందా లేదా అన్నదే ఈ ది వర్డిక్ట్ మూవీ కథ. అడ్వొకేట్ మాయ పాత్రలో వరలక్ష్మి నటించింది.

ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. కథకు తగినట్లుగా నిర్మాణ విలువలు లేనట్లుగా కొందరు ప్రేక్షకులు రివ్యూలు ఇచ్చారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఫ్లాప్ గా నిలిచింది. మరి జూన్ 26 నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More