తెలుగులో తమిళ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ డీఎన్ఏ- ఆరోజే రిలీజ్ చేస్తున్న సురేష్ కొండేటి- బడ్జెట్, కలెక్షన్స్ ఇవే!

తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాల్లో డీఎన్ఏ ఒకటి. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన డీఎన్‌ఏ కోలీవుడ్‌లో సూపర్ హిట్ సాధించింది. ఇప్పుడు ఈ తమిళ చిత్రం తెలుగులో మై బేబీ అనే టైటిల్‌తో విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మై బేబీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.

Jul 13, 2025, 07:28:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇటీవల కాలంలో ఇతర భాషల్లో సూపర్ హిట్ లేదా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ ట్రెండ్‌లో భాగంగా ఇప్పుడు తాజాగా మరో కొత్త పరభాష చిత్రం తెలుగులోకి వచ్చేయనుంది. ఆ సినిమానే డీఎన్ఏ.

తెలుగులో తమిళ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ డీఎన్ఏ- ఆరోజే రిలీజ్ చేస్తున్న సురేష్ కొండేటి- బడ్జెట్, కలెక్షన్స్ ఇవే!
తెలుగులో తమిళ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ డీఎన్ఏ- ఆరోజే రిలీజ్ చేస్తున్న సురేష్ కొండేటి- బడ్జెట్, కలెక్షన్స్ ఇవే!

మై బేబీ రిలీజ్ డేట్

తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన డీఎన్ఏ తెలుగులో విడుదల కానుంది. కోలీవుడ్‌లో క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో డీఎన్ఏ తెరకెక్కింది. ఈ సినిమాను తెలుగులో మై బేబీ అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు మేకర్స్. ఇటీవల మై బేబీ సినిమా తెలుగులో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీంతో రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్.

రిలీజ్ చేస్తున్న సురేష్ కొండేటి

మై బేబీ సినిమా ఈ ఏడాది జులై 18న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ప్రేమిస్తే, జర్నీ, షాపింగ్‌మాల్‌, పిజ్జా వంటి విజయవంతమైన అనువాద చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత సురేష్ కొండేటి ఈ ‘మై బేబి’ మూవీని కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు.

నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం

మై బేబీ సినిమాలోఅధర్వ మురళి, నిమిషా సజయన్‌ జంటగా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ డీఎన్ఏకు నెల్సన్‌ వెంకటేశన్‌ దర్శకత్వం వహించారు. 2014లో ఒక సాఫ్ట్‌వేర్‌ ఆర్కిటెక్ట్‌ జీవితంలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో ఈ కథ సాగుతుందని, గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లేతో రూపొందిన భావోద్వేగపూరిత కథాంశమిదని మేకర్స్‌ చెబుతున్నారు.

తమిళంలో జూన్ 20న

ఎస్‌.కె.పిక్చర్స్‌ ద్వారా మై బేబీ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సాయి చరణ్ తేజ పుల్లా, దుప్పటి గట్టు సారిక రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇదిలా ఉంటే, నెల్సన్ వెంకటేశన్, అతిషా వినో రచన అందించిన డీఎన్ఏ సినిమా తమిళంలో జూన్ 20న థియేటర్లలో విడుదలైంది.

డీఎన్ఏ ఐఎమ్‌డీబీ రేటింగ్

ఒలంపియా మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన డీఎన్ఏ రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై రిలీజ్ అయింది. ఈ సినిమాకు గిబ్రాన్ వైబోధ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. 2 గంటల 20 నిమిషాల రన్‌టైమ్ ఉన్న డీఎన్ఏ సినిమాకు ఐఎమ్డీబీ నుంచి 10కి 7.9 రేటింగ్ ఉంది. రూ. 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన డీఎన్ఏ తమిళంలో రూ. 7.36 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More