తెలుగులో ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 7.9 రేటింగ్..

ఓటీటీలోకి ఇప్పుడో తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా వస్తోంది. ఐఎండీబీలో 7.9 రేటింగ్ సాధించిన ఈ మూవీ నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కానుంది.  ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది.

Published on: Jul 16, 2025, 15:53:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ డీఎన్ఏ (DNA) ఓటీటీలోకి వచ్చేస్తోంది. 'ఫర్హానా', 'మాన్‌స్టర్' వంటి సినిమాలతో పేరుగాంచిన దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ రూపొందించిన ఈ సినిమా జూన్ 20, 2025న థియేటర్లలో విడుదలైంది. అథర్వ మురళి, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ థియేట్రికల్ రిలీజ్ కాకముందే జియోహాట్‌స్టార్ తో ఓటీటీ డీల్ ఖరారు చేసుకుంది.

తెలుగులో ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 7.9 రేటింగ్..
తెలుగులో ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 7.9 రేటింగ్..

'DNA' ఓటీటీ రిలీజ్ డేట్

థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ సాధించిన మూవీ డీఎన్ఏ. ఈ 'DNA' స్ట్రీమింగ్ అరంగేట్రం కోసం జియోహాట్స్టార్ ఇప్పుడు తేదీని ఖరారు చేసింది. శనివారం (జులై 19) నుండి ఈ మూవీ జియోహాట్‌స్టార్ లో అందుబాటులోకి రానుంది. తమిళంతో పాటు మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

నెల్సన్ వెంకటేశన్, అతిషా వినో కలిసి కథ అందించిన ఈ మూవీలో మొహమ్మద్ జీషన్ అయ్యుబ్, బాలాజీ శక్తివేల్, రమేష్ తిలక్, విజి చంద్రశేఖర్, చేతన్, రిత్విక, తెండ్రల్ రఘునాథన్, ఐశ్వర్య రఘుపతి, మానస చౌదరి, సుబ్రమణ్యం శివ, కరుణాకరన్ వంటి పలువురు నటీనటులు నటించారు.

ఒలింపియా మూవీస్ బ్యానర్‌పై జయంతి అంబేత్‌కుమార్, ఎస్ అంబేత్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సత్యప్రకాష్, శ్రీకాంత్ హరిహరన్, ప్రవీణ్ సాయివి, సాహి శివ, అనల్ ఆకాష్ సంగీతం అందించగా, జిబ్రాన్ వైభోద బీజీఎం సమకూర్చారు. పార్థిబన్ సినిమాటోగ్రఫీ అందించారు.

'DNA' స్టోరీ ఏంటంటే?

ఈ మూవీ ఆనంద్ (అథర్వ), దివ్య (నిమిషా) అనే యువ దంపతుల కథను చూపిస్తుంది. తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న వీరికి, పుట్టిన బిడ్డ తమది కాదని తెలిసినప్పుడు ఎదురయ్యే కష్టాలు ఈ సినిమా కథాంశం.

హాస్పిటల్ ఎటువంటి తప్పును అంగీకరించకపోయినా, బిడ్డకు సంబంధించిన DNA ఆధారాలు.. ఆనంద్, దివ్యకు అప్పగించిన బిడ్డ తమకు పుట్టినది కాదని స్పష్టం చేస్తాయి. దీంతో తమ బిడ్డ కిడ్నాప్ వెనుక ఉన్న అసలు కారణాలను ఛేదించాల్సి వస్తుంది.

మలయాళ నటి నిమిషా సజయన్ 'చిత్తా' చిత్రంతో తమిళ సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత 'మిషన్: చాప్టర్ 1', 'జిగర్తాండా డబుల్ఎక్స్' వంటి చిత్రాలలో నటించింది. 'లంత్రాని' (ఆంథాలజీ), 'పోచర్', 'డబ్బా కార్టెల్' వంటి వెబ్ షోలతో హిందీలో కూడా అడుగుపెట్టింది.

అథర్వ చివరిగా కార్తీక్ నరేన్ 'నిరంగల్ మూంద్రు' చిత్రంలో కనిపించాడు. 'DNA' ఈ ఏడాది అతనికి మొదటి రిలీజ్. ఈ నటుడు త్వరలో 'అడ్రస్', 'పరాశక్తి', 'ఇదయం మురళి' వంటి చిత్రాలలో నటించనున్నారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More