ఓటీటీలో సత్తాచాటుతున్న తమిళ్ ఫ్యామిలీ డ్రామా.. తెరపై దృశ్యకావ్యం.. ట్రెండింగ్‌లో ఈ మిడిల్ క్లాస్ స్టోరీ మూవీ
హార్ట్ టచింగ్ తమిళ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా మూవీ మద్రాస్ మ్యాట్నీ ఓటీటీలో అదరగొడుతోంది. నాలుగు ఓటీటీల్లో ఒకే రోజు రిలీజైన ఈ మూవీ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఆడియన్స్ ను కదిలిస్తోంది.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జీవితాలను చక్కగా చూపిస్తూ.. మధ్య తరగతి ప్రజల ఎమోషన్ ను కళ్లకు కట్టిన తమిళ సినిమా ఓటీటీలో అదరగొడుతోంది. ఒకే రోజు నాలుగు ఓటీటీల్లో రిలీజైన ఈ మూవీ ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. మిడిల్ క్లాస్ లైఫ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మద్రాస్ మ్యాట్నీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తాచాటుతోంది. ఈ సినిమా ప్రతి మనిషిని కదిలిస్తోంది.

నాలుగు ఓటీటీల్లో
2025 జూన్ 6న థియేటరల్లో రిలీజైంది మద్రాస్ మ్యాట్నీ. థియేటర్లలో ఈ తమిళ్ ఫ్యామిలీ డ్రామాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాజిటివ్ టాక్ తో ఈ మూవీ అదరగొట్టింది. జూలై 4న ఈ ఫిల్మ్ ఓటీటీలోకి వచ్చింది. ఒకే రోజు సన్ నెక్ట్స్, టెంట్ కోటా, ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్ ఓటీటీల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
ట్రెండింగ్ లో
మద్రాస్ మ్యాట్నీ మూవీ ఓటీటీలో సత్తాచాటుతోంది. ఆడియన్స్ తో శభాష్ అనిపించుకుంటోంది. ట్రెండింగ్ లో కొనసాగుతోంది. సన్ నెక్ట్స్ ఓటీటీలో మద్రాస్ మ్యాట్నీ నంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. టెంట్ కోటాలో కూడా టాప్ ప్లేస్ లో ఉంది. ప్రైమ్ వీడియో టాప్-10లో ట్రెండింగ్ అవుతోంది ఈ సినిమా. తొమ్మిదో స్థానంలో ఉంది.
కళ్లకు కట్టినట్లు
వయసు మీద పడ్డ సైంటిఫిక్ ఫిక్షన్ కథలు రాసే ఓ రైటర్ ఉంటాడు. కామన్ మ్యాన్ గురించి స్టోరీ రాయాలని అతనికి ఛాలెంజ్ ఎదురవుతుంది. ఈ క్రమంలో ఓ ఆటో రిక్షా డ్రైవర్ స్టోరీ రాస్తాడు రైటర్. ఈ క్రమంలో అతని జీవితంలోని కష్టాలు, కన్నీళ్లు, సరదాలు తెలుసుకుంటాడు. మిడిల్ క్లాస్ జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రతి మనిషిని ఈ మూవీ కదిలిస్తోంది. గతంలోకి తీసుకెళ్తుంది. మిడిల్ క్లాస్ ఆనందాలను చూపిస్తోంది. ప్రతి ఎమోషన్ ను కళ్లకు కట్టినట్లు చూపుతోంది.
ఈ మూవీకి ఓటీటీలోనూ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అచ్చం తమ స్టోరీలాగే ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మంచి సినిమా చూసిన ఫీలింగ్ అద్భుతమంటూ పోస్టులు పెడుతున్నారు.
డెబ్యూ డైరెక్టర్
మద్రాస్ మ్యాట్నీ సినిమాకు కార్తీకేయన్ మణి డైరెక్టర్. అతనికి డైరెక్టర్ గా ఇదే ఫస్ట్ మూవీ. ఇందులో సత్యరాజ్, కాలి వెంకట్, రోషిని హరిప్రియన్, షెల్లీ, జార్జ్ మరియన్, సునీల్ సుగత, మధుమిత, గీత తదితరులు నటించారు. ఈ సినిమాను మద్రాస్ పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు.














