20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన తమిళ హైస్ట్ కామెడీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఐఎండీబీలో 8.5 రేటింగ్

తమిళ హైస్ట్ కామెడీ మూవీ ఒకటి 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. విజయ్ సేతుపతి లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఐఎండీబీలో 8.5 రేటింగ్ ఉన్న ఈ మూవీ స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.

Jun 13, 2025, 14:01:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి లీడ్ రోల్లో నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మూవీ ఏస్ (Ace). ఈ సినిమా గత నెల 23న థియేటర్లలో రిలీజ్ కాగా.. 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేయడం విశేషం. శుక్రవారం (జూన్ 13) నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన తమిళ హైస్ట్ కామెడీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఐఎండీబీలో 8.5 రేటింగ్
20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన తమిళ హైస్ట్ కామెడీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఐఎండీబీలో 8.5 రేటింగ్

ఏస్ ఓటీటీ స్ట్రీమింగ్

విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ లీడ్ రోల్స్ లో నటించిన సినిమా ఏస్. ఐఎండీబీలో 8.5 రేటింగ్ సాధించి ప్రేక్షకుల మెప్పు పొందినా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళంతోపాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

రెండేళ్ల కిందటే మూవీ అనౌన్స్ చేసి గత నెల 23న థియేటర్లలో రిలీజ్ చేసినా ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయితే ఆశ్చర్యకంగా ఐఎండీబీలో మాత్రం మంచి రేటింగ్ సొంతం చేసుకుంది.

ఏస్ మూవీ గురించి..

విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ లీడ్ రోల్స్ లో నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మూవీ ఏస్. ఈ మూవీని ఆర్ముగ కుమార్ డైరెక్ట్ చేశాడు. అతడే సినిమాను కూడా నిర్మించాడు. విజయ్ కెరీర్లో 51వ సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమాలో కన్నన్ అనే పాత్రలో విజయ్ నటించాడు.

తన గతాన్ని మరచిపోయి కొత్త జీవితం ప్రారంభించాలని అతడు మలేషియా వెళ్తాడు. అయితే తన గర్ల్‌ఫ్రెండ్ ఓ సమస్యలో చిక్కుకోవడంతో ఆమె కోసం అక్కడ ఓ దోపిడీ చేస్తాడు. ఈ క్రమంలో అతడు ఓ గ్యాంగ్‌స్టర్, గర్ల్‌ఫ్రెండ్ సవతి తండ్రి, పోలీస్ అధికారికి లక్ష్యంగా మారతాడు. వాళ్ల నుంచి అతడు తప్పించుకుంటాడా లేదా అన్నదే ఈ ఏస్ మూవీ స్టోరీ.

క్రైమ్, కామెడీ, రొమాన్స్ అన్నీ కలగలపిన సినిమా ఇది. అయితే ఎందులోనూ స్టోరీ సరిగా ముందుకు సాగకపోవడం ప్రేక్షకులకు చికాకు తెప్పిస్తుంది. దీనివల్లే ఈ మూవీ బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా నిలిచింది. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సైలెంట్ గా ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టిన ఈ ఏస్ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More