...
...
Next Story

పవన్ కల్యాణ్‌కు పాట పాడాలని ఉండేది, అది ఓజీ మూవీతో నెరవేరింది.. తమిళ స్టార్ హీరో శింబు కామెంట్స్

తమిళంలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న శింబు తెలుగులో అగ్ర కథానాయకులకు పాటలు పాడి అలరించారు. ఇప్పుడు శింబు నటించిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్. ఇటీవల జరిగిన థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పాట పాడాలని ఉందని, అది ఓజీ సినిమాతో నెరవేరిందని హీరో శింబు తెలిపాడు.

Published on: May 31, 2025, 06:32:36 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

తమిళంలో స్టార్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు శింబు. తెలుగులో మన్మథ, వల్లభ, మానాడు, పాతు తల సినిమాలతో చాలా పాపులర్ అయ్యాడు. అంతకుమించి తెలుగులో స్టార్ హీరోలకు పాటలు పాడి ఎప్పుడో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకున్నాడు శింబు.

జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో

పవన్ కల్యాణ్‌కు పాట పాడాలని ఉండేది, అది ఓజీ మూవీతో నెరవేరింది.. తమిళ స్టార్ హీరో శింబు కామెంట్స్
పవన్ కల్యాణ్‌కు పాట పాడాలని ఉండేది, అది ఓజీ మూవీతో నెరవేరింది.. తమిళ స్టార్ హీరో శింబు కామెంట్స్

మంచు మనోజ్పోటుగాడు సినిమాలో బుజ్జి పిల్ల అనే పాటతో సింగర్‌గా టాలీవుడ్‌లో డెబ్యూ ఇచ్చిన శింబు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బాద్‌షా మూవీలో డైమండ్ గర్ల్ సాంగ్‌తో అలరించాడు. అనంతరం నిఖిల్ 18 పేజీస్‌లో టైమ్ ఇవ్వు పిల్ల అంటూ ఆకట్టుకున్నాడు. అలాంటి శింబు నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం థగ్ లైఫ్.

జూన్ 5 థగ్ లైఫ్ రిలీజ్

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, త్రిష, అభిరామి, శింబు నటించిన థగ్ లైఫ్ మూవీకి మణిరత్నం దర్శకత్వం వహించారు. జూన్ 5న వరల్డ్ వైడ్‌గా థగ్ లైఫ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇటీవల వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శింబు, నటుడు నాజర్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

మంచి సినిమాలను

హీరో శింబు మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. తెలుగు అభిమానులందరికీ ధన్యవాదాలు. జూన్ 5న ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా మంచి సినిమాలు సపోర్ట్ చేస్తారు. ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. జూన్ 5న మీరందరూ చూడాలని కోరుకుంటున్నాను" అని అన్నాడు.

హరి హర వీరమల్లు కూడా

నటుడు నాజర్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. థగ్ లైఫ్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక ముఖ్యమైన ఫిల్మ్ అవుతుంది. వైజాగ్‌లోనే కమల్ హాసన్ గారు చాలా రోజుల ముందు ఒక చరిత్ర రాశారు. అదే మరో చరిత్ర. ఇప్పుడు మరో చరిత్రగా ఈ సినిమా మీ ముందుకు వస్తుంది" అని అన్నారు.

37 ఏళ్ల తర్వాత యాగంలా

ఈ సినిమా ఇండియాలో ద బెస్ట్ డైరెక్టర్ మణిరత్నం గారు, ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గారు , బెస్ట్ యాక్టర్ కమల్ హాసన్ గారు.. ఇలా ద బెస్ట్ టీం కలిసి చేస్తున్న సినిమా ఇది. కమల్ హాసన్ గారు మణిరత్నం గారు 37 ఏళ్ల తర్వాత కలిసి ఒక యాగంలా ఈ సినిమా చేశారు. ఇది ఒక అద్భుతమైనటువంటి జర్నీ. ఈ సినిమా కచ్చితంగా మీరు చూడాలి. ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్" అని నాజర్ చెప్పుకొచ్చారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe