...
...
Next Story

ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి కోలీవుడ్ ఇన్వేస్టిగేట్‌ థ్రిల్ల‌ర్ మూవీ -ఐఎమ్‌డీబీలో 9.7 రేటింగ్

త‌మిళ మూవీ నిజార్‌కుడై ఓటీటీలోకి వ‌స్తోంది. మే 30 నుంచి ఆహా త‌మిళ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. దేవ‌యాని ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్ మూవీ ఐఎమ్‌డీబీలో 9.7 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

Published on: May 28, 2025, 11:13:56 IST
By
Prefer HTon Google
Advertisement

త‌మిళ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్ మూవీ నిజార్‌కుడై థియేట‌ర్ల‌లో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్న‌ది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. మే 30 నుంచి ఆహా త‌మిళ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను ఆహా ఓటీటీ అఫీషియల్గా ప్ర‌క‌టించింది. ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది. మే 9న ఈ మూవీ నిజార్‌కుడై మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఇర‌వై రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి రావ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

దేవ‌యాని లీడ్ రోల్‌...

నిజార్‌కుడై ఓటీటీ
నిజార్‌కుడై ఓటీటీ

నిజార్‌కుడై మూవీలో సీనియ‌ర్ హీరోయిన్ దేవ‌యాని లీడ్ రోల్‌లో న‌టించిన ఈ మూవీలో విజిత్‌, క‌న్మ‌ణి మ‌నోహ‌ర‌న్‌, రాజ్‌క‌పూర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ మూవీకి శివ ఆర్ముణం ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఓ చిన్నారి కిడ్నాప్ చుట్టూ ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించాడు.

వృత్తిప‌ర‌మైన బాధ్య‌త‌ల్లో ప‌డి పిల్ల‌ల‌ను నిర్ల‌క్ష్యం చేస్తే ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌వుతాయ‌నే సందేశాన్ని ఈ మూవీలో చూపించారు. ఐఎమ్‌డీబీలో ప‌దికిగాను నిజార్‌కుడై మూవీ 9.7 రేటింగ్ను సొంతం చేసుకున్న‌ది.

శ‌ర‌ణార్థి జ్యోతి క‌థ‌...

నిరంజ‌న్‌, లాన్సీ పెద్ద‌ల‌ను ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకుంటారు. నిరంజ‌న్‌కు అమెరికాలో జాబ్ రావ‌డంతో అక్క‌డికి వెళ‌తారు. వారికి నీలా అనే కూతురు ఉంటుంది. మూర్చ‌వ్యాధితో బాధ‌ప‌డుతోన్న నీలాకు జ్యోతి కేర్ టేక‌ర్‌గా ప‌నిచేయ‌డానికి వ‌స్తుంది. కొద్ది రోజుల్లోనే నీలా, జ్యోతి మ‌ధ్య మంచి బాండింగ్ ఏర్ప‌డుతుంది. అనుకోకుండా నీలా కిడ్నాప్ అవుతుంది.

నీలా మిస్సింగ్‌లో తొలుత జ్యోతిని అనుమానిస్తారు? ఆ త‌ర్వాత ఏమైంది? నీలాను కిడ్నాప్ చేసింది ఎవ‌రు? నీలా కోసం జ్యోతి ఎలాంటి త్యాగానికి సిద్ధ‌ప‌డింది? శ్రీలంక శ‌ర‌ణార్థి అయిన నీలా గ‌తం ఏమిటి అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సుస్వాగ‌తం మూవీతో...

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks