OTT Tamil: ఓటీటీలోకి ఈరోజు తెలుగులో వచ్చిన తమిళ మ్యూజికల్ డ్రామా.. సంగీత విద్వాంసుడికి అల్జీమర్స్..అమ్మాయి బ్లాక్‌మెయిల్

OTT Tamil: ఓటీటీలోకి ఈరోజు ఓ తమిళ ఫీల్ గుడ్ మ్యూజిక్ డ్రామా స్ట్రీమింగ్ కు వచ్చింది. అలనాటి నటి సుహాసిని నటించిన ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో తెలుగులోనూ చూడొచ్చు. ఆ మూవీ విశేషాలేంటో చూడండి.

Published on: Oct 15, 2026, 16:21:48 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Tamil: కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎమోషనల్ అండ్ మ్యూజికల్ డ్రామా 'చారుకేశి' (Charukesi) తెలుగు వెర్షన్ ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. బాషా, అరుణాచలం వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలను తెరకెక్కించిన దిగ్గజ దర్శకుడు సురేష్ కృష్ణ (Suresh Krissna) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ మూవీ ఆడియన్స్‌కు అందుబాటులోకి వచ్చింది.

OTT Tamil: ఓటీటీలోకి ఈరోజు తెలుగులో వచ్చిన తమిళ మ్యూజికల్ డ్రామా.. సంగీత విద్వాంసుడికి అల్జీమర్స్..అమ్మాయి బ్లాక్‌మెయిల్
OTT Tamil: ఓటీటీలోకి ఈరోజు తెలుగులో వచ్చిన తమిళ మ్యూజికల్ డ్రామా.. సంగీత విద్వాంసుడికి అల్జీమర్స్..అమ్మాయి బ్లాక్‌మెయిల్

సీనియర్ నటుడు వైజీ మహేంద్రన్ (YG Mahendran) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆయన సరసన అలనాటి స్టార్ హీరోయిన్ సుహాసిని (Suhasini) కథానాయికగా కనిపించారు.

జ్ఞాపకాలు చెరిగిపోతున్న వేళ సవాల్‌గా మారిన జీవితం

ఈ సినిమా కథ మొత్తం కర్ణాటక సంగీత విద్వాంసుడు చారుకేశి (వైజీ మహేంద్రన్) జీవితం చుట్టూ తిరుగుతుంది. ఎంతోమందికి సాయం చేస్తూ, సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న చారుకేశికి ఊహించని విధంగా అల్జీమర్స్ (Alzheimer's) వ్యాధి సోకుతుంది. రోజురోజుకూ తన పాత జ్ఞాపకాలను మర్చిపోతున్న తరుణంలో ఒక యువతి అతని జీవితంలోకి వచ్చి ఒక రహస్యంతో బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభిస్తుంది.

మరోవైపు సొంత కొడుకే అతనిపై పగ పెంచుకోవడం, వ్యాధి వల్ల తలెత్తే ఇబ్బందులు చారుకేశిని తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తాయి. నాణేనికి బొమ్మ, బొరుసు రెండూ ఉంటాయనే సూత్రాన్ని నమ్మే చారుకేశి, తన జీవితంలో ఎదురైన ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు? తన సంగీత వారసత్వాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది మిగిలిన కథ.

సీనియర్ నటీనటుల అద్భుత నటన..

ఈ సినిమాలో చారుకేశి పాత్రలో వైజీ మహేంద్రన్ అద్భుతంగా జీవించారు. ఒక సంగీత విద్వాంసుడిగా, అల్జీమర్స్ వల్ల బాధపడే వ్యక్తిగా ఆయన పండించిన హావభావాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. ఆయన భార్య భాగ్యం పాత్రలో సుహాసిని, స్నేహితుడిగా తలైవాసల్ విజయ్ తమ అనుభవంతో సీన్లను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. దేవా అందించిన సంగీతం, శంకర్ మహదేవన్ వోకల్స్ సినిమాకు క్లాసిక్ ఫీల్ తెచ్చాయి.

అయితే కొన్ని సీరియల్ తరహా సెంటిమెంట్ సీన్లు, అనవసరమైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లు సినిమా వేగాన్ని కాస్త మందగించేలా చేస్తాయి. అయినప్పటికీ ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ మూవీస్ చూడాలనుకునే ఓటీటీ ప్రియులకు 'చారుకేశి' ప్రైమ్ వీడియోలో ఒక మంచి బింజ్ వాచ్ ఆప్షన్ అవుతుంది. ముఖ్యంగా శాస్త్రీయ సంగీతాన్ని అందులోనూ కర్నాటిక్ మ్యూజిక్ ఎంజాయ్ చేసే వాళ్లకు ఈ సినిమా నచ్చుతుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More