అటు ధనుష్.. ఇటు కార్తి.. ఒకే రోజు తమిళ స్టార్ హీరోల కొత్త సినిమా అప్‌డేట్లు.. పోస్టర్లు వైరల్
ఒకే రోజు తమ ఫ్యాన్స్ కు తమిళ స్టార్ హీరోలు ధనుష్, కార్తి అదిరిపోయే న్యూస్ చెప్పారు. కొత్త సినిమాల అప్‌డేట్లు అనౌన్స్ చేశారు. కార్తి సినిమా పేరును కూడా ప్రకటించేశారు.
తమిళ స్టార్ హీరోలు ధనుష్, కార్తి ఒకే రోజు తమ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. తమ కొత్త సినిమాల అప్ డేట్స్ అందించారు. గురువారం (జూలై 10) అదిరిపోయే న్యూస్ చెప్పారు. సోషల్ మీడియా వేదికలకు తమ కొత్త సినిమాల కబుర్లను అందించారు. ఇందులో కార్తి తన సినిమా పేరును కూడా అనౌన్స్ చేశాడు.

కుబేర హిట్ తర్వాత
కుబేర లాంటి సూపర్ హిట్ తర్వాత తమిళ హీరో ధనుష్ చేయబోయే ప్రాజెక్ట్ పై అంచనాలు నెలకొన్నాయి. ఆయన ఎవరితో సినిమా చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు ఆ సస్పెన్స్ కు ధనుష్ తెరదించారు. విఘ్నేష్ రాజా డైరెక్షన్ లో ధనుష్ మూవీ చేయబోతున్నారు. డీ54 వర్కింగ్ టైటిల్తో ఈ మూవీ తెరకెక్కనుంది. దీనికి జీవీ ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్. పోర్ తోజిల్ మూవీతో యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ రాజా పాపులర్ అయ్యారు.
గెస్ట్ వెట్రిమారన్
డీ54 మూవీ షూటింగ్ ను గురువారం లాంఛనంగా ప్రారంభించారు. పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాప్ డైరెక్టర్ వెట్రిమారన్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. ధనుష్, విఘ్నేష్ రాజా కాంబినేషన్లో మూవీని వెల్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది. కొత్త సినిమా అప్ డేట్ ను ‘డీ54 ఓం నమశివాయా’ అనే క్యాప్షన్ తో పోస్టర్ ను పోస్టు చేశాడు ధనుష్.
కార్తి మూవీ టైటిల్
మరో తమిళ్ స్టార్ హీరో కార్తికొత్త సినిమా టైటిల్ ను గురువారం రివీల్ చేశారు. ఈ సినిమాకు ‘మార్షల్’ అనే పేరు పెట్టారు. తమిజ్ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. కార్తి సరసన కల్యాణి ప్రియదర్శన్ నటిస్తోంది.
‘‘డియర్ ఫ్రెండ్స్, మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలతో ఓ కొత్త అడుగు ముందుకు వేస్తుంది. మార్షల్ ఈ రోజే మొదలవుతుంది’’ అని కార్తి ఎక్స్ లో పోస్టు చేశాడు.
కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో
కార్తి కొత్త సినిమా ‘మార్షల్’ కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. కొత్త పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో కోస్టల్ విలేజ్ కనిపిస్తోంది. కానీ పోస్టర్ లో కార్తి ముఖం కనిపించలేదు. ఈ సినిమాలో కార్తి, కల్యాణి ప్రియదర్శన్, సత్యరాజ్, ప్రభు, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం సర్దార్ 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న కార్తి.. ఇప్పుడు ఏకకాలంలో మార్షల్ ను కూడా కంప్లీట్ చేయబోతున్నాడు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper



