ఓటీటీలోకి వచ్చేసిన తమిళ థ్రిల్లర్.. ఒకే రాత్రిలో జరిగే కథ.. ఫుల్ గా తాగి ట్రాప్ లో పడ్డ ఫ్రెండ్స్.. 9.0 ఐఎండీబీ రేటింగ్
ఓటీటీలోకి తమిళ్ థ్రిల్లర్ మూవీ దూసుకొచ్చింది. డిఫరెంట్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 9.0 రేటింగ్ ఉంది. మద్యం మత్తులో ఒక రాత్రిలో ఆరుగురి స్నేహితుల జీవితాలు ఎలాంటి మలుపు తీసుకున్నాయనే థ్రిల్లింగ్ కథను డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు. ఈ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?
డిఫరెంట్ స్టోరీ లైన్.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు తమిళ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న ‘మనిదర్గల్’ మూవీ ఈ రోజు (జూలై 17) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఒకే రాత్రిలో జరిగే కథ ఇది. పీకల దాకా తాగి అనుకోని ప్రమాదంలో చిక్కుకునే ఆరుగురు ఫ్రెండ్స్ స్టోరీ ఇది.

రెండు ఓటీటీల్లోకి
మే 30న థియేటర్లలో రిలీజైన మనిదర్గల్ (Manidhargal) మూవీ అదరగొట్టింది. డిఫరెంట్ కాన్సెస్ట్ తో విభిన్న ప్రయత్నంగా వచ్చిన ఈ థ్రిల్లర్ సినిమాను ఆడియన్స్ ఆదరించారు. ఈ సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేయడంతో ఐఎండీబీలో ఏకంగా 9.0 రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా గురువారం రెండు ఓటీటీల్లోకి వచ్చేసింది. ఆహా తమిళ్ తో పాటు సన్ నెక్ట్స్ లో కూడా ఈ ఫిల్మ్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. మనిదర్గల్ అంటే మనుషులు అని అర్థం.
వాస్తవ సంఘటనలు
వాస్తవ సంఘటనల ఆధారంగా మనిదర్గల్ మూవీ తెరకెక్కించారు. తమిళ సినీ ఇండస్ట్రీలో ఇదో కొత్త ప్రయత్నంగా నిలిచిపోయింది. ఈ సినిమాకి రామ్ ఇంద్ర దర్శకత్వం వహించారు. సామాజిక స్పృహ కలిగిన చిత్రంగా ఈ మూవీతో డైైరెక్టర్ డిఫరెంట్ గా స్టోరీ చెప్పడానికి ప్రయత్నించారు.
మనిదర్గల్ మూవీ గురించి..
మనిదర్గల్ మూవీ మే 30న థియేటర్లలో రిలీజైంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలే వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. ఈ సినిమా ఆరుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. ఇందులో కపిల్ వేలవన్, దక్ష లీడ్ రోల్స్ లో నటించారు. వీళ్లే కాకుండా గుణవంతన్ ధనపాల్, అర్జున్‌దేవ్ శరవణన్, సాంబ శివమ్ లాంటి వాళ్లు కూడా నటించారు.
ఈ సినిమా మొత్తం ఒక రాత్రి జరిగే స్టోరీ. చాలా వరకు షూటింగ్ కూడా రాత్రి వేళల్లోనే జరిపినట్లు కనిపిస్తుంది. ఆరుగురు స్నేహితులు ఓ రాత్రి పార్టీ అంటూ పీకలదాకా తాగుతారు. ఆ తర్వాత వాళ్ల జీవితాలు మారిపోతాయి. ఓ ఊహించని ఘటన జరుగుతుంది. దీంతో వాళ్లు ఒకరిపై మరొకరు అనుమానం వ్యక్తం చేసుకుంటారు.
అసలు ఏం జరిగింది? ఆ తర్వాత వాళ్ల జీవితాలు ఏమయ్యాయి అన్నది ఈ సినిమాలో చూడొచ్చు. ఐఎండీబీలో 9.0 రేటింగ్ సాధించిన సినిమాకు ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. ఈ తమిళ థ్రిల్లర్ మనిదర్గల్ ఆహా తమిళం, సన్ నెక్ట్స్ ఓటీటీల్లో గురువారం (జులై 17) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper



