ఓటీటీలోకి తమిళ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 9.1 రేటింగ్.. పీకలదాకా తాగి కష్టాల్లో పడే ఆరుగురు స్నేహితుల కథ

ఓటీటీలోకి ఓ గ్రిప్పింగ్ తమిళ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఐఎండీబీలో ఏకంగా 9.1 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సినిమా సుమారు 50 రోజుల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. మరి ఆ సినిమా వివరాలేంటో చూడండి.

Jul 14, 2025, 21:06:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

థ్రిల్లర్ మూవీ ఫ్యాన్స్.. ఈ వారం మీరు ఇష్టపడే ఓ గ్రిప్పింగ్ తమిళ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా పేరు మనిదర్గల్ (Manidhargal). దీనర్థం మనుషులు అని. మే 30న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేయడంతో ఐఎండీబీలో ఏకంగా 9.1 రేటింగ్ సొంతం చేసుకుంది. పీకలదాకా తాగి కష్టాల్లో పడే స్నేహితుల స్టోరీ ఇది.

ఓటీటీలోకి తమిళ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 9.1 రేటింగ్.. పీకలదాకా తాగి కష్టాల్లో పడే ఆరుగురు స్నేహితుల కథ
ఓటీటీలోకి తమిళ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 9.1 రేటింగ్.. పీకలదాకా తాగి కష్టాల్లో పడే ఆరుగురు స్నేహితుల కథ

మనిదర్గల్ ఓటీటీ రిలీజ్ డేట్

తమిళ థ్రిల్లర్ మూవీ మనిదర్గల్ (Manidhargal) ఆహా తమిళం ఓటీటీలోకి రాబోతోంది. ఈ గురువారం (జులై 17) నుంచే సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ ఓటీటీ సోమవారం (జులై 14) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

“మనిదర్గల్ ఎలా ఉన్నారు? మనిదర్గల్ జులై 17న ఆహా తమిళంలో ప్రీమియర్ కానుంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా పోస్ట్ చేసింది. ఆ పోస్టర్ పై మూవీ ఐఎండీబీరేటింగ్ 9.1గా ఉన్నట్లు చూపించారు.

మనిదర్గల్ మూవీ గురించి..

మనిదర్గల్ మూవీ మే 30న థియేటర్లలో రిలీజైంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలే వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. ఈ సినిమా ఆరుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. ఇందులో కపిల్ వేలవన్, దక్ష లీడ్ రోల్స్ లో నటించారు. వీళ్లే కాకుండా గుణవంతన్ ధనపాల్, అర్జున్‌దేవ్ శరవణన్, సాంబ శివమ్ లాంటి వాళ్లు కూడా నటించారు.

ఈ సినిమా మొత్తం ఒక రాత్రి జరిగే స్టోరీ. చాలా వరకు షూటింగ్ కూడా రాత్రి వేళల్లోనే జరిపినట్లు కనిపిస్తుంది. ఆరుగురు స్నేహితులు ఓ రాత్రి పార్టీ అంటూ పీకలదాకా తాగుతారు. ఆ తర్వాత వాళ్ల జీవితాలు మారిపోతాయి. ఓ ఊహించని ఘటన జరుగుతుంది. దీంతో వాళ్లు ఒకరిపై మరొకరు అనుమానం వ్యక్తం చేసుకుంటారు.

అసలు ఏం జరిగింది? ఆ తర్వాత వాళ్ల జీవితాలు ఏమయ్యాయి అన్నది ఈ సినిమాలో చూడొచ్చు. ఐఎండీబీలో 9.1 రేటింగ్ సాధించిన సినిమాకు ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. ఈ తమిళ థ్రిల్లర్ మనిదర్గల్ ఆహా తమిళం ఓటీటీలో గురువారం (జులై 17) నుంచి స్ట్రీమింగ్ కానుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More