...
...
Next Story

Evil Dead: చనిపోయినంత మాత్రాన చేసిన పాపాలు పోతాయా: నానా పటేకర్ మృతిపై చేసిన ‘ఈవిల్ డెడ్’ కామెంట్స్ సమర్థించుకున్న నటి

Evil Dead: బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా వెనక్కి తగ్గడం లేదు. నానా పటేకర్ మృతి తర్వాత తాను చేసిన ఈవిడ్ డెడ్ కామెంట్స్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నా.. వాటిని సమర్థించుకుంటూ మరో పోస్ట్ చేయడం విశేషం.

Published on: Oct 9, 2026, 15:50:39 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Evil Dead: సీనియర్ నటుడు నానా పటేకర్ (75) గుండెపోటుతో కన్నుమూసిన వేళ బాలీవుడ్‌లో ఒకప్పటి 'మీటూ' సెన్సేషన్ మళ్లీ తీవ్ర దుమారం రేపుతోంది. నానా పటేకర్ మరణంపై సినీ రంగానికి చెందిన ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తుంటే.. నటి తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆయన్ను పరోక్షంగా ఉద్దేశిస్తూ "ఈవిల్ డెడ్" (చెడు అంతమైంది) అని కామెంట్ చేయడం సోషల్ మీడియాను ఊపేస్తోంది.

Evil Dead: చనిపోయినంత మాత్రాన చేసిన పాపాలు పోతాయా: నానా పటేకర్ మృతిపై చేసిన ‘ఈవిల్ డెడ్’ కామెంట్స్ సమర్థించుకున్న నటి
Evil Dead: చనిపోయినంత మాత్రాన చేసిన పాపాలు పోతాయా: నానా పటేకర్ మృతిపై చేసిన ‘ఈవిల్ డెడ్’ కామెంట్స్ సమర్థించుకున్న నటి

ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించినప్పటికీ, తనుశ్రీ దత్తా అస్సలు వెనక్కి తగ్గడం లేదు. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వరుస పోస్టులు పెడుతూ తన వ్యాఖ్యలను సమర్థించుకోవడంతో నెట్టింట పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

'చెడు అంతమైంది' అంటూ తనుశ్రీ షాకింగ్ పోస్టులు

లక్నోలో ఒక ఈవెంట్‌కు హాజరైన తనుశ్రీ దత్తా.. అక్కడ నుంచి తన ఇన్‌స్టా స్టోరీస్‌లో వరుసగా పోస్ట్‌లు పెట్టింది. నానా పటేకర్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే.. "ఇది నిజంగా క్రేజీగా ఉంది. ఈ రోజు నా సోషల్ మీడియా టైమ్‌లైన్ బ్లాస్ట్ అయిపోయింది. చెడు అంతమైంది (Evil is dead). ఇకపై నా జీవితం మంచి మార్గంలో సాగుతుందని ఆశిస్తున్నా" అంటూ రాసుకొచ్చింది.

అంతటితో ఆగకుండా నటి సంధ్యా మృదుల్ రాసిన ఒక పోస్ట్‌ను రీషేర్ చేసింది. "ఒక వ్యక్తి చనిపోయినంత మాత్రాన అతడు చేసిన అన్యాయాలు, వేధింపులు పోతాయా? బాధితులకు ఆ గాయాలు మానవు" అనే కంటెంట్‌ను షేర్ చేస్తూ తనపై జరిగిన వేధింపులను మరోసారి గుర్తుచేసుకుంది.

అసలు 2008లో ఏం జరిగింది?

ఈ వివాదం 2018లో భారతీయ 'మీటూ' (#MeToo) ఉద్యమానికి ప్రధాన బీజం వేసింది. ఆ సమయంలో తనుశ్రీ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు నానా పటేకర్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కానీ సరైన ఆధారాలు లేవంటూ 2019లో పోలీసులు ఈ కేసును క్లోజ్ చేశారు. ఆ తర్వాత 2025లో కోర్టు కూడా సుదీర్ఘకాలం గడిచిపోయిందనే కారణంతో ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.

సిగ్గుచేటంటూ తీవ్రంగా స్పందించిన సినీ సంఘం

తనుశ్రీ దత్తా చేసిన కామెంట్స్‌పై ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) ప్రెసిడెంట్ సురేష్ శ్యామ్‌లాల్ గుప్తా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి చనిపోయిన సమయంలో 'ఈవిల్ డెడ్' అని అనడం అత్యంత బాధ్యతారాహిత్యమైన, సిగ్గుచేటైన చర్య అని మండిపడ్డారు. సినీ పరిశ్రమ తరఫున ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.

మరోవైపు నెటిజన్లు కూడా ఈ వ్యవహారంపై రెండు వర్గాలుగా విడిపోయారు. చనిపోయిన వ్యక్తి పట్ల కనీస గౌరవం ఉండాలని కొందరు అంటుంటే, లైంగిక వేధింపులకు గురైన బాధితురాలి ఆవేదనను అర్థం చేసుకోవాలని మరికొందరు తనుశ్రీకి సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

తనుశ్రీ దత్తా చేసిన పోస్టులు
 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks