Sign in

తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన సినిమా ‘జై బోలో తెలంగాణ’ విశేషాలు.. కేసీఆర్, స్మృతి ఇరానీ యాక్టింగ్.. ఎక్కడ చూడొచ్చంటే?

అమరవీరుల త్యాగాల ఫలం తెలంగాణ. విద్యార్థుల పోరాట ఫలితం తెలంగాణ. నేడు (జూన్ 2) తెలంగాణ అవతరణ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మారిన ‘జై బోలో తెలంగాణ’ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక్కడ తెలుసుకోండి. 

Published on: Jun 2, 2025, 10:34:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

1969 తొలి దశ ఉద్యమం నుంచి 2014లో ప్రత్యేక రాష్ట్ర అవతరణ వరకూ తెలంగాణ చరిత్ర ఎంతో ప్రత్యేకం. ఇది కేవలం రాజకీయ నాయకుల కష్టంతో వచ్చిన రాష్ట్రం కాదు. ప్రజలు ఉవ్వెత్తున ఎగసి, ఉద్యమాన్ని పరుగులు పెట్టిస్తే వచ్చిన రాష్ట్రం. విద్యార్థుల బలిదానాలకు ఫలితం. అమరుల త్యాగాలకు నిదర్శనం. నేడు (జూన్ 2) తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం.

జై బోలో తెలంగాణ (x)
జై బోలో తెలంగాణ (x)

ప్రపంచ చరిత్రలోనే తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఉద్యమంలో సినిమాల పాత్ర కూడా కీలకమే. ఇందులో ముఖ్యంగా ‘జై బోలో తెలంగాణ’ సినిమా గురించి చెప్పుకోవాలి.

రక్తాన్ని మరిగించేలా

తెలంగాణ మలి దశ ఉద్యమం తీవ్ర దశలో ఉన్న సమయంలో థియేటర్లకు వచ్చిన ‘జై బోలో తెలంగాణ’ సినిమా రక్తాన్ని మరిగించింది. ఉద్యమ కాంక్షను మరింత రగిలించింది. 2011లో తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆధారంగా హిస్టారికల్ డ్రామాగా ఈ మూవీ వచ్చింది. ఈ సినిమాకు ఎన్.శంకర్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. జగపతి బాబు, స్మృతి ఇరానీ, మీరా నందన్ తదితరులు యాక్ట్ చేశారు.

సూపర్ హిట్ సాంగ్స్

జై బోలో తెలంగాణ సినిమాలోని పాటలు ఒక్కోటి ఒక్కో ఆణిముత్యం. దివంగత చక్రిఅద్భుతమైన మ్యూజిక్ అందించారు. ‘జై బోలో తెలంగాణ’, ‘ఒక పువ్వు ఒక నవ్వు’, ‘పొడుస్తున్న పొద్దు మీద’, ‘నిజమేనా’, ‘గారడి చేస్తుండు’, ‘ఈ గాయం’.. ఇలా ప్రతి ఒక్క పాట సూపర్ హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా గద్దర్ రాసి పాడిన పొడుస్తున్న పొద్దు మీద సాంగ్ ఆల్ టైమ్ హిట్స్ ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది. మరోవైపు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా గారడి చేస్తుండు పాట రాయడం విశేషం.

ఎక్కడ ఉందంటే?

జై బోలో తెలంగాణ సినిమా జియోహాట్స్టార్ ఓటీటీలో చూడొచ్చు. అలాగే యూట్యూబ్ లోనూ ఈ సినిమాను ఉచితంగా వీక్షించే అవకాశముంది. ఈ మూవీ తెలంగాణ ప్రజల మనసులను దోచుకుంది. రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటడంతో పాటు ఉద్యమ ఘటనలతో తల ఎత్తుకునేలా చేసింది.

సీమాంధ్రలో రిలీజ్ చేయమంటే

ఈ సినిమాకు ముందుగా ఓ ప్రొడక్షన్ హౌస్ నిర్మించాలని అనుకుంది. కానీ స్టోరీ విన్న తర్వాత సీమాంధ్ర ప్రాంతంలో మాత్రం సినిమా రిలీజ్ చేయమని చెప్పారంటా. ఈ విషయాన్ని డైరెక్టర్ శంకర్ చాలా సార్లు చెప్పారు. చివరకు శంకర్ ప్రొడ్యూసర్ గా మారి సినిమాను రిలీజ్ చేశారు.

తెలంగాణ తల్లి

తెలంగాణ తల్లి.. ఈ పేరు వినగానే గుర్తుకొస్తారు స్మృతి ఇరానీ. ఈ కేంద్ర మాజీ మంత్రి జై బోలో తెలంగాణ సినిమాలో పవర్ ఫుల్ పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసే క్యారెక్టర్ ప్లే చేశారు. ఇదే తెలుగులో ఆమెకు తొలి సినిమా. ఈ సినిమాలో నటనతోనే ఆమె తెలంగాణ తల్లిగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో రాణించిన స్మృతి ఇరానీ.. హిందీ సీరియల్స్, సినిమాల్లోనూ యాక్ట్ చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆమె ఇప్పుడు మళ్లీ సీరియల్ చేస్తున్నారు.

ఆ ఆవార్డులు

జై బోలో తెలంగాణ సినిమాకు పలు అవార్డులు దక్కాయి. అయిదు నంది అవార్డులు వచ్చాయి. దక్షిణాసియా ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమాను ప్రదర్శించారు. మరోవైపు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు స్మృతి ఇరానీ, అద్దాంకి దయాకర్, ఆర్ విద్యాసాగర్ రావు తదితర రాజకీయ నాయకులు ఈ మూవీలో యాక్ట్ చేశారు. ఈ మూవీకి 7.2 ఐఎండీబీ రేటింగ్ ఉంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More