మరో ఓటీటీలోకి వస్తున్న తెలుగు బోల్డ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. చీరలో సెక్సీగా కనిపించిన అమ్మాయి కోసం ఉన్మాదిగా మారి..
తెలుగు బోల్డ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ రెండు వారాల వ్యవధిలో మరో ఓటీటీలోకి వస్తోంది. చీరలో సెక్సీగా కనిపించిన అమ్మాయిని దక్కించుకోవడానికి ఉన్మాదిగా మారే ఓ యువకుడి చుట్టూ తిరిగే మూవీ ఇది. ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ సమర్పించాడు.
థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత తెలుగు బోల్డ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ శారీ (Saaree) రెండో ఓటీటీలోకి అడుగుపెడుతోంది. గత నెల 27 నుంచి ఈ సినిమా లయన్స్‌గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడు ఆహా వీడియో ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమాను ఆర్జీవీ సమర్పించిన విషయం తెలిసిందే.

శారీ ఓటీటీ రిలీజ్ డేట్
ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ సమర్పణలో వచ్చిన సినిమా శారీ. ఈ ఏడాది ఏప్రిల్ 4న థియేటర్లలో రిలీజైంది. అతని ఆర్జీవీ డెన్ ప్రోడక్ట్ ఈ సినిమా. ఈ మధ్యకాలంలో వర్మ చాలా సినిమాల్లాగే ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. జూన్ 27 నుంచి లయన్స్‌గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక శుక్రవారం (జులై 11) నుంచి ఆహా వీడియో ఓటీటీలోనూ రానుంది. “అతడు ఆమెను చీరలో చూసి.. మతిస్థిమితం కోల్పోయాడు. ప్రేమగా మొదలైనది ఒక వ్యామోహంగా మారింది. ఆమెను తనదిగా చేసుకోవడానికి అతను ఎంత దూరం వెళ్తాడు? జులై 11 నుండి ఆహాలో మాత్రమే స్ట్రీమింగ్ కానున్న రామ్ గోపాల్ వర్మ శారీ చూడండి” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.
శారీ మూవీ గురించి..
శారీ మూవీని నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు గతంలోనే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వెల్లడించాడు. ఈ సినిమాను ఆర్జీవీసమర్పించగా.. గిరి కృష్ణ కమల్ డైరెక్ట్ చేశాడు. ఓ అమ్మాయి కోసం ఉన్మాదిగా మారే యువకుడి చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఈ కాలం యువత సోషల్ మీడియా పేరుతో ఎలా పక్కదారి పడుతోందో, అమ్మాయిలు ఎలా బలవుతున్నారో చూపించే ప్రయత్నం ఈ సినిమా ద్వారా చేశారు.
ఈ సినిమా కిట్టు (సత్య యదు) అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతడు ఓ రోజు ఫ్రెండ్స్ తో కలిసి ఓ టూర్ వెళ్తాడు. అక్కడ ఆరాధ్య దేవి (ఆరాధ్య దేవి) అనే అమ్మాయి చీర కట్టుకొని ఎంతో అందంగా ముస్తాబై అతనికి కనిపిస్తుంది. అప్పటి నుంచే ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని అనుకుంటాడు. ఆమెకు ప్రపోజ్ కూడా చేస్తాడు. కానీ ఆమె నిరాకరిస్తుంది. దీంతో కిట్టు ఉన్మాదిలా మారిపోతాడు. ఆమెను దక్కించుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు.
ఓ బలమైన సామాజిక సందేశంతో తెరకెక్కిన సినిమానే అయినా.. దానిని స్క్రీన్ పై చూపించిన తీరు దారుణంగా ఉంది. మితిమీరిన హింస, బోల్డ్‌నెస్ తో ఫ్యామిలీ ప్రేక్షకులకు మూవీ దూరమైంది. థియేటర్లలో అసలు ఎవరూ పట్టించుకోలేదు. మరి ఆహా వీడియో ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper













