...
...
Next Story

ఓటీటీలో అదరగొడుతున్న తెలుగు క్రైమ్ కామెడీ సినిమా.. ట్రెండింగ్‍లో ఫస్ట్ ప్లేస్.. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్

సారంగపాణి జాతకం సినిమా ఓటీటీలో అదరగొడుతోంది. థియేటర్లలో పెద్దగా సక్సెస్ కాలేకపోయినా.. డిజిటల్ వేదికపై సత్తాచాటుతోంది. ఈ మూవీ ట్రెండింగ్‍లో దూసుకొచ్చింది.

Published on: Jun 2, 2025, 16:03:20 IST
By
Prefer HTon Google
Advertisement

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి హీరోగా నటించిన ‘సారంగపాణి జాతకం’ మంచి అంచనాలను నెలకొల్పింది. కోర్ట్ తర్వాత దర్శి నుంచి వచ్చిన మూవీ కావడం, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించడంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 25న ఈ సారంగపాణి జాతకం చిత్రం థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ క్రైమ్ కామెడీ మూవీ మిక్స్డ్ టాక్ దక్కించుకొని.. ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో మాత్రం ఈ చిత్రం అదరగొడుతోంది.

ట్రెండింగ్‍లో హవా

ఓటీటీలో అదరగొడుతున్న తెలుగు క్రైమ్ కామెడీ సినిమా.. ట్రెండింగ్‍లో ఫస్ట్ ప్లేస్.. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
ఓటీటీలో అదరగొడుతున్న తెలుగు క్రైమ్ కామెడీ సినిమా.. ట్రెండింగ్‍లో ఫస్ట్ ప్లేస్.. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్

సారంగపాణి జాతకం మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో సినిమాల ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు దూసుకొచ్చింది. ఈ మూవీ మే 23వ తేదీన ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఈ చిత్రం ఎంట్రీ ఇచ్చింది.

సారంగపాణి జాతకం మూవీకి ప్రైమ్ వీడియోలో క్రమంగా వ్యూస్ పెరిగాయి. రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది. నాలుగు భాషల్లో రావడంతో వ్యూస్‍కు మరింత ప్లస్ అయింది. మొత్తంగా ఈ మూవీ ట్రెండింగ్‍లో అదరగొడుతోంది. ప్రస్తుతం (జూన్ 2) ప్రైమ్ వీడియోలో ఇండియా వైడ్ సినిమాల ట్రెండింగ్ లిస్టులో టాప్ ప్లేస్‍లో ఉంది. మరిన్ని రోజులు జోరు కొనసాగొచ్చు.

జాతకం నమ్మి హత్య చేసేందుకు..

క్రైమ్, కామెడీ ఎలిమెంట్లతో సారంగపాణి జాతకం చిత్రాన్ని డైరెక్టర్ ఇంద్రగంటి తెరకెక్కించారు. జాతకం ప్రకారం భవిష్యత్తులో హత్య చేస్తావని జ్యోతిషుడు చెప్పడంతో.. ఓ చెడు వ్యక్తిని చంపేందుకు సారంగపాణి (ప్రియదర్శి) ప్రయత్నాలు చేయడం చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. ఈ మూవీలో ప్రియదర్శిసరసన రూప కొడవయూర్ హీరోయిన్‍గా నటించారు. వెన్నెల కిశోర్, శ్రీనివాస్ అవసరాల, తనికెళ్ల భరణి కీలకపాత్రలు పోషించారు.

సారంగపాణి జాతకం మూవీని శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ప్రొడ్యూజ్ చేశారు. వివేక్ సాగర్ సంగీతం అందించగా.. పీజీ వింద సినిమాటోగ్రఫీ చేశారు.

సారంగపాణి జాతకం స్టోరీలైన్

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks