20 రోజుల్లోనే ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. పోలీస్ వర్సెస్ కామన్ మ్యాన్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..
ఓటీటీలోకి ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ 20 రోజుల్లోనే వచ్చేస్తోంది. ఓ పోలీస్, మరో కామన్ మ్యాన్ మధ్య వార్ తో సాగే సినిమా ఇది. నవీన్ చంద్ర లీడ్ రోల్లో నటించిన ఈ మూవీ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందన్న వివరాలు చూడండి.
తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ షో టైమ్ (Show Time) ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెలలోనే థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఇదే నెలలో డిజిటల్ ప్రీమియర్ కూ సిద్ధమవుతుండటం విశేషం. నవీన్ చంద్ర, రాజా రవీంద్ర, కామాక్షి భాస్కర్ల నటించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రెస్పాన్స్ రాలేదు.
20 రోజుల్లోనే ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. పోలీస్ వర్సెస్ కామన్ మ్యాన్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..
షో టైమ్ ఓటీటీ రిలీజ్ డేట్
తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ షో టైమ్ జులై 4న థియేటర్లలో రిలీజైంది. దీనికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఓ డిఫరెంట్ స్టోరీతో వచ్చినా స్క్రీన్‌ప్లే దెబ్బ తీసిందంటూ రివ్యూలు వచ్చాయి. ఇప్పుడీ మూవీ వచ్చే శుక్రవారం (జులై 25) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ విషయాన్ని ఆ ఓటీటీ శనివారం (జులై 19) వెల్లడించింది. “ప్రశాంతంగా ఉండే ఓ ఇల్లు ఓ డెడ్లీ మిస్టరీకి కేంద్రంగా మారితే.. షో టైమ్ జులై 25 నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. దీనికి ఓ పోస్టర్ కూడా జోడించింది.
షో టైమ్ మూవీ గురించి..
షో టైమ్ మూవీని మదన్ దక్షిణామూర్తి డైరెక్ట్ చేశాడు. ఇందులో నవీన్ చంద్ర, రాజా రవీంద్ర, కామాక్షి భాస్కర్ల, నరేష్ లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమాలో సూర్య అనే పాత్రలో నవీన్ చంద్ర నటించాడు. అతని భార్య శాంతి పాత్రలో కామాక్షి, లక్ష్మీకాంత్ అనే సీఐ పాత్రలో రాజా రవీంద్ర, లాయర్ వరదరాజులు పాత్రలో నరేష్ కనిపించారు.
ఈ సినిమా సూర్య, శాంతి, లక్ష్మీకాంత్ చుట్టూ తిరుగుతుంది. ఓ హత్య వీళ్ల జీవితాలను ఎలా మార్చేస్తుందన్నదే మూవీ కథ. సూర్య, లక్ష్మీకాంత్ మధ్య ఉన్న ఈగో సమస్యలు ఆ కుటుంబాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ క్రైమ్ నుంచి వాళ్లు తప్పించుకుంటారా లేదా అన్నదే షో టైమ్ మూవీ స్టోరీ.
ఈ సినిమా జులై 4న థియేటర్లలో రిలీజైంది. అయితే ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దీంతో మూడు వారాల్లోనే సన్ నెక్ట్స్ ఓటీటీలోకి వస్తోంది. జులై 25 నుంచి ఈ సినిమాను చూడొచ్చు.