OTT Mystery Thriller: ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. పచ్చని కాపురాల్లో హత్యల చిచ్చు.. అదిరిపోయిన టీజర్

OTT Mystery Thriller: ఓటీటీలోకి మరో తెలుగు మిస్టరీ థ్రిల్లర్ రాబోతోంది. ఆహా వీడియో ఓటీటీ తాజాగా రిలీజ్ చేసిన ఓ చిన్న టీజర్ రాబోయే కంటెంట్ పై ఎంతో ఆసక్తి రేపుతోంది. రోజువారీ వార్తల్లో చూస్తున్న భార్యాభర్తల హత్యల ఉదంతాల చుట్టూ తిరిగే స్టోరీ ఇది.

Published on: Sep 23, 2026, 18:31:38 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Mystery Thriller: ఓటీటీలో మిస్టరీ థ్రిల్లర్ కంటెంట్ ఇష్టపడే వారికి ఆహా వీడియో ఓటీటీ బుధవారం (సెప్టెంబర్ 23) రిలీజ్ చేసిన ఓ చిన్న టీజర్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఈ ఓటీటీలోకి ఓ అదిరిపోయే ఒరిజినల్ వెబ్ సిరీస్ రాబోతున్నట్లు దీని ద్వారా స్పష్టమైంది. మరి ఆ టీజర్ ఏంటి? స్టోరీ ఏంటో చూడండి.

OTT Mystery Thriller: ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. పచ్చని కాపురాల్లో హత్యల చిచ్చు.. అదిరిపోయిన టీజర్
OTT Mystery Thriller: ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. పచ్చని కాపురాల్లో హత్యల చిచ్చు.. అదిరిపోయిన టీజర్

త్వరలోనే మిస్టరీ ప్రారంభం కాబోతోంది

ఆహా వీడియో ఓటీటీ తన ఎక్స్ అకౌంట్లో ఓ టీజర్ రిలీజ్ పోస్ట్ చేసింది. మిస్టరీ బిగిన్స్ సూన్ అనే క్యాప్షన్ తో ఈ టీజర్ పోస్ట్ చేసింది. అది ఓ ఫోన్ కాల్, కాలర్ ట్యూన్ తో మొదలైంది. ఓ అమ్మాయి అబ్బాయితో ఫోన్ లో మాట్లాడుతుండటం వినొచ్చు. తనకు నిద్ర రావడం లేదంటూ అమ్మాయి చెప్పడం.. మళ్లీ ఏం ఆలోచిస్తున్నావని అబ్బాయి అడగడం.. తాను సడెన్ గా కనిపించకుండాపోతే ఏం చేస్తావని ఆమె అడగడం ఆసక్తి రేపుతుంది.

కనిపించకుండాపోతే ఏం చేస్తావ్..

అయితే ఆ అమ్మాయి అడిగే ప్రశ్న విని ఆ అబ్బాయే కాదు.. అందరూ షాకవడం ఖాయం. ముందు ఫోన్ చేస్తా.. లిఫ్ట్ చేయకపోతే ఇంటికి వస్తా.. ఇంట్లో లేకపోతే వెతుకుతా.. నువ్వు దొరికే వరకూ వెతుకుతూనే ఉంటా అని ఆ అబ్బాయి అంటాడు. ఒకవేళ నేను దొరక్కపోతే అని ఆమె అనడంతో అబ్బాయి షాకవుతాడు. అప్పుడే ఫోన్ కట్ అవుతుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆమెకు ఏమైంది అన్న క్యూరియాసిటీ ఈ టీజర్ చూస్తే కలుగుతుంది.

భార్యాభర్తల హత్యల చుట్టూ తిరిగే స్టోరీ

అయితే ఈ టీజర్ మొత్తం ఎక్కడా ఇందులో నటించబోయే పాత్రలు కనిపించవు. అమ్మాయి, అబ్బాయి మధ్య ఫోన్ కాల్ నడుస్తుండగా.. రోజువారీ న్యూస్ పేపర్లలో వచ్చే వార్తలు కనిపిస్తాయి. భర్తను చంపిన భార్య.. భార్యను హతమార్చిన భర్త.. ఇలాంటి వార్తలు రోజూ చూస్తేనే ఉంటాం కదా. ఇలాంటి వార్తల ఆధారంగానే ఈ ఒరిజినల్ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నట్లు ఆహా వీడియో ఓటీటీ వెల్లడించింది.

ప్రతి కేసులో ఒక అనుమానం, ఒక మోసం, ఒక నిజం, కానీ ఈసారి..? అనే ప్రశ్నార్థకంతో ఈ టీజర్ ను ముగించారు. ఇది క్యూరియాసిటీని మరో లెవెల్ కు తీసుకెళ్లింది.

ప్రస్తుతం ప్రియుల మోజులో పడి భర్తను భార్య, భార్యను భర్త హత్య చేయడాలు చాలా ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలుసు కదా. అలాంటి ట్రెండింగ్ సబ్జెక్ట్ నే కథగా తీసుకొని ఆహా వీడియో ఓ మిస్టరీ థ్రిల్లర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. అసలు అదేంటి? ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు? ఎవరు నటిస్తున్నారన్న విషయాలు త్వరలోనే వెల్లడించనున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More