ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్.. ఐఎండీబీలో 9.5 రేటింగ్.. రెండున్నర నెలల తర్వాత స్ట్రీమింగ్
ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా రెండున్నర నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ మూవీకి ఐఎండీబీలో ఏకంగా 9.5 రేటింగ్ ఉండటం విశేషం.
ఓటీటీలోకి రవితేజ మేనల్లుడు నటించిన మూవీ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ సినిమా పేరు జగమెరిగిన సత్యం. తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజ్ కాగా.. మొత్తానికి రెండున్నర నెలల తర్వాత ఈ వారమే ఓటీటీలోకి వస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడాలి? అసలు కథేంటి అన్న వివరాలు ఇక్కడ చూడండి.

జగమెరిగిన సత్యం ఓటీటీ రిలీజ్ డేట్
తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్మూవీ జగమెరిగిన సత్యం. ఈ సినిమా వచ్చే శుక్రవారం (జులై 4) నుంచి సన్ నెక్ట్స్ (Sun NXT) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని సోమవారం (జూన్ 30) ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
“అహంకారంతో నడిచే ఓ ఊళ్లో ఒక వ్యక్తి ప్రేమ అతని అతిపెద్ద తిరుగుబాటు అయింది. జగమెరిగిన సత్యం.. జులై 4 నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.
జగమెరిగిన సత్యం మూవీ స్టోరీ ఏంటంటే?
జగమెరిగిన సత్యం సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజైంది. ఐఎండీబీలో ఏకంగా 9.5 రేటింగ్ సొంతం చేసుకుంది. అయితే బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు. ఇదో రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో వచ్చిన మరో సినిమా. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండే దిండ అనే గ్రామంలో 1994లో జరిగిన కథగా సాగుతుంది.
ఈ సినిమాలో సత్యం అనే పాత్రలో రవితేజ మేనల్లుడు అవినాశ్ వర్మ నటించాడు. సత్యం, సరిత ప్రేమ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. సర్పంచ్ మేనకోడలైన సరితను సత్యం ప్రేమించడం ఆ ఊళ్లో పెద్ద దుమారమే రేపుతుంది. తిరుపతి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను విజయ భాస్కర్ నిర్మించాడు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించాడు.
అవినాశ్ వర్మతోపాటు ఆద్యరెడ్డి, నీలిమ, వాసుదేవరావు, నితిన్ భోగరాజు లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపని ఈ జగమెరిగిన సత్యం మూవీ ఇప్పుడు సన్ నెక్ట్స్ ఓటీటీలోకి జులై 4న అడుగుపెట్టబోతోంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



