...
...
Next Story

ఆది సాయి కుమార్‌కు విలన్‌గా చక్రవాకం సీరియల్ హీరో ఇంద్రనీల్.. హారర్ థ్రిల్లర్ శంబాల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్!

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ శంబాల. ఈ సినిమాలో ఆది సాయి కుమార్‌కు విలన్‌గా చక్రవాకం సీరియల్ హీరో ఇంద్రనీల్ నటించాడు. శంబాలలో మల్లేష్ పాత్రలో నటించిన ఇంద్రనీల్ వర్మ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు.

Published on: Jun 1, 2025, 13:43:12 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

టాలీవుడ్ యంగ్ అండ్ వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’. ఇప్పటి వరకు ఈ ‘శంబాల’ నుంచి వచ్చిన పోస్టర్‌లు, పాత్రల్ని రివీల్ చేస్తున్న తీరు అందరిలోనూ ఆసక్తిని పెంచేసిన సంగతి తెలిసిందే.

క్రూరమైన రీతిలో

ఆది సాయి కుమార్‌కు విలన్‌గా చక్రవాకం సీరియల్ హీరో ఇంద్రనీల్.. హారర్ థ్రిల్లర్ శంబాల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్!
ఆది సాయి కుమార్‌కు విలన్‌గా చక్రవాకం సీరియల్ హీరో ఇంద్రనీల్.. హారర్ థ్రిల్లర్ శంబాల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్!

రీసెంట్‌గానే ‘శంబాల’ మేకింగ్ వీడియోని కూడా రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు. తాజాగా శంబాల సినిమాలో చక్రవాకం సీరియల్ హీరో ఇంద్రనీల్ వర్మ పోషించిన మల్లేష్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ అతన్ని భయంకరమైన, క్రూరమైన రీతిలో చూపిస్తోంది.

భీకరంగా మల్లేష్ పాత్ర

వెనకాల ఉన్న ఊరి ప్రజల్ని చూస్తుంటే మల్లేష్ ఏదో విధ్వంసం సృష్టించినట్టుగానే కనిపిస్తోంది. అలాగే, మల్లేష్ అరుస్తూ భీకరంగా కనిపించాడు. అతన్ని చూస్తూ ఊరి ప్రజలు భయంతో అలాగే ఉండిపోవడం ఈ పోస్టర్‌లో గమనించవచ్చు. అయితే, శంబాల సినిమాలో ఇంద్రనీల్ విలన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

విలన్‌గా గట్టి పోటీ

ఆది సాయి కుమార్‌కు విలన్‌గా శంబాలలో ఇంద్రనీల్ గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. ఇలా పోస్టర్‌లతోనే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ శంబాల చిత్ర యూనిట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే, షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి శంబాల సినిమాను నిర్మిస్తున్నారు.

శంబాల నటీనటులు

తెలుగు హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతోన్న శంబాల సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. శంబాల చిత్రంలో ఆది సాయి కుమార్, ఇంద్రనీల్‌తోపాటు అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ మూవీ శంబాల విడుదల తేదీని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

చక్రవాకం సీరియల్‌తో

ఆ తర్వాత అనేక సీరియల్స్‌లో ఇంద్రనీల్ నటించి అలరించాడు. అపరంజి, సూర్యపుత్రుడు వంటి సీరియల్లలో యాక్ట్ చేశాడు ఇంద్రనీల్. ప్రస్తుతం జెమినీ టీవీ ఛానెల్‌లో ప్రసారం అవుతున్న దేవయాని ధారావాహికలో ఇంద్రనీల్ నటిస్తున్నాడు. ఇక సినిమాల్లో సైతం ఇంద్రనీల్ నటించాడు.

రామ్ చరణ్‌తో ఇంద్రనీల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాలో ఓ పాత్రలో ఇంద్రనీల్ మెరిశాడు. ఇప్పుడు ఆది సాయి కుమార్ శంబాలలో పవర్ ఫుల్ రోల్‌తో వెండితెరపై మెప్పించేందుకు రెడీ అయ్యాడు సీరియల్ హీరో ఇంద్రనీల్ వర్మ.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks