తెలుగు టీవీ సీరియల్స్ 47వ వారం టీఆర్పీ రేటింగ్స్ ఇలా.. టాప్ 10 సీరియల్స్‌లో మారిన స్థానాలు.. కాస్త తగ్గిన కార్తీక దీపం

తెలుగు టీవీ సీరియల్స్ 47వ వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. కార్తీకదీపం 2 సీరియల్ తన దూకుడు కొనసాగిస్తున్నా.. ఓవరాల్‌గా రేటింగ్ కాస్త తగ్గింది. టాప్ 10 సీరియల్స్ లో కొన్ని స్థానాలు మారిపోయాయి. అవేంటో చూడండి.

Published on: Dec 4, 2025, 14:44:51 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగులో టాప్ 10 సీరియల్స్ లిస్టు మరోసారి వచ్చేసింది. ఈ ఏడాది 47వ వారం రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. ఎప్పటిలాగే స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ టాప్ 10లో చోటు సంపాదించినా.. ఈవారం వాటి స్థానాలు కాస్త అటూఇటూగా మారాయి. ఓవరాల్ గా కొన్ని సీరియల్స్ రేటింగ్స్ కూడా 47వ వారం కాస్త తగ్గాయి.

తెలుగు టీవీ సీరియల్స్ 47వ వారం టీఆర్పీ రేటింగ్స్ ఇలా.. టాప్ 10 సీరియల్స్‌లో మారిన స్థానాలు.. కాస్త తగ్గిన కార్తీక దీపం
తెలుగు టీవీ సీరియల్స్ 47వ వారం టీఆర్పీ రేటింగ్స్ ఇలా.. టాప్ 10 సీరియల్స్‌లో మారిన స్థానాలు.. కాస్త తగ్గిన కార్తీక దీపం

స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

తెలుగు టీవీ సీరియల్స్ లో స్టార్ మా దూకుడు ఇప్పటిది కాదు. కొన్నేళ్లుగా ఆ ఛానెల్ సీరియల్సే టాప్ లో ఉంటూ వస్తున్నాయి. తాజా రేటింగ్స్ కూడా అందుకు భిన్నంగా ఏమీ లేవు. కార్తీక దీపం 2 సీరియల్ ఈ జాబితాలో తొలి స్థానంలో ఉంది. గత వారంతో పోలిస్తే రేటింగ్ కాస్త తగ్గి.. 15.68గా ఉంది. అంతేకాదు అటు అర్బన్, ఇటు రూరల్ రెండింట్లోనూ నంబర్ వన్ ఈ సీరియలే కావడం విశేషం.

రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు కొనసాగుతోంది. ఈ సీరియల్ కు తాజాగా 14.08 రేటింగ్ నమోదైంది. మూడో స్థానంలోకి మరోసారి ఇంటింటి రామాయణం వచ్చింది. గుండె నిండా నిండా గుడి గంటలను వెనక్కి నెట్టి 13.45 రేటింగ్ తో ఉంది. ఇక 13.19 రేటింగ్ తో గుండె నిండా గుడి గంటలు సీరియల్ నాలుగో స్థానానికి పడిపోయింది.

ఇక చిన్ని సీరియల్ 10.75 రేటింగ్ సాధించింది. ఇది 47వ వారం కూడా ఐదో స్థానంలోనే కొనసాగుతోంది. ఇక మరో స్టార్ మా సీరియల్ నిండు మనసులు 8.61తో తన ఆరో స్థానాన్ని పదిలం చేసుకుంది.

జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

టాప్ 10 తెలుగు టీవీ సీరియల్స్ లో చివరి నాలుగు స్థానాల్లో జీ తెలుగు సీరియల్స్ కొనసాగుతున్నాయి. ఇందులో వచ్చే మేఘసందేశం సీరియల్ 8.29 రేటింగ్ తో ఓవరాల్ గా 7వ స్థానంలో నిలిచింది. ఇక చామంతి సీరియల్ 8.08 రేటింగ్ తో ఎనిమిదవ స్థానంలో ఉంది.

జయం సీరియల్ 7.93, జగద్ధాత్రి 7.90తో 9, 10వ స్థానాల్లో నిలిచాయి. కొన్ని వారాలుగా టాప్ 10లో ఉంటూ వస్తున్న లక్ష్మీనివాసం సీరియల్ ఈసారి 11వ స్థానంతో సరిపెట్టుకుంది. 7.80 రేటింగ్ తో తృటిలో టాప్ 10లో స్థానం కోల్పోయింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More