ఇవాళ రిలీజైన దళపతి విజయ్ జన నాయకుడు ఫస్ట్ రోర్.. బర్త్ డే సందర్భంగా గ్లింప్స్.. నా హృదయంలో ఉండే అంటూ!

దళపతి విజయ్ బర్త్ డే ఇవాళ (జూన్ 22). విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన చివరి చిత్రం జన నాయకుడు ఫస్ట్ రోర్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఆద్యం ఇంటెన్సివ్‌గా ఉన్న జన నాయగన్ గ్లింప్స్ మైండ్ బ్లోయింగ్ విజువల్స్‌తో ఆన్‌లైన్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Published on: Jun 22, 2025, 12:53:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్న‌టిస్తోన్న ‘జ‌న నాయ‌కుడు’ చిత్రాన్ని హిస్టారిక‌ల్ మూవీగా అంద‌రూ అభివ‌ర్ణిస్తున్నారు. అందుకు కార‌ణం ఆయ‌న న‌టిస్తోన్న చివ‌రి చిత్ర‌మిది. అయితే, ద‌ళ‌ప‌తి విజ‌య్ బ‌ర్త్ డే (జూన్ 22) సంద‌ర్భంగా మేక‌ర్స్ జన నాయకుడు ఫ‌స్ట్ రోర్‌ గ్లింప్స్‌ను ఇవాళ విడుద‌ల చేశారు.

ఇవాళ రిలీజైన దళపతి విజయ్ జన నాయకుడు ఫస్ట్ రోర్.. బర్త్ డే సందర్భంగా గ్లింప్స్.. నా హృదయంలో ఉండే అంటూ!
ఇవాళ రిలీజైన దళపతి విజయ్ జన నాయకుడు ఫస్ట్ రోర్.. బర్త్ డే సందర్భంగా గ్లింప్స్.. నా హృదయంలో ఉండే అంటూ!

సెన్సేషనల్‌గా

ఇప్పుడీ జన నాయకుడు గ్లింప్స్ ఇంట‌ర్నెట్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. విజయ్ చివ‌రి చిత్రం కావ‌టంతో ఈ లెజెండ్రీకి వీడ్కోలు పల‌క‌టానికి బీజం చేసిన‌ట్లు గ్లింప్స్ రెడీ చేసినట్లు అర్థ‌మ‌వుతుంది.

మైండ్ బ్లోయింగ్ విజువల్స్

ఇక 65 సెక‌న్ల వ్య‌వ‌ధి ఉన్న ‘జ‌న నాయ‌కుడు’ ఫ‌స్ట్ రోర్ వీడియోను గ‌మ‌నిస్తే.. ‘నా హృద‌యంలో ఉండే..’ అనే మాట‌లు విజ‌య్ వాయిస్‌లో మ‌న‌కు వినిపిస్తాయి. పోలీస్ డ్రెస్‌లో లాఠీ ప‌ట్టుకుని యుద్ధ వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పించే ప్ర‌దేశంలో న‌డుస్తూ వ‌స్తుంటారు. ఈ విజువ‌ల్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి.

సాధార‌ణ వీడ్కోలుగా లేదని

శ‌క్తి, శాంతి, గంభీరత‌ను క‌ల‌గ‌లిపేలా ఉన్న ఈ స‌న్నివేశం చూస్తుంటే జ‌న నాయ‌గ‌న్ మూవీ ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి సాధార‌ణ వీడ్కోలుగా లేదని స్ప‌ష్టంగా తెలుస్తోంది. జన నాయకుడు ఫ‌స్ట్ రోర్ వీడియోతో పాటు విడుద‌లైన బ‌ర్త్ డే పోస్ట‌ర్ మ‌రింతగా మెప్పిస్తోంది.

చేతిలో క‌త్తి పట్టుకుని

పెద్ద సింహాస‌స‌నం మీద ద‌ళ‌ప‌తి విజ‌య్ ఠీవిగా కూర్చుని చేతిలో క‌త్తిని ప‌ట్టుకున్నాడు. ఇంటెన్స్ బ్యాక్‌డ్రాప్‌లో కూర్చున్న విజ‌య్ చుట్టూ పొగ ఆవ‌రించబ‌డి ఉంది. ఈ పోస్ట‌ర్ చూస్తుంటే ఓ రాజు, యోధుడు, నాయ‌కుడు క‌లిసిన వ్య‌క్తిత్వం ఉన్న వ్య‌క్తి మ‌న కథానాయ‌కుడ‌ని అర్థం చేసుకోవచ్చు.

కెరీర్‌కి ఇస్తున్న ముగింపు

జ‌న‌ నాయ‌కుడు మూవీని కేవ‌లం సినిమా మాత్ర‌మే కాదు, స్టార్‌డ‌మ్‌కి అర్థాన్ని మార్చేసిన హీరో సినీ కెరీర్‌కి ఇస్తున్న ముగింపుగా భావిస్తున్నారు. ఇది ఓ వ్య‌క్తి ఉద్య‌మంగా మారాడో తెలియ‌జేసే గొప్ప నివాళి. భావోద్వేగ‌మైన క‌థ‌ల‌ను చెప్ప‌టంలో దిట్ట అయిన హెచ్‌.వినోద్ జ‌న నాయ‌గ‌న్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

అనిరుద్ ర‌విచందర్ సంగీతం

అలాగే, జన నాయకుడు సినిమాకు అనిరుధ్ర‌విచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. విజ‌య్‌, అనిరుద్ కాంబోలో ఇది వ‌ర‌కే ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ పాట‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి ఈ కాంబో ప్రేక్ష‌కులంద‌రికీ అద్భుత‌మైన అనుభూతినివ్వ‌నుంది.

జనవరి 9న రిలీజ్

కె.వి.ఎన్‌.ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ కె.నారాయ‌ణ రూపొందిస్తోన్న జ‌న నాయ‌కుడు చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 9, 2026న సంక్రాంతి సంద‌ర్భంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. భారీ అంచ‌నాలున్న ఈ సినిమా విజయ్కి గొప్ప సెండాఫ్‌గా నిల‌వ‌నుంది. మూడు ద‌శాబ్దాల గొప్ప వార‌స‌త్వానికి ఇది గొప్ప వేడుక‌గా నిల‌వ‌నుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More