ఆ హీరోయిన్‌లా పేరు తెచ్చుకోవాలి, రియల్ లైఫ్‌లో నేను అలా కాదు.. తమ్ముడు బ్యూటీ వర్ష బొల్లమ్మ కామెంట్స్

హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ నటించారు. జులై 4న థియేటర్లలో విడుదలైన తమ్ముడు సినిమాకు పాజిటివ్ టాక్ రావడం లేదు. ఇక తమ్ముడు విడుదలకు ముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్ష బొల్లమ్మ మరో హీరోయిన్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Published on: Jul 5, 2025, 09:01:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ బ్యూటి వర్ష బొల్లమ్మ తెలుగులో అనేక సినిమాలతో అలరించింది. స్వాతిముత్యం, మిడిల్ క్లాస్ మెలోడీస్, స్టాండప్ రాహుల్, ఊరు పేరు భైరవకోన వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న వర్ష బొల్లమ్మ లేటెస్ట్‌గా నటించిన సినిమా తమ్ముడు.

ఆ హీరోయిన్‌లా పేరు తెచ్చుకోవాలి, రియల్ లైఫ్‌లో నేను అలా కాదు.. తమ్ముడు బ్యూటీ వర్ష బొల్లమ్మ కామెంట్స్
ఆ హీరోయిన్‌లా పేరు తెచ్చుకోవాలి, రియల్ లైఫ్‌లో నేను అలా కాదు.. తమ్ముడు బ్యూటీ వర్ష బొల్లమ్మ కామెంట్స్

జులై 4న థియేటర్లలో

నితిన్ హీరోగా తెరకెక్కిన తమ్ముడుసినిమాలో వర్ష బొల్లమ్మతో పాటు సప్తమి గౌడ మరో హీరోయిన్‌గా నటించింది. జులై 4న థియేటర్లలో విడుదలైన తమ్ముడు సినిమాకు పాజిటివ్ టాక్ రావడం లేదు. అయితే, ఈ సినిమా విడుదలకు ముందు పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మరో హీరోయిన్‌పై తమ్ముడు బ్యూటి వర్ష బొల్లమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

వారి మధ్య ఉన్న రిలేషన్

"హీరో నితిన్ క్యారెక్టర్ జైకు చిత్ర డ్రైవింగ్ ఫోర్స్‌లా ఉంటుంది. జై కు అన్ కండిషనల్‌గా సపోర్ట్ చేస్తుంది చిత్ర. వారి మధ్య ఉన్న రిలేషన్ చాలా బాగుంటుంది. ఈ సినిమా కోసం నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా" అని వర్ష బొల్లమ్మ చెప్పింది.

మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని

"రియల్ లైఫ్‌లో కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఉండేది. అది ఈ సినిమాతో కుదిరింది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడాన్ని ఎంజాయ్ చేశాను. ఏదైనా చేయాలనుకుంటే వెంటనే అడుగువేసే క్యారెక్టర్ చిత్రది. నా రియల్ లైఫ్‌లో నేను అలా కాదు" అని వర్ష బొల్లమ్మ తెలిపింది.

గౌరవంగానే చూసుకున్నారు

"ఎస్వీసీ సంస్థలో మరోసారి నటించడం హ్యాపీగా ఉంది. జాను మూవీ చేసినప్పుడు నేను కొత్త నటిని. అయినా నాకు మంచి రెస్పెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అలా గౌరవంగానే చూసుకున్నారు" అని వర్ష బొల్లమ్మ చెప్పుకొచ్చింది.

తేడాలు చూడాలనుకోవడం

"నేను హీరోయిన్గా పలు చిత్రాలు చేశా. హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టు.. ఇలాంటి తేడాలు చూడాలని అనుకోవడం లేదు. వర్ష బాగా పర్‌ఫార్మ్ చేసింది అనే పేరు తెచ్చుకుంటే చాలు" అని హీరోయిన్ వర్ష బొల్లమ్మ పేర్కొంది.

ఛాలెంజింగ్‌గా ఉందని

"తమ్ముడు కథ విన్నప్పుడు ఇది కొత్తగా ఉంది, ఛాలెంజింగ్‌గా ఉందనిపించింది. అందుకే నటించాను. హీరోయిన్ నిత్యా మీనన్‌ను ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే తనకు పర్‌ఫార్మర్‌గా పేరుంది. నేనూ అలాగే పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నా" తమ్ముడు బ్యూటీ వర్ష బొల్లమ్మ కామెంట్స్ చేసింది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More