నేను సైకో కిల్లర్ ఏంటీ అనుకుంటారు.. కానిస్టేబుల్ కనకం ఓటీటీ సిరీస్‌పై హీరోయిన్ వర్ష బొల్లమ్మ కామెంట్స్

హీరోయిన్ వర్ష బొల్లమ్మ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. జులై 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వస్తోంది. నితిన్ హీరోగా నటించిన తమ్ముడు విడుదలకు ముందే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో కానిస్టేబుల్ కనకంతోపాటు ఓటీటీ సిరీస్‌లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది వర్ష బొల్లమ్మ.

Jul 6, 2025, 06:42:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు బ్యూటిపుల్ హీరోయిన్స్‌లలో వర్ష బొల్లమ్మ ఒకరు. ఇటీవల రిలీజైన తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, తమ్ముడు విడుదలకు ముందు పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తను నటించే ఓటీటీ సిరీస్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది హీరోయిన్ వర్ష బొల్లమ్మ.

నేను సైకో కిల్లర్ ఏంటీ అనుకుంటారు.. కానిస్టేబుల్ కనకం ఓటీటీ సిరీస్‌పై హీరోయిన్ వర్ష బొల్లమ్మ కామెంట్స్
నేను సైకో కిల్లర్ ఏంటీ అనుకుంటారు.. కానిస్టేబుల్ కనకం ఓటీటీ సిరీస్‌పై హీరోయిన్ వర్ష బొల్లమ్మ కామెంట్స్

అడవిలో షూటింగ్

"హీరో నితిన్ చాలా కామ్‌గా ఉంటారని ఒక ఇంప్రెషన్ ఉంది. కానీ, ఆయన చాలా ఫన్ పర్సన్. అడవిలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఫోన్స్ అవీ ఏమీ లేవు. మేము సరదాగా మాట్లాడుకునేవాళ్లం. చిన్నా, పెద్దా ప్రతి ఆర్టిస్టుకు ఆయన గౌరవం ఇచ్చేవారు. నేను జోక్స్ చెప్పి ఆయనను విసిగించా" అని వర్ష బొల్లమ్మ చెప్పింది.

స్ట్రిక్ట్‌గా చెప్పమనేవారు

"నాకు అనిపించింది సోషల్ మీడియాద్వారా వ్యక్తం చేస్తుంటా. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ పర్‌ఫార్మ్ చేసేప్పుడు అప్పటికప్పుడు ఏదైనా అనిపిస్తే చెప్పాను. కానీ, డైరెక్టర్ గారు డైలాగ్‌లో ఉన్నది ఉన్నట్లు స్ట్రిక్ట్‌గా చెప్పమనేవారు. నేను ఓటీటీ మూవీ మిడిల్ క్లాస్ మెలొడీస్ చేసినప్పుడు స్పాంటేనియస్‌గా చాలా ఇంప్రూవ్ చేసి డైలాగ్స్ చెప్పాం. ఆ మూవీకి అలా కుదిరింది" అని వర్ష బొల్లమ్మ తెలిపింది.

సాలిడ్ యాక్షన్ ఉంటుంది

"తమ్ముడు మూవీ బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుంది. అయితే ఇందులో అనేక లేయర్స్ ఉంటాయి. నా క్యారెక్టర్‌కు సంబంధించి సాలిడ్ యాక్షన్ ఉంటుంది. మొత్తంగా మూవీలో యాక్షన్ సీక్వెన్సులు మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయి" అని వర్ష బొల్లమ్మ పేర్కొంది.

విజువల్ ట్రీట్‌లా ఉంటుంది

"కొన్ని సినిమాలు థియేటర్స్‌లోనే ఎక్స్‌పీరియన్స్ చేయాలి. తమ్ముడు అలాంటి సినిమా. విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. మంచి సౌండింగ్‌తో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు" అని హీరోయిన్ వర్ష బొల్లమ్మ చెప్పుకొచ్చింది.

రెండు ఓటీటీ సిరీస్‌లు

"ప్రస్తుతం కానిస్టేబుల్ కనకం అనే ఓటీటీ వెబ్ సిరీస్లో నటిస్తున్నాను. దీంతో పాటు మరో ఓటీటీ సిరీస్ చేస్తున్నా. రెండు సినిమాలు కూడా కన్ఫర్మ్ అయ్యాయి. వాటి డీటెయిల్స్ త్వరలో చెబుతా" అని వర్ష బొల్లమ్మ తెలిపింది. అయితే, ఇటీవల కానిస్టేబుల్ కనకం కాస్తా కాంట్రవర్సీ అయిన విషయం తెలిసిందే.

ఎవరు ఊహించని పాత్రలే

"సైకో కిల్లర్ క్యారెక్టర్‌లో కనిపించాలనేది నా కోరిక. నేను సైకో కిల్లర్ ఏంటీ అనుకుంటారు. కానీ, మనం ఆ జోనర్ మూవీస్ చూస్తే ఎవరూ ఊహించని పాత్రలే క్రైమ్స్ చేస్తుంటాయి. అలాంటి అవకాశం వస్తే నటిస్తా" అని హీరోయిన్ వర్ష బొల్లమ్మ చెప్పుకొచ్చింది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More