నెట్‌ఫ్లిక్స్‌లోకి నితిన్ తమ్ముడు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే అంటూ బజ్.. నెల రోజుల్లోపే..

నితిన్ నటించిన తమ్ముడు మూవీ నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేస్తోంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీపై బజ్ నెలకొంది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైనట్లు తాజా వార్తలతో స్పష్టమవుతోంది.

Jul 16, 2025, 14:20:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నితిన్ కొత్త మూవీ 'తమ్ముడు' బాక్సాఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. దిల్ రాజు రూ.40 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో మూడు రోజులు కూడా నిలవలేకపోయింది. శ్రీరామ్ వేణుగోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో నితిన్ ఫ్లాప్ స్ట్రీక్ కొనసాగింది. ఇప్పుడీ మూవీ నెల రోజులు కూడా తిరగకుండానే ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌లోకి నితిన్ తమ్ముడు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే అంటూ బజ్.. నెల రోజుల్లోపే..
నెట్‌ఫ్లిక్స్‌లోకి నితిన్ తమ్ముడు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే అంటూ బజ్.. నెల రోజుల్లోపే..

'తమ్ముడు' ఓటీటీ రిలీజ్ డేట్

తమ్ముడు మూవీ జులై 4న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ హక్కులనునెట్ఫ్లిక్స్ మంచి ధరకు దక్కించుకుంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై కొన్ని రోజులుగా బజ్ నెలకొన్న విషయం తెలిసిందే. తాజా ఈ మూవీ ఆగస్ట్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

అంటే సినిమా విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీలో రానుంది. డిజిటల్ వెర్షన్‌పై పెద్దగా బజ్ లేనప్పటికీ, థియేటర్లలో చూడని ప్రేక్షకులు ఓటీటీలో సినిమాను చూసేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఇప్పటికే నితిన్ మరో ఫ్లాప్ మూవీ రాబిన్‌హుడ్ జీ5 ఓటీటీలో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.

తమ్ముడు మూవీ గురించి..

వేణు శ్రీరామ్ చివరిగా పవన్ కళ్యాణ్‌తో 'వకీల్ సాబ్' (పింక్ రీమేక్) సినిమాకు దర్శకత్వం వహించాడు. 'తమ్ముడు' ట్రైలర్ విడుదలైనప్పటి నుండి, నితిన్కు ఈ సినిమాతో మంచి విజయం లభిస్తుందని కొంత అంచనా ఉండేది. కానీ దురదృష్టవశాత్తు, 'తమ్ముడు' ఇటీవల కాలంలో వచ్చిన అతిపెద్ద ఫ్లాప్‌లలో ఒకటిగా నిలిచింది.

హీరోయిన్ లయ చాలా కాలం తర్వాత 'తమ్ముడు'తో తెలుగు సినిమాకు తిరిగి వచ్చింది. నితిన్ సోదరి పాత్రలో ఆమె నటించింది. 'కాంతార' ఫేమ్ సప్తమి గౌడ తెలుగు తెరంగేట్రం చేసిన సినిమా కావడం 'తమ్ముడు'కు మరో ప్రత్యేకత. ఈ చిత్రంలో ఆమె పల్లెటూరి అమ్మాయిగా కనిపించింది. ఆమె నటన చాలా బాగున్నప్పటికీ, సినిమా ఫ్లాప్ అవడంతో ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు.

అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించాడు. అతని నేపథ్య సంగీతం చాలా ప్రభావవంతంగా ఉంది. నితిన్ ఇప్పుడు తన నెక్ట్స్ మూవీ ‘ఎల్లమ్మ’తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తున్నాడు. 'తమ్ముడు' నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నాడు.

'తమ్ముడు' మూవీ కథ ఒక యువకుడి చుట్టూ తిరుగుతుంది. అడవిలో కిడ్నాప్ అయిన తన ప్రభుత్వ ఉద్యోగి అయిన సోదరిని రక్షించడానికి అతను వెళ్తాడు. ఆమెను తిరిగి ఎలా తీసుకువస్తాడు, ఒక ప్రాణాంతక కేసును ఎలా పరిష్కరిస్తాడు అనేది సినిమా కథాంశం. అయితే ఈ మూవీని ప్రేక్షకులు ఏమాత్రం ఆదరించలేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. మరి నెట్‌ఫ్లిక్స్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More