ఆ ఓటీటీలోకే నితిన్ తమ్ముడు మూవీ.. నిజం చెప్పేసిన నిర్మాత దిల్ రాజు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. డైరెక్టర్ శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లయ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాకు దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా ఉన్నారు. జూలై 4న ఈ మూవీ రిలీజ్ సందర్భంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో తమ్ముడు ఓటీటీ ప్లాట్‌ఫామ్ చెప్పేశారు దిల్ రాజు.

Published on: Jul 3, 2025, 11:47:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. సీనియర్ హీరోయిన్ లయ ఈ మూవీలో నితిన్కు అక్కగా కీలక పాత్ర పోషించింది. అలాగే, తమ్ముడు సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ హీరోయిన్స్‌గా చేశారు. మలయాళ బ్యూటి స్వాసిక మరో కీలక పాత్రలో అలరించేందుకు డెబ్యూ ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

ఆ ఓటీటీలోకే నితిన్ తమ్ముడు మూవీ.. నిజం చెప్పేసిన నిర్మాత దిల్ రాజు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆ ఓటీటీలోకే నితిన్ తమ్ముడు మూవీ.. నిజం చెప్పేసిన నిర్మాత దిల్ రాజు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమ్ముడు ఓటీటీ ప్లాట్‌ఫామ్

డైరెక్టర్ శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన తమ్ముడు సినిమా జూలై 4న థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో తమ్ముడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో సహా పలు ఇంట్రెస్టింగ్ విశేషాలను పంచుకున్నారు నిర్మాత దిల్ రాజు.

ఐదారు యాక్షన్ ఎపిసోడ్స్

-తమ్ముడు మూవీ మొదటి 20 నిమిషాల తర్వాత మిగిలిన కథంతా ఒక్కరోజులో జరుగుతుంది. ఐదారు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. వాటిలో రెండు యాక్షన్ ఎపిసోడ్స్ వైలెంట్‌గా ఉన్నాయని ఏ సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ వాళ్లు చెప్పారు. ఆ రెండు ఎపిసోడ్స్ తీసేస్తే యు బై ఏ ఇస్తామని చెప్పారు.

సంక్రాంతికి వస్తున్నాం లాంటి

-ఈ సినిమాను థియేటర్ ఎక్సిపీరియన్స్ కోసమే చేశాం కాబట్టి ఆ ఫైట్ సీక్వెన్సులు తీసేయకుండా ఎ సర్టిఫికెట్‌కు అంగీకరించాం. ఇది సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఎంటర్‌టైనర్ అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ రండి అని చెబుతాం.

యాక్షన్ ఓరియెంటెడ్

-తమ్ముడు మూవీ యాక్షన్ ఓరియెంటెడ్ కంటెంట్ ఉన్న మూవీ. థియేటర్స్‌కు వచ్చిన వాళ్లనైనా సంతృప్తి పరచాలి కదా అని ఎ సర్టిఫికెట్ తీసుకున్నాం. ఈ చిత్రాన్ని 150 రోజులు చిత్రీకరించారు. 80 పర్సెంట్ మూవీ అడవిలో ఉంటుంది. విజువల్స్, సౌండింగ్ హై క్వాలిటీతో ఉంటూ థియేటర్‌లో ఎంజాయ్ చేసేలా రూపొందించారు దర్శకుడు శ్రీరామ్ వేణు.

తమ్ముడు ప్రీమియర్స్

"తమ్ముడు సినిమాకు ప్రీమియర్స్ వేసే విషయం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ప్రీమియర్స్ కోసం ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి. నేను ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ఒక హోదాలో ఉన్నాను కాబట్టి అన్నీ చూసుకుని చేయాలి. తమ్ముడు మూవీని నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్లు చూసి నచ్చి తీసుకున్నారు" అని దిల్ రాజు చెప్పారు.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

కాబట్టి, నెట్‌ఫ్లిక్స్‌లో తమ్ముడు ఓటీటీ స్ట్రీమింగ్ కానుందన్నమాట. అది థియేట్రికల్ రిలీజ్ అయిన నెల రోజుల తమ్ముడు ఓటీటీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదా బాక్సాఫీస్ కలెక్షన్స్, పబ్లిక్ రెస్పాన్స్‌ను బట్టి నితిన్ తమ్ముడు ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్ మారే అవకాశం ఉంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More