తమ్ముడు ట్రైలర్ వచ్చేసింది.. అక్క మాట నిలబెట్టడం కోసం తమ్ముడు చేసే పోరాటం.. ఆర్చర్‌గా నితిన్
నితిన్ నటించిన తమ్ముడు మూవీ ట్రైలర్ బుధవారం (జూన్ 11) రిలీజైంది. అక్కకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే తమ్ముడి పాత్రలో నితిన్ నటించాడు. ఓ ఆర్చర్ పాత్రలో అతడు కనిపించాడు. ఈ సినిమా జులై 4న థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఈ మధ్యే రాబిన్‌హుడ్ మూవీతో మరో ఫ్లాప్ మూటగట్టుకున్న నితిన్.. ఇప్పుడు తమ్ముడు మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎప్పుడో 27 ఏళ్ల కిందట పవన్ కల్యాణ్ నటించిన మూవీ టైటిల్ తోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. జులై 4న థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ ను బుధవారం (జూన్ 11) రిలీజ్ చేశారు.

తమ్ముడు ట్రైలర్ ఎలా ఉందంటే?
ఇప్పటికే టాలీవుడ్ లో ఎంసీఏ, వకీల్ సాబ్ లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన శ్రీరామ్ వేణుయే ఈ తమ్ముడు మూవీని తీశాడు. నితిన్, లయ నటించిన ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా తన క్యారెక్టర్ మాత్రం కోల్పోని అక్క మాట నిలబెట్టే తమ్ముడిగా ఇందులో నితిన్ నటించాడు.
ఆమె నోటితో తనను తమ్ముడు అని పిలిపించుకోవాలన్న ఆశ అతనిది. ఆమె మాట నిలబెట్టడం కోసం ఆర్చర్ గా దేశం తరఫున బరిలోకి దిగుతాడు. అయితే తన ఊరు అంబరగొడుగులో జరిగే ఘటనలు అతన్ని లక్ష్యానికి దూరం చేస్తాయా? అతడు తన అక్క మాటను నిలబెడతాడా అన్నది ఈ తమ్ముడు మూవీలో చూడొచ్చు. ఏడేళ్ల తర్వాత సీనియర్ నటి లయ మళ్లీ ఈ మూవీ ద్వారా సిల్వర్ స్క్రీన్ పైకి వస్తోంది. ఇందులో నితిన్ అక్క పాత్రలో ఆమె కనిపించింది.
తమ్ముడు మూవీ గురించి..
తమ్ముడు ట్రైలర్ చూస్తుంటే.. నితిన్ కు చాలా రోజుల తర్వాత ఓ సక్సెస్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంసీఏ, వకీల్ సాబ్ సినిమాలతో వేణు శ్రీరామ్ సక్సెస్ అందుకున్నాడు. తమ్ముడుతో అతడు హ్యాట్రిక్ కొడతాడని అనిపిస్తోంది. ఈ ట్రైలర్లో డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తీసిన మూవీలా తమ్ముడు కనిపిస్తోంది. అజనీష్ లోక్‌నాథ్ బీజీఎం కూడా ఈ సినిమాకు ప్లస్ కానుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
తమ్ముడు మూవీలో నితిన్, లయతోపాటు కాంతార ఫేమ్ సప్తమి గౌడ, లబ్బర్ పండు ఫేమ్ స్వాశికా, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవా లాంటి వాళ్లు నటించారు. దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కించారు. ఈ సినిమా జులై 4న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆ సమయంలో ఈ మూవీకి పెద్దగా పోటీ లేకపోవడం కూడా నితిన్ కు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



