...
...
Next Story

టీవీలోకి వచ్చేస్తున్న తండేల్.. నాగచైతన్య సూపర్ హిట్ చిత్రం టెలికాస్ట్ డేట్, టైమ్ వివరాలివే

తండేల్ సినిమా టీవీ ఛానెల్‍లోకి వస్తోంది. థియేట్రికల్ రిలీజ్‍లో సూపర్ హిట్ అయిన ఈ మూవీ.. ఓటీటీలోనూ మంచి వ్యూస్ సాధించింది. ఇప్పుడు టీవీ ఛానెల్‍లో టెలికాస్ట్ కానుంది. డేట్, టైమ్ వివరాలు వెల్లడయ్యాయి.

Published on: Jun 22, 2025, 21:03:19 IST
By
Prefer HTon Google
Advertisement

యువ సామ్రాట్ నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన తండేల్ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయింది. నిజజీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం ఫిబ్రవరి 7వ తేదీన థియేటర్లలో విడుదలైంది. రూ.100కోట్లకు పైగా కలెక్షన్లతో బ్లాక్‍బస్టర్ సాధించింది. ఓటీటీలోనూ ఈ చిత్రం అదరగొట్టింది. ఇప్పుడు తొలిసారి టీవీలో ప్రసారమయ్యేందుకు తండేల్ మూవీ రెడీ అయింది.

టెలికాస్ట్ డేట్, టైమ్

టీవీలోకి వచ్చేస్తున్న తండేల్.. నాగచైతన్య, సాయిపల్లవి సూపర్ హిట్ చిత్రం టెలికాస్ట్ డేట్, టైమ్ ఇదే
టీవీలోకి వచ్చేస్తున్న తండేల్.. నాగచైతన్య, సాయిపల్లవి సూపర్ హిట్ చిత్రం టెలికాస్ట్ డేట్, టైమ్ ఇదే

తండేల్ సినిమా జూన్ 29వ తేదీన సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు టీవీ ఛానెల్‍లో టెలికాస్ట్ కానుంది. కొంతకాలంగా త్వరలో ప్రసారం అంటూ ఆ ఛానెల్ చెబుతూ వస్తోంది. ఎట్టకేలకు ఇప్పుడు డేట్, టైమ్ కన్ఫర్మ్ చేసింది. జూన్ 29న సాయంత్రం 6 గంటలకు తండేల్ టీవీ ప్రీమియర్ అంటూ జీ తెలుగు అధికారికంగా ఓ ప్రోమో తీసుకొచ్చింది.

మత్స్యకారుడిగా చైతూ.. యథార్థ ఘటనల ఆధారంగా..

తండేల్ చిత్రంలో మత్య్సకారుడు రాజు పాత్రను నాగచైతన్యపోషించారు. పాకిస్థాన్ జైలులో కొన్ని నెలల పాటు చిత్రహింసలు అనుభవించి స్వదేశం భారత్‍కు తిరిగి వచ్చిన శ్రీకాకుళం మత్స్యకారుల నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాను డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించారు. లవ్ స్టోరీ, ఎమోషన్స్, దేశభక్తి అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీలో బుజితల్లి అలియాజ్ సత్య పాత్రను సాయిపల్లవి పోషించారు.

తండేల్ కలెక్షన్లు

తండేల్ సినిమా పాజిటివ్ టాక్‍తో థియేట్రికల్ రన్‍లో అదరగొట్టింది. ఈ చిత్రం సుమారు రూ.100కోట్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ మూవీకి దాదాపు రూ.75కోట్ల బడ్జెట్ అయిందని అంచనా. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించగా.. అల్లు అరవింద్ సమర్పించారు.

ఏ ఓటీటీలో..

తండేల్ చిత్రంలో నాగచైతన్య, సాయిపల్లవిసహా ఆడుకాలం నరేన్, ప్రకాశ్ బెలవాది, దివ్య పిళ్లై కరుణాకరన్, బబ్లూ పృథ్విరాజ్, చరణ్‍దీప్, కల్పలత కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ మూవీ సక్సెస్‍కు మ్యూజిక్ కూడా ఓ కారణంగా నిలిచింది. ఈ చిత్రానికి షందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ చేశారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe