తను సాంగ్ లిరిక్స్: నాని హిట్ 3 మూవీ నుంచి సూపర్ మెలోడీ రిలీజ్.. ఒకే షాట్లో సాంగ్ మొత్తం షూట్.. ఎలా ఉందో చూడండి
తను సాంగ్ లిరిక్స్: నాని హిట్ 3 మూవీ నుంచి సూపర్ మెలోడీ సాంగ్ తను వచ్చేసింది. శుక్రవారం (ఏప్రిల్ 25) సాయంత్రం ఈ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. పాట మొత్తం ఒకే షాట్లో తీసిన అనుభూతి కలిగేలా కెమెరా మొత్తం నానినే ఫాలో అవుతూ ఉంటుంది. మరి ఈ సాంగ్ లిరిక్స్ చూసేయండి.
తను సాంగ్ లిరిక్స్: నాని, శైలేష్ కొలను కాంబినేషన్ లో వస్తున్న మూవీ హిట్ 3. ఈ మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంతకంటే ముందు శుక్రవారం (ఏప్రిల్ 25) ఈ సినిమా నుంచి తను అంటే ఓ మెలోడీ సాంగ్ వచ్చేసింది. ఓ డిఫరెంట్ ఫీల్ కలిగించే మ్యూజిక్, సింగింగ్, పిక్చరైజేషన్ తో ఈ పాట ఆకట్టుకుంటోంది.

హిట్ 3 నుంచి తను సాంగ్
హిట్ 3మూవీని శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండగా.. నాని, శ్రీనిధి శెట్టి లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజైంది. ఇక తాజాగా మూవీ నుంచి వచ్చి తను సాంగ్ ఆకట్టుకునేలా సాగింది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించగా.. మరో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ పాట పాడటం విశేషం. ఇక రాఘవ్ ఈ పాటకు లిరిక్స్ అందించాడు.
ఈ పాట మొత్తం శైలేష్ స్టైల్లో చాలా భిన్నంగా సాగిపోతూ ఉంటుంది. లిరిక్స్, మ్యూజిక్, దానిని చిత్రీకరించిన తీరు అంతా చాలా వెరైటీగా అనిపిస్తుంది. అంతేకాదు పాట మొత్తం సింగిల్ టేక్ లో షూట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. నాని ఈ సాంగ్ ను రిలీజ్ చేశాడు. పాట మొదట్లో నాని పోలీస్ స్టేషన్ లో సీరియస్ గా కూర్చొని ఉంటాడు.
తన గురించి పాట పాడుతూనే రౌడీలను చితకబాదుతాడు. పోలీసులతో డ్యాన్స్ చేస్తాడు. మేకప్ వేసుకుంటాడు. చివరికి తనను కలవడానికి వెళ్తాడు. కెమెరా మొత్తం నానినే ఫాలో అవుతూ ఉంటుంది. చివరి ఫ్రేమ్ లో శ్రీనిధి కనిపిస్తుంది.
తను సాంగ్ లిరిక్స్
తనకోసమే నా పొగరే మరి అణిగేనా
తనకోసమే నా పరుగే ఇక ఆగేనా
తనతోనే లోకమా.. తనతోనే ప్రేమా..
తనతోనేనా.. తను నాదేనా..
నిజమా తను నా నీడేనా?
తనతోనేనా.. తను నాదేనా..
తన నవ్వేనా.. మనసుకు తగునా..
తనతోనేనా..
మది తన పని తను మరిచే..
తను నాదేనా..
ఇది నిజమని తను వరిచే,,
తన నవ్వేనా.. మనసుకు తగునా..
తన కోసమే నా కనులే వేచుండేనా?
తన కోసమే నా పెదవే పలుకాపేనా?
తను నను తాకే ఆ తీరే..
తపనను తీర్చేసే చూడే..
తను చూస్తుంటే.. తన చూపే మనసును తాకితే..
మెచ్చాలే తననే.. తనతోనే అడుగే..
అణువణువూ తనకే.. తన వలనే ప్రతి క్షణమే..
తనతోనేనా.. తను నాదేనా..
నిజమా తను నా నీడేనా?
తనతోనేనా.. తను నాదేనా..
తన నవ్వేనా.. మనసుకు తగునా..
తనతోనేనా..
మది తన పని తను మరిచే..
తను నాదేనా..
ఇది నిజమని తను వరిచే..
తన నవ్వేనా.. మనసుకు తగునా..
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



