ది 100 రివ్యూ.. మొగలి రేకులు హీరో ఆర్కే సాగర్ పోలీస్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
మొగలి రేకులు సీరియల్ హీరో ఆర్కే సాగర్ హీరోగా సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ది 100. ఆర్కే సాగర్ మరోసారి పోలీస్ పాత్రలో నటించిన ది 100 ఇవాళ (జులై 11) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి ది 100 మూవీ రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: ది 100

నటీనటులు: ఆర్కే సాగర్, విష్ణుప్రియ, మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ, ఆనంద్, తారక్ పొన్నప్ప, కల్యాణి నటరాజన్, వంశీ నెక్కంటి, వీవీ గిరిధర్, టెంపర్ వంశీ తదితరులు
దర్శకత్వం: రాఘవ్ ఓంకార్ శశిధర్
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కే నాయుడు
ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల
నిర్మాతలు: రమేష్ కరుటూరి, వెంకీ పుషదపు, జె. తారక్ రామ్
విడుదల తేది: జూలై 11, 2025
మొగలి రేకులు సీరియల్‌తో బుల్లితెర హీరోగా పోలీస్ ఆఫీసర్ ఆర్కే నాయుడు పాత్రలో ఎంతో పేరు తెచ్చుకున్నాడు ఆర్కే సాగర్. సినిమాల్లోనూ హీరోగా అలరించిన ఆర్కే సాగర్ చాలా కాలం గ్యాప్ తర్వాత ఆర్కే సాగర్ కమ్‌బ్యాక్ రీ ఎంట్రీ ఇచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ది 100.
ది 100 మూవీ రివ్యూ
పవన్ కల్యాణ్ ట్రైలర్ లాంచ్ చేసిన ది 100 సినిమా ఇవాళ (జులై 11) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది, మరోసారి పోలీస్‌గా ఆర్కే సాగర్ ఎలా మెప్పించాడు అనే విషయాలను నేటి ది 100 రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
అప్పుడే ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న విక్రాంత్ (ఆర్కే సాగర్) నగరంలో ఏసీపీగా బాధ్యతలు చేపడుతాడు. అప్పుడు సిటీలో జరుగుతున్న రాబరీ గ్యాంగ్ హత్య కేసుపై దృష్టి సారిస్తాడు విక్రాంత్. తనదైన స్టైల్‌లో ఇన్వెస్టిగేషన్ చేసిన విక్రాంత్ హత్యలు ఎవరో చేశారో తెలుసుకుంటాడు. కానీ, ఇంతలోనే హత్యలు చేసినవాళ్లు కాకుండా ఓ పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది.
హత్యలు జరిగిన అమ్మాయిలకు ఏమైంది? సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన మధు (విష్ణుప్రియ) ఎందుకు సూసైడ్ చేసుకుంది? ఈ ఇన్వెస్టిగేషన్‌లో తన ప్రియురాలు ఆర్తి (మిషా నారంగ్) గురించి విక్రాంత్ తెలుసుకున్నది ఏంటీ? అసలు ఈ కేసులో నేరస్థులు ఎవరు? బిజనెస్‌మ్యాన్ వల్లభ (తారక్ పొన్నప్ప) పాత్ర ఏంటీ? ఫైనల్‌గా ఆ కేసును విక్రాంత్ ఎలా పరిష్కరించాడు? అనే థ్రిల్లింగ్ విషయాలు తెలియాలంటే ది 100 సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
దాదాపుగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలన్నీ ఒకే స్టోరీతో ఉంటాయి. ఓ క్రైమ్, విలన్‌కు ఓ నేపథ్యం, అతన్ని పట్టుకునేందుకు హీరో చేసే అడ్వెంచర్, ఇన్వెస్టిగేషన్ వంటి సీన్లను ఎంత థ్రిల్లింగ్‌గా మలిస్తే అంత హిట్ అవుతుంది ఆ సినిమా. ఈ విషయంలో ది 100 డైరెక్టర్ దాదాపుగా సక్సెస్ సాధించారనే చెప్పొచ్చు.
సూసైడ్ సీన్‌తో ప్రారంభం అయిన ఈ సినిమా అదిరిపోయే ట్విస్ట్‌తో ఇంటర్వెల్ ముగుస్తుంది. హంతకులు దొరికిన అసలు క్రైమ్ మరోటి ఉందనే విషయం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇక సెకండాఫ్ ఎమోషనల్‌గా ప్రారంభమవుతుంది. ఒకానొక సమయంలో క్లైమాక్స్ ఎలా ఉంటుందో ముందే ఊహించేలా సీన్స్ ఉంటాయి. దాంతో అప్పటివరకు వచ్చే సన్నివేశాలు కాస్తా బోరింగ్‌గా అనిపిస్తాయి.
చివరిలో సందేశం
కానీ, క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ఒక మంచి సందేశం ఇచ్చారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి. హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం బాగుంది. డైరెక్టర్ టేకింగ్ పర్వాలేదని చెప్పొచ్చు. ఇక మరోసారి పోలీస్‌గా ఆర్కే సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు అదరగొట్టాడు.
మొగలి రేకులు సీరియల్‌లో పోలీస్‌గా పవర్ ఫుల్ రోల్ ప్లే చేసిన ఆర్కే సాగర్ మరోసారి అలాంటి పాత్రతో మెప్పించారు. మంచి ఈజ్‌తో పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించారు. ఇక మిషా నారంగ్ తన పాత్రకు చక్కటి న్యాయం చేశారు. విష్ణుప్రియ, ధన్య బాలకృష్ణ ఆకట్టుకున్నారు. విలన్‌గా తారక్ పొన్నప్ప అలరించారు.
ఫైనల్‌గా చెప్పాలంటే
మిగతా పాత్రధారులు తమ పరిధి మేర ఆకట్టుకున్నారు. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే ఆర్కే సాగర్పోలీస్‌గా కమ్ బ్యాక్ ఎంట్రీ ఇచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ది 100పై ఓ లుక్కేయొచ్చు.
రేటింగ్: 3/5
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



