ఓటీటీలో అదిరిపోయే హారర్ ఫాంటసీ థ్రిల్లర్.. 100 శాతం ఫ్రెష్ కంటెంట్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఈ రెండింట్లో చూసేయండి!

ఓటీటీలో అదిరిపోయే హారర్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ది డీప్ డార్క్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఏకంగా మూడింట్లో ది డీప్ డార్క్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే, రెండింట్లో తెలుగులో ఓటీటీ రిలీజ్ అయింది. 100 శాతం ఫ్రెష్ కంటెంట్‌గా పేరు తెచ్చుకున్న ది డీప్ డార్క్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.

Published on: Jun 19, 2025, 05:33:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలో ఎప్పటికప్పుడు ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు అలరిస్తుంటాయి. వాటిలో హారర్ థ్రిల్లర్స్‌కు మంచి క్రేజ్ ఉంటుంది. హారర్ జోనర్స్‌కు అదనంగా ఫాంటసీ, అడ్వెంచర్, యాక్షన్, కామెడీ వంటి ఎలిమెంట్స్ యాడ్ చేసి మరింత ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్‌గా మూవీస్ తెరకెక్కిస్తుంటారు.

ఓటీటీలో అదిరిపోయే హారర్ ఫాంటసీ థ్రిల్లర్.. 100 శాతం ఫ్రెష్ కంటెంట్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఈ రెండింట్లో చూసేయండి!
ఓటీటీలో అదిరిపోయే హారర్ ఫాంటసీ థ్రిల్లర్.. 100 శాతం ఫ్రెష్ కంటెంట్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఈ రెండింట్లో చూసేయండి!

బొగ్గు గనిలో వింత రాక్షసి

అలా ఎన్నో సినిమాలు ఇప్పటికీ అలరించాయి. ఇలాంటి కోవలోకే చెందిన మరో హారర్ థ్రిల్లర్ మూవీ ది డీప్ డార్క్. ఒక బొగ్గు గనిలో వింత రాక్షసి నుంచి మనుషులు ప్రాణాలతో బయటపడతారా అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిందే ది డీప్ డార్క్. ఇది ఒక ఫ్రెంచ్ హారర్ అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్ డ్రామా చిత్రం.

ఐఎమ్‌డీబీ రేటింగ్

2023లో వచ్చిన ది డీప్ డార్క్ సినిమాకు మాథ్యూ టురి దర్శకత్వం వహించారు. ఫ్రెంచ్, అరబిక్ భాషల్లో 2023 ఆగస్ట్ 26న థియేటర్లలో విడుదల అయిన ది డీప్ డార్క్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే టాక్ తెచ్చుకుంది ది డీప్ డార్క్. కానీ, ఐఎమ్డీబీ నుంచి మాత్రం పదికి కేవలం 5.6 రేటింగ్‌నే సొంతం చేసుకుంది.

100 శాతం తాజా కంటెంట్

కానీ, ది డీప్ డార్క్ సినిమా చాలా వరకు ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా ఒక సినిమా ఎంత వరకు తాజాదో చెప్పే సంస్థ రొట్టెన్ టోమాటోస్ ది డీప్ డార్క్ మూవీకి 100 శాతం ఫ్రెష్ కంటెంట్ అని సర్టిఫికేట్ ఇచ్చింది. రేటింగ్ ఎలా ఉన్నా 100 శాతం తాజా కంటెంట్ అని పేరు తెచ్చుకోవడం మాములు విషయం కాదు.

3 ఓటీటీల్లో స్ట్రీమింగ్

మరి ఏకంగా 100 పర్సంట్ ఫ్రెష్ కంటెంట్‌గా రికార్డ్ కొట్టిన ది డీప్ డార్క్ ఓటీటీలో అదరగొడుతోంది. ఏకంగా మూడు ఓటీటీల్లో ది డీప్ డార్క్ డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. వాటిలో రెండింట్లో తెలుగు భాషలో ది డీప్ డార్క్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో ది డీప్ డార్క్ ఓటీటీ రిలీజ్ అయింది.

తెలుగులోనూ స్ట్రీమింగ్

ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు భాషతోపాటు ఫ్రాన్సిస్, తమిళం, హిందీ వంటి నాలుగు భాషలో ది డీప్ డార్క్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. దీంతోపాటు ఏయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఓటీటీలో కూడా ది డీప్ డార్క్ తెలుగు భాషలో అందుబాటులో ఉంది. ఇలా రెండు ఓటీటీల్లో ది డీప్ డార్క్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

జియో హాట్‌స్టార్‌ ఓటీటీలో కూడా

ఈ రెండింటితోపాటు జియో హాట్‌స్టార్‌లో కూడా ది డీప్ డార్క్ ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, జియో హాట్‌స్టార్‌ ఓటీటీలో కేవలం హిందీ భాషలో మాత్రమే ది డీప్ డార్క్ డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. ఇలా మొత్తంగా 3 ఓటీటీల్లో ది డీప్ డార్క్ మూవీ అందుబాటులో ఉంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More