ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎన్నాళ్లుగానో ఊరించి మొత్తానికి అనౌన్స్ చేసిన ప్రైమ్ వీడియో
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 వచ్చేస్తోంది. నాలుగేళ్లుగా ఈ కొత్త సీజన్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఆశ నెరవేరబోతోంది. మంగళవారం (అక్టోబర్ 28) ఓ ఫన్నీ వీడియో ద్వారా ప్రైమ్ వీడియో ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్ లలో ఒకటి ది ఫ్యామిలీ మ్యాన్. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఇప్పుడు కొత్త సీజన్ తో రాబోతోంది. ఇందులో లీడ్ రోల్స్ పోషించిన ప్రియమణి, మనోజ్ బాజ్‌పాయీలతో కూడిన ఓ ఫన్నీ వీడియో ద్వారా ప్రైమ్ వీడియో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది.

ది ఫ్యామిలీ మ్యాన్ వచ్చేది ఆ రోజే..
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 స్ట్రీమింగ్ తేదీని ప్రైమ్ వీడియో ఎట్టకేలకు వెల్లడించింది. నవంబర్ 21 నుంచి ఈ మూడో సీజన్ రానున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంగళవారం (అక్టోబర్ 28) ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో ప్రియమణి, మనోజ్ బాజ్‌పాయీలను ఓ ఫన్నీ అవతార్ లో చూడొచ్చు. “డార్లింగ్స్.. శ్రీకాంత్ కమ్‌బ్యాక్ టైమ్ వచ్చేసింది.. ది ఫ్యామిలీ మ్యాన్ ప్రైమ్ లో నవంబర్ 21 నుంచి” అనే క్యాప్షన్ తో ఓ వీడియో పోస్ట్ చేసింది.
నాలుగేళ్లుగా ఒకే పనిలో శ్రీకాంత్ తివారీ..
ఈ వీడియో చాలా సరదాగా సాగిపోయింది. మొదట్లోనే ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి.. ఈ నాలుగేళ్లలో తన ఇంట్లో ఏం జరిగిందో చెప్పడం చూడొచ్చు. మొదట తన పిల్లలు ఏం చేస్తున్నారో చెప్పే ఆమె.. తర్వాత తన భర్త శ్రీకాంత్ తివారీ (మనోజ్ బాజ్‌పాయీ) గురించి చెబుతూ నాలుగేళ్లుగా ఒకే పని చేస్తున్నాడని అంటుంది. అప్పుడే అతడు ఆ… అనుకుంటూ అటుగా వెళ్తాడు. ఈ వీడియో మొత్తం అతడు అలాగే అంటూ కనిపిస్తాడు. చివరికి ఆ రహా హు మై (నేను వచ్చేస్తున్నాను) అని చెబుతాడు. అప్పుడే ది ఫ్యామిలీ మ్యాన్ కొత్త సీజన్ నవంబర్ 21 నుంచి అనే అనౌన్స్‌మెంట్ వస్తుంది.
ది ఫ్యామిలీ మ్యాన్ గురించి..
ది ఫ్యామిలీ మ్యాన్ ప్రైమ్ వీడియో అత్యంత విజయవంతమైన వెబ్ సిరీస్ లలో ఒకటి. ఐఎండీబీలో ఏకంగా 8.7 రేటింగ్ సొంతం చేసుకుంది. తొలి సీజన్ 2019లో రాగా.. రెండో సీజన్ 2021లో వచ్చింది. మూడో సీజన్ కోసం నాలుగేళ్లుగా ప్రేక్షకులు ఎదురు చూస్తూనే ఉన్నారు. తొలి సీజన్ కశ్మీర్ ఉగ్రవాదం చుట్టూ తిరగగా.. రెండో సీజన్ శ్రీలంక ఎల్టీటీఈ ఉగ్రవాదంతో కథ నడిపించారు.
ఈ సీజన్లోనే సమంత వెబ్ సిరీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొత్తంగా రెండు సీజన్లు కలిపి 19 ఎపిసోడ్లు ఉన్నాయి. రాజ్ అండ్ డీకే క్రియేట్ చేసి, డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో కరోనా వైరస్ మూలాల గురించి చెప్పబోతున్నట్లుగా రెండో సీజన్ చివర్లో చూపించారు. మరి ఈ కొత్త సీజన్ ఎలా ఉంటుందో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


