ఓటీటీ రిలీజ్ రోజే టాప్ 3 ట్రెండింగ్‌లో యాక్షన్ థ్రిల్లర్- ఐదేళ్లకు సీక్వెల్- తెలుగులోనూ స్ట్రీమింగ్- ట్విస్టులు అదుర్స్!

ఓటీటీలోకి రీసెంట్‌గా సూపర్ హీరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ ది ఓల్డ్ గార్డ్ 2 స్ట్రీమింగ్‌కు వచ్చింది. 2020లో నేరుగా ఓటీటీ రిలీజ్ అయి సూపర్ హిట్ సాధించిన ది ఓల్డ్ గార్డ్ సినిమాకు సీక్వెల్‌గా ది ఓల్డ్ గార్డ్ 2 తెరకెక్కింది. ఇంగ్లీష్‌తోపాటు నేరుగా తెలుగులో ది ఓల్డ్ గార్డ్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

Published on: Jul 5, 2025, 05:33:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్‌ వస్తూనే ఉంటోంది. ఎప్పటికప్పుడు ప్రతివారం డిఫరెంట్ జోనర్లలోఓటీటీ సినిమాలను వివిధ ప్లాట్‌ఫామ్స్ స్ట్రీమింగ్ చేస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని మాత్రమే ఓటీటీఆడియెన్స్ ఆదరణ పొందుతుంటాయి. అయితే, వీటిలో థియేట్రికల్ రిలీజ్ తర్వాత కాకుండా నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు సైతం ఉన్నాయి.

ఓటీటీ రిలీజ్ రోజే టాప్ 3 ట్రెండింగ్‌లో యాక్షన్ థ్రిల్లర్- ఐదేళ్లకు సీక్వెల్- తెలుగులోనూ స్ట్రీమింగ్- ట్విస్టులు అదుర్స్!
ఓటీటీ రిలీజ్ రోజే టాప్ 3 ట్రెండింగ్‌లో యాక్షన్ థ్రిల్లర్- ఐదేళ్లకు సీక్వెల్- తెలుగులోనూ స్ట్రీమింగ్- ట్విస్టులు అదుర్స్!

80 శాతం ఫ్రెష్ కంటెంట్

అలాంటి వాటిలో ఒకటే ది ఓల్డ్ గార్డ్. 2020లో అమెరికన్ సూపర్ హీరో అడ్వెంచర్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది ఈ ది ఓల్డ్ గార్డ్ సినిమా. 2020 జులై 10న డైరెక్ట్‌గా ది ఓల్డ్ గార్డ్ ఓటీటీ రిలీజ్ అయి సూపర్ హిట్ సాధించింది. ఐఎమ్‌డీబీ నుంచి పదికి 6.7 రేటింగ్ సాధించగా.. 80 శాతం వరకు ఫ్రెష్ కంటెంట్‌గా పేరు తెచ్చుకుంది.

అలాంటి ది ఓల్డ్ గార్డ్ మూవీకి సీక్వెల్‌గా ఐదేళ్ల తర్వాత వచ్చిన సినిమానే ది ఓల్డ్ గార్డ్ 2. అదే సూపర్ హీరో అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ది ఓల్డ్ గార్డ్ కూడా నేరుగా ఓటీటీ రిలీజ్ అయింది. జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ది ఓల్డ్ గార్డ్ 2 ఓటీటీ స్ట్రీమింగ్అవుతోంది. అంటే, థియేట్రికల్ రిలీజ్ లేకుండానే మొదటి సినిమా తరహాలో రెండో భాగం ది ఓల్డ్ గార్డ్ 2 కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయంది.

ది ఓల్డ్ గార్డ్ 2 ఓటీటీ రిలీజ్

అది కూడా నేరుగా ఇంగ్లీషుతోపాటు తెలుగులో ది ఓల్డ్ గార్డ్ 2 ఓటీటీ స్టీమింగ్ అవుతోంది. అయితే, 2020లో ది ఓల్డ్ గార్డ్ నేరుగా తెలుగులో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాలేదు. ఈ ఏడాది నుంచే మొదటి పార్ట్ ది ఓల్డ్ గార్డ్ తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఇక దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన ది ఓల్డ్ గార్డ్ 2 మాత్రం నేరుగా తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది.

అంతేకాకుండా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన జులై 2వ రోజునాడే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాల జాబితాలోకి వచ్చేసింది ది ఓల్డ్ గార్డ్ 2. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో ది ఓల్డ్ గార్డ్ 2 మూడో స్థానంలో దూసుకుపోతోంది. ఇంగ్లీష్, తెలుగు రెండు భాషల్లో ది ఓల్డ్ గార్డ్ 2 ఓటీటీ ట్రెండింగ్‌లో నిలిచి సత్తా చాటింది.

ఇద్దరికీ అమరత్వం

అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్, ఊహించని ట్విస్టులతో సాగే ది ఓల్డ్ గార్డ్ 2 సినిమాలో ఇద్దరు లేడి అమరుల మధ్య పోటీ పడుతుంది. హీరోయిన్, లేడి విలన్ ఇద్దరికి అమరత్వం ఉంటుంది. అంటే, వారు ఎప్పటికీ చనిపోరు. వారిని ఇందులో ఓల్డ్ గార్డ్‌గా పిలుస్తారు.

మరి అలాంటి అమరత్వం ఉన్న ఇద్దరు ఓల్డ్ గార్డ్స్ పోటీ పడగా ఎవరు గెలుస్తారన్నది ఆసక్తిగా ఉంటుంది. మరి ది ఓల్డ్ గార్డ్ 2 మూవీని తెలుగులో ఎంచక్కా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో వీక్షించవచ్చు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More