The Paradise: తెలంగాణ vs ఆంధ్రా.. ది పారడైజ్ మూవీ విషయంలో రెండుగా చీలిపోయిన సోషల్ మీడియా.. ఇక్కడిలా.. అక్కడలా..

The Paradise: నాని ‘ది పారడైజ్’ మూవీ విషయంలో సోషల్ మీడియా రెండుగా చీలిపోయింది. పూర్తి తెలంగాణ బ్యాక్‌డ్రాప్, యాసతో.. ఓ తెలంగాణ డైరెక్టర్ తీసిన మూవీ కావడంతో దీనిపై రెండు ప్రాంతాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Published on: Sep 24, 2026, 18:46:27 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

The Paradise: నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'ది పారడైజ్' బాక్సాఫీస్ దగ్గర తుఫాన్ సృష్టిస్తోంది. 1980ల నాటి సికింద్రాబాద్ పారడైజ్ ప్రాంత నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాపై ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆడియెన్స్ నుంచి విభిన్నమైన రెస్పాన్స్ వస్తుండటం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

The Paradise: తెలంగాణ vs ఆంధ్రా.. ది పారడైజ్ మూవీ విషయంలో రెండుగా చీలిపోయిన సోషల్ మీడియా.. ఇక్కడిలా.. అక్కడలా..
The Paradise: తెలంగాణ vs ఆంధ్రా.. ది పారడైజ్ మూవీ విషయంలో రెండుగా చీలిపోయిన సోషల్ మీడియా.. ఇక్కడిలా.. అక్కడలా..

తెలంగాణలో 'పారడైజ్' జాతర.. నైజాంలో రికార్డు బుకింగ్స్

తెలంగాణ నేటివిటీ, గద్దర్ పాటల స్ఫూర్తి, పక్కా లోకల్ తెలంగాణ యాసతో తెరకెక్కిన 'ది పారడైజ్' చిత్రానికి తెలంగాణ ప్రాంతంలో బ్రహ్మరథం పడుతున్నారు. నైజాం పరిధితో పాటు హైదరాబాద్ సిటీలో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరిగాయి. ఒక్క హైదరాబాద్‌లోనే ప్రీమియర్స్, తొలి రోజు అడ్వాన్స్ సేల్స్ రూపంలో రూ.7.4 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ నమోదు చేసింది.

సికింద్రాబాద్ స్లమ్ నేపథ్యంలో 'సవారి' గిరిజన తెగ హక్కుల కోసం నాని (జడల్ క్యారెక్టర్) చేసే పోరాటం, రౌద్రం, రాత్రివేళల్లో వచ్చే ఊరమాస్ ఫైట్ సీన్లు తెలంగాణ యూత్ ని తీవ్రంగా ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ సంస్కృతి, రాజకీయం, పోరాట నేపథ్యం కథలో బలంగా ఉండటంతో ఇక్కడి సింగిల్ స్క్రీన్స్ దగ్గర పండగ వాతావరణం కనిపిస్తోంది.

ఆంధ్రా ఆడియెన్స్ రియాక్షన్.. పొలిటికల్ టచ్ పై భిన్నమైన చర్చ

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఆడియెన్స్, నెటిజన్ల నుంచి ఈ సినిమాపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో చూపించిన పొలిటికల్ ఎలిమెంట్స్, కేసీఆర్ అలాగే ఎన్టీఆర్ పాత్రల పోలికలతో ఉన్న కొన్ని పొలిటికల్ సీన్స్ ఆంధ్రా ప్రాంత ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో కనెక్ట్ కాలేదనే టాక్ వస్తోంది. ఫ్యూడల్ వ్యవస్థ, స్థానిక రాజకీయం చుట్టూ తిరిగే పాయింట్ అక్కడ కొంత మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

అంతేకాదు తెలంగాణ యాస తమకు అర్థం కావడం లేదని కొందరు, అసలు టాలీవుడ్ హీరోలు ఈ యాసలో సినిమాలు చేయొద్దంటూ మరికొందరు ట్వీట్స్ చేస్తుండటం గమనార్హం.

దీనికితోడు సినిమాలో చూపించిన రా అండ్ రస్టిక్ హింస, ఏ-సర్టిఫికేట్ కంటెంట్ కుటుంబ ప్రేక్షకులను కొంతవరకు దూరంగా ఉంచేలా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఉన్నంత ఊపు ఆంధ్రా బాక్సాఫీస్ సెంటర్లలో కనిపించడం లేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

నాని విశ్వరూపం.. సెకండాఫ్ పెద్ద మైనస్

ఈ సినిమాలో నాని పర్ఫార్మన్స్ విషయానికొస్తే.. 'దసరా' తర్వాత మళ్లీ అదే జోష్ లో ఈ మూవీలోనూ నటించాడు. జడల్ పాత్రలో నాని నటన, జైలు సీన్, హోటల్ ఫైట్ సీక్వెన్స్ సినిమాలో మెయిన్ హైలైట్స్ గా నిలిచాయి. అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బీజీఎమ్, జి.కె. విష్ణు కెమెరా వర్క్ సినిమాకి నెక్స్ట్ లెవెల్ రిచ్ లుక్ తీసుకొచ్చాయి. మోహన్ బాబు షికాంజా మాలిక్ పాత్రలో విలనిజం పండించారు.

అయితే ఫస్టాఫ్ ఇచ్చిన హై ఎలివేషన్ తర్వాత సెకండ్ హాఫ్ కథనంలో స్పీడ్ తగ్గడం, ఎడిటింగ్ లో క్లారిటీ లేకపోవడం, ఎమోషనల్ కనెక్ట్ తగ్గడంపై రివ్యూవర్స్ పెదవి విరుస్తున్నారు. తొలి సగం ఉన్నంత గ్రిప్పింగ్ గా సెకండాఫ్ లేకపోవడం వల్ల చాలా వరకు నెగటివ్ రివ్యూలు వస్తున్నాయి.

రూ.40 కోట్ల అడ్వాన్స్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర నాని కొత్త హిస్టరీ

టాక్ ఎలా ఉన్నా 'ది పారడైజ్' సినిమా కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టించింది. వరల్డ్ వైడ్ గా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్, పెయిడ్ ప్రిమియర్స్ ద్వారానే రూ. 40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి నాని కెరీర్ లోనే ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది. గతంలో 'హిట్: ది థర్డ్ కేస్' సాధించిన రూ.37.8 కోట్ల రికార్డును ఇది తుడిచిపెట్టేసింది.

శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. పాన్ ఇండియా రేంజ్ లో తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More