ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో మలయాళ కామెడీ థ్రిల్లర్- తెలుగుతోపాటు 5 భాషల్లో స్ట్రీమింగ్- ఏకంగా 8.5 రేటింగ్- ఎక్కడంటే?
ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో మలయాళ కామెడీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ది పెట్ డిటెక్టివ్ స్ట్రీమింగ్ కానుంది. అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ మలయాళ మూవీకి ఏకంగా 8.5 రేటింగ్ వచ్చింది. ఐదు భాషల్లో ది పెట్ డిటెక్టివ్ ఓటీటీ రిలీజ్ కానుంది. మరి ది పెట్ డిటెక్టివ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం.
యానిమల్స్‌కు రిలేట్ చేస్తున్న సినిమాలు రావడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఓటీటీలో ఎన్నో రకాల జోనర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ పెట్స్‌ను బేస్ చేసుకుని ఒక కథను అల్లుకుని తెరకెక్కించే సినిమాలు ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేస్తుంటాయి.

అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్
అలా ఇటీవల ప్రేక్షకులను ఆకర్షించిన సినిమానే ది పెట్ డిటెక్టివ్. మలయాళంలో కామెడీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీగా ది పెట్ డిటెక్టివ్ తెరకెక్కింది. ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, ష్రాఫ్ యు దీన్ ప్రధాన పాత్రలు పోషించారు. నివిన్ మిర్రర్, జియోమోన్ జ్యోతిర్, ప్రశాంత్ మాధవన్, నివేక్ మిర్రర్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలైన ది పెట్ డిటెక్టివ్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఐఎమ్‌డీబీ నుంచి పదికి ఏకంగా 8.5 రేటింగ్ సాధించుకుంది. ఇంతటి క్రేజీ మూవీ ది పెట్ డిటెక్టివ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అది కూడా మరికొన్ని గంటల్లో మలయాళంతోపాటు ఐదు భాషల్లో ది పెట్ డిటెక్టివ్ ఓటీటీ రిలీజ్ కానుంది.
జీ5 ఓటీటీలో
జీ5లో నవంబర్ 28 నుంచి ది పెట్ డిటెక్టివ్ ఓటీటీ ప్రీమిర్ కానుంది. నవంబర్ 28 అర్థరాత్రి 12 గంటలకు ది పెట్ డిటెక్టివ్ ఓటీటీ రిలీజ్ కావడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమా జీ5 ఓటీటీలో మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ, హిందీ వంటి 5 భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
ఇకపోతే ది పెట్ డిటెక్టివ్ సినిమాకు ప్రణీష్ విజయన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోహీరో అయిన ష్రాఫ్ యు దీన్ ప్రధాన పాత్రలో నటించటంతో పాటు నిర్మాతగానూ తొలి అడుగు వేశారు.
ది పెట్ డిటెక్టివ్ కథ
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. జోస్ అలులా (ష్రాఫ్ యు దీన్) ఓ డిటెక్టివ్. అతనికి చెప్పుకోదగ్గక కేసులుండవు. అయితే తనను తాను నిరూపించుకోవాలని ఎదురు చూస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో కనిపించకుండా పోయిన ఓ పెంపుడు జంతువు కేసుని సాల్వ్ చేయటానికి ఒప్పుకుంటాడు.
ఈ కేసుని శోధించే క్రమంలో ఏర్పడ్డ గందరగోళ పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ స్మగ్లర్స్, కిడ్నాపర్స్, కనిపించకుండా పోయిన ఓ చిన్నారి, మెక్సికన్ మాఫియా డాన్, అరుదైన చేప, కనిపించకుండా పోయిన అమ్మాయిని వెతికే పోలీస్ ఇన్‌స్పెక్టర్ అందరూ ఎంట్రీ ఇస్తారు.
హై వోల్టేజ్ క్లైమాక్స్
కథలోని హాస్యం, విచిత్రమైన పాత్రలు, ఊహించని మలుపులు, ప్రియదర్శన్ శైలిని గుర్తు చేసే హై వోల్టేజ్ కామెడీ క్లైమాక్స్.. ఇవన్నీ కలిపి ‘ది పెట్ డిటెక్టివ్’ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్, కామెడీ మూవీ లవర్స్ సహా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.
ఈ సందర్భంగా నిర్మాత, నటుడు ష్రాఫ్ యు దీన్ మాట్లాడుతూ.. "‘ది పెట్ డిటెక్టివ్’ సినిమా నాకెంతో ప్రత్యేకం. నటుడిగానే కాదు.. నిర్మాతగా ఇది నా తొలి చిత్రం. ప్రేక్షకులు ఏదో ఎక్కువగా ఆలోచన చేయకుండా సరదాగా, హృదయపూర్వకంగా నవ్వుకునేలా ఓ సినిమా చేయాలని భావించి చేశాం" అని అన్నారు.
తెలుగులో కూడా
"ఇప్పుడు ఈ సినిమాకు జీ5లో మలయాళంలో వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు తెలుగు, కన్నడ, తమిళ, హిందీ వెరన్స్‌లోనూ ప్రేక్షకులకు అందుబాటులోకి రావటం ఆనందంగా ఉంది" అని హీరో ష్రాఫ్ యు దీన్ తెలిపారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


