...
...
Next Story

ది రాజా సాబ్ ర్యాంపేజ్.. యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న టీజర్.. 24 గంటల్లోనే ఆ రికార్డు

ది రాజా సాబ్ ర్యాంపేజ్ మొదలైంది. టీజర్ కు యూట్యూబ్ లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ప్రభాస్ ను మరోసారి వింటేజ్ లుక్ లో చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దీంతో ఈ మూవీ టీజర్ రికార్డులను తిరగరాస్తోంది.

Published on: Jun 17, 2025, 13:40:24 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న నెక్ట్స్ మూవీ ది రాజా సాబ్. మారుతి డైరెక్షన్ లో హారర్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ సోమవారం (జూన్ 16) రిలీజైన విషయం తెలిసిందే. మూవీ రిలీజ్ కానున్న ఐదు భాషల్లోనూ టీజర్ వచ్చింది. అన్నింట్లో కలిపి తొలి 24 గంటల్లోనే 59 మిలియన్ ప్లస్ వ్యూస్ సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు.

ప్రభాస్.. ది రాజా సాబ్

ది రాజా సాబ్ ర్యాంపేజ్.. యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న టీజర్.. 24 గంటల్లోనే ఆ రికార్డు
ది రాజా సాబ్ ర్యాంపేజ్.. యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న టీజర్.. 24 గంటల్లోనే ఆ రికార్డు

ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో నిజంగానే ది రాజా సాబ్ అనాలేమో. అతడు ఏ సినిమాలో నటించినా అది బాక్సాఫీస్ రికార్డులనే కాదు.. అంతకుముందు టీజర్, ట్రైలర్ లాంటి రికార్డులను కూడా తిరగరాస్తోంది. తాజాగా వచ్చిన ది రాజా సాబ్ టీజర్ కూడా తొలి 24 గంటల్లోనే ఐదు భాషల్లో కలిపి 59 మిలియన్లకుపైగా వ్యూస్ సంపాదించినట్లు ఆ సినిమా మేకర్స్ వెల్లడించారు. ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ ఎవర్ హారర్ ఫ్యాంటసీ అంటూ ఈ మూవీని మేకర్స్ ప్రమోట్ చేస్తున్నారు.

మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో నంబర్ వన్ కావడం విశేషం. “ఇది ది రాజా సాబ్ యుగం.. మనం అందులోనే జీవిస్తున్నాం. ఇది అతని స్టేట్‌మెంట్” అనే క్యాప్షన్ తో మూవీ టీమ్ మంగళవారం (జూన్ 17) ఓ ట్వీట్ చేసింది. 59 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించినట్లు కూడా ఓ స్పెషల్ పోస్టర్ కూడా పోస్ట్ చేసింది. తెలుగులోనూ 14 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

ది రాజా సాబ్ టీజర్

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, నిధి అగర్వాల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ ది రాజా సాబ్. ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. కల్కి 2898 ఏడీ తర్వాత ప్రభాస్ నటిస్తున్న మూవీ కావడంతో ది రాజా సాబ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ మారుతి డైరెక్షన్ కావడంతో ఈ ఇద్దరి కాంబినేషన్ ఆసక్తి రేపుతోంది. అందుకు తగినట్లే టీజర్ ఉండటంతో దీనికి యూట్యూబ్ లో ఎక్కడ లేని రెస్పాన్స్ వస్తోంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe