...
...
Next Story

హే జగన్నాథ ప్రభూ క్యా హువారే.. అదిరిపోయిన రాజాసాబ్ టీజర్.. ప్రభాస్ కిరాక్.. వండర్ ఫుల్ గా విజువల్ ఎఫెక్ట్స్

ప్రభాస్ పాన్ ఇండియా రొమాంటిక్ కామెడీ హారర్ ఫ్యాంటసీ ఫిల్మ్ ది రాజాసాబ్ టీజర్ రిలీజైంది. విజువల్ ఎఫెక్ట్స్, ప్రభాస్ కామెడీ టైమింగ్ తో టీజర్ వేరే లెవల్ లో ఉంది. మూవీపై అంచనాలను మరింత పెంచేసింది ఈ టీజర్.

Published on: Jun 16, 2025, 11:48:54 IST
By ,
Prefer HTon Google
Advertisement

ఫ్యాన్స్ వెయిటింగ్ కు ఎండ్ కార్డు పడింది. రెబల్ మేనియాకు తెరలేచింది. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రాజాసాబ్ నుంచి స్పెషల్ సర్ ప్రైజ్ వచ్చేసింది. ప్రభాస్ లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్ టీజర్ రిలీజైంది. సోమవారం (జూన్ 16) ఉదయం గ్రాండ్ ఈవెంట్ లో ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ టీజర్ రిలీజ్ చేశారు.

డార్లింగ్ వింటేజ్ లుక్

రాజాసాబ్ లో ప్రభాస్ (x/People Media Factory)
రాజాసాబ్ లో ప్రభాస్ (x/People Media Factory)

వరుసగా యాక్షన్ సినిమాలతో అదరగొడుతున్నారు ప్రభాస్. కత్తులు, గన్లు, ఫైటింగ్.. ఇలాగే మాస్ యాక్షన్ లో ప్రభాస్ కనిపిస్తున్నారు. కానీ ఇప్పుడురాజాసాబ్ లో ఆయన లుక్ డిఫరెంట్ గా ఉంది. డార్లింగ్ వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నారు. చీకటి భవనంతో టీజర్ స్టార్ట్ అవుతుంది. ‘ఈ ఇల్లు నా దేహం. ఈ సంపద నా ప్రాణం. నా తదనాంతరం దీన్ని నేను మాత్రమే అనుభవిస్తాను’ అనే డైలాగ్ తో టీజర్ ఇంట్రెస్టింగ్ గా మొదలైంది. ఇందులో ప్రభాస్ కామెడీ టైమింగ్, హారర్ విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి.

బండి కొంచెం మెల్లగా

ప్రభాస్ లుక్ అదిరిపోయింది. ‘బండి కొంచెం మెల్లగా’ అంటూ టీజర్ లో మెరిశారు డార్లింగ్. నేరాలు, పాపాలు ఏంటండీ, డిగ్నిఫైడ్ గా లవ్ చేస్తేనే.. అంటూ తన స్టైల్లో ప్రభాస్ డైలాగ్ అలరించింది. హే జగన్నాథ ప్రభూ క్యా హువారే అనే మీమ్ డైలాగ్ నూ చెప్పారు. ఆ భవనంలో అంతా తలకిందులుగా ఉంటుంది. హారర్ విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి.

ముగ్గురు హీరోయిన్ల అందాలు

రాజాసాబ్ లో నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. ముగ్గురు భామల అందంతో పాటు యాక్షన్ కూడా టీజర్ లో కనిపించింది. రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ గా రాజాసాబ్ ను డైరెక్టర్ మారుతి తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ లో తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.

రిలీజ్ అప్పుడే

మచిలీపట్నంలోని సిరి కాంప్లెక్స్ లో ప్రభాస్ తో పాటు డైరెక్టర్ మారుతీ కటౌట్ ఏర్పాటు చేశారు. దీనిపై మారుతి ఎమోషనల్ అయ్యారు. ‘‘ఇక్కడే మా తండ్రి చిన్న బండిపై అరటి పళ్లు అమ్మేవారు. ఈ థియేటర్లలో రిలీజయ్యే హీరోల సినిమాలకు బ్యానర్లు రాసేవాణ్ని. ఒక్కసారైనా నా పేరు అక్కడ చూడాలనుకున్నా. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ పక్కన నిలబడ్డా. మా తండ్రి ఉంటే ఇప్పుడెంతో గర్వపడేవారు. మిస్ యూ నాన్న’’ అని మారుతీ ఎక్స్ లో పోస్టు చేశారు.

లాంఛ్ వేడుక

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజాసాబ్ టీజర్ లాంఛ్ ను వేడుకలా నిర్వహించారు. రాజమహేంద్రవరం, కాకినాడ, గాజువాక, అమలాపురం, అనకాపల్లి, ఒంగోల్, విజయవాడ, మచిలీపట్నం, భీమవరం, ఏలురు, తెనాలి, కడప, ప్రొద్దుటూరు, గుంతకల్, మదనపల్లె, కర్నూల్, ఆదోని, బెంగళూరు, తిరుపతి, గుంటూరు, వరంగల్, నెల్లూరు, హైదరాబాద్ లో ఎంపిక చేసిన థియేటర్లలో టీజర్ లాంఛ్ ఈవెంట్లను నిర్వహించారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ దగ్గర రాజాాసాబ్ కటౌట్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe