ఓటీటీలో డిఫరెంట్ హారర్ థ్రిల్లర్.. మగాళ్లను ట్రాప్ చేసి ప్రెగ్నెంట్ చేసేలా స్కెచ్.. తెలుగుతోపాటు 4 భాషల్లో స్ట్రీమింగ్!

ఓటీటీలో ఓ డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ మూవీ ది సీడింగ్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు నాలుగు భాషల్లో ది సీడింగ్ ఓటీటీ రిలీజ్ అయింది. మగాళ్లను ఓ లోయలో ట్రాప్ చేసి వారితో అమ్మాయిలు ప్రెగ్నెంట్ అయ్యేలా చేస్తారు. మరి ఈ ది సీడింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jun 09, 2025 1:10 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు విభిన్నమైన జోనర్స్, డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూ అలరిస్తుంటాయి. ముఖ్యంగా ఓటీటీ ప్రియులకు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లలో వచ్చే కంటెంట్ అమితంగా ఆకట్టుకుంటోంది. ఇక హారర్ థ్రిల్లర్స్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.

ఓటీటీలో డిఫరెంట్ హారర్ థ్రిల్లర్.. మగాళ్లను ట్రాప్ చేసి ప్రెగ్నెంట్ చేసేలా స్కెచ్.. తెలుగుతోపాటు 4 భాషల్లో స్ట్రీమింగ్!
ఓటీటీలో డిఫరెంట్ హారర్ థ్రిల్లర్.. మగాళ్లను ట్రాప్ చేసి ప్రెగ్నెంట్ చేసేలా స్కెచ్.. తెలుగుతోపాటు 4 భాషల్లో స్ట్రీమింగ్!

ఓటీటీ హారర్ థ్రిల్లర్

హారర్ ఎలిమెంట్స్‌తో ఒక డిఫరెంట్ స్టోరీని ఎంగేజింగ్‌గా చూపిస్తే ఓటీటీ ఆడియెన్స్ అతుక్కుపోతారు. అలాంటి ఓటీటీ హారర్ థ్రిల్లర్ మూవీనే ది సీడింగ్. ఓ ఎడారిలో ఒక ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీస్తూ ఉంటాడు. అతనికి ఒక పిల్లాడు కనిపిస్తాడు. అతని దగ్గరికి ఫొటోగ్రాఫర్ వెళ్లగా తన తల్లిదండ్రులు తప్పిపోయారని ఆ పిల్లాడు చెబుతాడు.

అందమైన మహిళ

దాంతో ఆ పిల్లాడిని వెంటబెట్టుకుని ఫొటోగ్రాఫర్ కొంతదూరం వెళ్తాడు. అప్పుడు ఆ ఫొటోగ్రాఫర్ దారి తప్పిపోతాడు. ఆ పిల్లాడు కూడా కనిపించడు. ఇక రాత్రి అయి చీకటి పడటంతో ఓ లోయలో పడిపోతాడు ఫొటోగ్రాఫర్. ఆ లోయలో ఓ అందమైన మహిళ కూడా జీవిస్తు ఉంటుంది. వీరికి కొండపై నుంచి కొంతమంది ఆహారం విసిరేస్తుంటారు.

శారీరకంగా ఒక్కటై

అదంతా మొదట్లో అర్థం కాని ఫొటోగ్రాఫర్ ఆ లోయలోనే జీవించడానికి అలవాటు పడతాడు. కొన్ని పంటలు పండిస్తాడు. ఈ క్రమంలో ఆ మహిళతో సాన్నిహిత్యం పెరిగి ఇద్దరు శారీరకంగా ఒక్కటవుతారు. దాంతో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. అయితే, ఆ ప్రాంతానికి వచ్చే మగాళ్లను ట్రాప్ చేసి అక్కడున్న అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేసేలా స్కెచ్ వేస్తారు కొంతమంది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

అలా కొన్ని ఏళ్లు గడిచిపోతాయి. మరి అక్కడి నుంచి ఆ ఫొటోగ్రాఫర్ బయటపడ్డాడా? ఆ అమ్మాయి ఎవరు? వారిని ఎవరు ట్రాప్ చేశారు?, ఎందుకు చేశారు? అనేదే ది సీడింగ్ సినిమా స్టోరీ. 2023లో వచ్చిన ఈ అమెరికన్ హారర్ థ్రిల్లర్ మూవీ ది సీడింగ్ అమెజాన్ ప్రైమ్లో ఓటీటీ రిలీజ్ అయింది.

ది సీడింగ్ ఓటీటీ రిలీజ్

ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, తమిళం, హిందీ వంటి నాలుగు భాషల్లో ప్రైమ్ వీడియోలో ది సీడింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఒక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియెన్స్ కోసం అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ రిలీజ్ అయిన ది సీడింగ్ మూవీని ఎంచక్కా చూడొచ్చు.