Oh Sukumari Release Date: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ ఓ సుకుమారి రిలీజ్ డేట్ వచ్చేసింది.. కొత్త పోస్టర్ రిలీజ్
Oh Sukumari Release Date: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న ఓ సుకుమారి మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా జులై 17న థియేటర్లలో రిలీజ్ కానున్నట్లు వెల్లడిస్తూ.. ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.
Oh Sukumari Release Date: 'మసూద', 'పరేషాన్' లాంటి డిఫరెంట్ సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ యాక్టర్ తిరువీర్ (Thiru Veer) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఓ..! సుకుమారి' (Oh..! Sukumari).

టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా పక్కా పల్లెటూరి నేపథ్యంలో సాగే ఒక లైవ్లీ రూరల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. రీసెంట్‌గా రిలీజైన ఈ సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్ ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి.
జులై 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్
ఈ ఓ సుకుమారి సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్‌ను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను జులై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ మేరకు రిలీజ్ చేసిన స్పెషల్ డేట్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పక్కాగా ప్లాన్ చేసిన ఈ డేట్‌తో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించవచ్చని ప్రొడక్షన్ టీమ్ నమ్మకంగా ఉంది. ఈ రిలీజ్ విండో కన్ఫర్మ్ కావడంతో ఇకపై ప్రమోషన్ల స్పీడ్ పెంచేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
ఫాంటసీ లవ్ స్టోరీ హింట్ ఇస్తున్న ఇంట్రెస్టింగ్ పోస్టర్
తాజాగా రిలీజ్ చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంది. దట్టమైన మేఘాలు, పచ్చని ప్రకృతి నేపథ్యంలో లవ్ అండ్ ఫాంటసీ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేస్తూ ఈ పోస్టర్‌ను చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారు. ఇందులో ఐశ్వర్య రాజేష్ సాంప్రదాయ చీర కట్టులో ఎంతో పద్ధతిగా కూర్చుని తన చేతిని తిరువీర్ వైపు చాచింది.
మరోవైపు తిరువీర్ గాల్లో తేలుతూ ఎంతో హ్యాపీగా నవ్వుతున్న లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ముఖ్యంగా వారిద్దరి వేళ్లు తాకుతున్న సమయంలో వచ్చే మెరుపు తీగ ఈ కథలో ఏదో తెలియని ఒక మ్యాజికల్ ఫాంటసీ ఎలిమెంట్ ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
సరికొత్తగా ఓ సుకుమారి
ఈ సినిమాతో భరత్ దర్శన్ దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి ఈ ప్రాజెక్ట్‌ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ నిర్మాణ విలువలతో నిర్మించారు. గతంలో ఈ బ్యానర్ నుంచి వచ్చిన 'శివం భజే' సినిమా మంచి అటెన్షన్ తెచ్చుకుంది.
ఇక ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, విష్ణు ఓయ్ (మ్యాడ్ ఫేమ్), ఝాన్సీ, ఆమని, ఆనంద్‌కోట జయరామ్ వంటి పేరున్న ఆర్టిస్టులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టి భరత్ మంచిరాజు ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ, విజువల్స్ పల్లెటూరి అందాలను చాలా ఫ్రెష్‌గా చూపించబోతున్నట్లు సమాచారం.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


