ఈ వారం ఒకే ఓటీటీలోకి ఆరు సినిమాలు, సిరీస్ లు.. ఓ తెలుగు సూపర్ హిట్ మూవీ.. రొమాంటిక్ డ్రామా సిరీస్.. డిఫరెంట్ జోనర్లు
ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోకి సినిమాలు క్యూ కడుతున్నాయి. అయితే ఇందులో ఒకే ఓటీటీలోకి ఆరు సినిమాలు, సిరీస్ లు రాబోతున్నాయి. ఇందులో ఓ తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేయండి.
ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు డిఫరెంట్ జోనర్లలో సినిమాలు, సిరీస్ లు దూసుకొస్తున్నాయి. ఇందులో సూపర్ హిట్ సినిమాలు, అదరగొట్టే సిరీస్ లు ఉన్నాయి. ఈ వారం సినిమాలు, సిరీస్ లు కలిపి ప్రైమ్ వీడియోలో ఆరు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వివిధ భాషల్లోని ఆ సినిమాలు, సిరీస్ లు ఏంటో ఓ సారి చూసేద్దాం.

బ్లాక్ బస్టర్
బాక్సాఫీస్ ను షేక్ చేసిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీకుబేర. లక్ష కోట్ల క్రైమ్ థ్రిల్లర్గా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. బిచ్చగాడిగా ధనుష్ యాక్టింగ్ తో అదరగొట్టారు. మాజీ సీబీఐ ఆఫీసర్ గా నాగార్జున గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ను చాలా ఈజ్ తో చేసేశారు. ఈ మూవీలో రష్మిక మందన్న కూడా కీ రోల్ ప్లే చేసింది. థియేటర్లలో సత్తాచాటిన ఈ థ్రిల్లర్ మూవీ జూలై 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కుబేర ఓటీటీలో అడుగుపెడుతుంది.
రొమాంటిక్ డ్రామా
అమెజాన్ ప్రైమ్ వీడియోలోని అమెరికన్ వెబ్ సిరీస్ ‘ది సమ్మర్ ఐ టర్న్ డ్ ప్రెట్టీ’కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, యూత్ రొమాన్స్, సెక్స్, మ్యారేజీ తదితర అంశాలతో కూడిన ఈ వెబ్ సిరీస్ నుంచి చివరి సీజన్ వచ్చేస్తోంది. ఈ ఇంగ్లిష్ రొమాంటిక్ డ్రామా సిరీస్ జూలై 16 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. టీనేజీ నుంచి యూత్ గా మారిన అబ్బాయిలు, అమ్మాయిల కథను ఇందులో చూడొచ్చు. ఘాటైన ముద్దు సన్నివేశాలు కూడా ఉంటాయి.
కామిక్ సిరీస్ లు
ప్రైమ్ వీడియో లో పిల్లలను అట్రాక్ట్ చేసే కామిక్ సిరీస్ లు కూడా ఈ వారం వచ్చేస్తున్నాయి. పాపురల్ యానిమేషన్ సిరీస్ లు ‘హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్’, ‘ఎం3గ్యాన్ 2.0’ కామిక్ సిరీస్ లు రెంట్ విధానంలో ఓటీటీలోకి అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ సిరీస్ లను కిడ్స్ ఇష్టపడే అవకాశముంది. ‘హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్’, ‘ఎం3గ్యాన్ 2.0’ సిరీస్ లు ఈ రోజు (జూలై 15) నుంచే స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఇక బ్రైడ్ హార్డ్, ఫైనల్లీ డాన్ లాంటి ఇంగ్లీష్ సినిమాలు కూడా ప్రైమ్ వీడియో బాట పట్టనున్నాయి. ఈ రెండు మూవీస్ రెంట్ విధానంలో అందుబాటులో ఉండబోతున్నాయి. జూలై 18న ఈ రెండు ఫిల్మ్స్ ఓటీటీ రిలీజ్ అవుతాయి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper



