బెడిసికొట్టిన ముగ్గురు సీనియర్ హీరోయిన్ల రీ ఎంట్రీ.. ఏమాత్రం కలిసి రాని కమ్ బ్యాక్.. జెనీలియా-లయ సేమ్ టు సేమ్!
టాలీవుడ్‌లో రీసెంట్‌గా ముగ్గురు సీనియర్ హీరోయిన్స్ జెనీలియా, లయ, అన్షు రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ, ఆ కమ్ బ్యాక్ వారికి ఏమాత్రం కలిసిరాలేదు. ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు చేసిన మూడు సినిమాలకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇక వీరిలో జెనీలియా, లయది మాత్రం సేమ్ టు సేమ్ పరిస్థితి. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం.
సినీ ఇండస్ట్రీలో ఎంట్రీలు, రీ ఎంట్రీలు సాధారణమే. ఇది ఎక్కువగా హీరోయిన్స్‌లలో జరుగుతుంది. స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్న తర్వాత భర్త, కుటుంబం, పిల్లలు అంటూ సినిమాలకు దూరంగా ఉంటారు. తర్వాత ఒక సమయంలో మళ్లీ కీలక పాత్రలతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారు.

సీనియర్ ముద్దుగుమ్మలు
ఇలా రీసెంట్‌గా తెలుగులో ముగ్గురు సీనియర్ హీరోయిన్స్ రీ ఎంట్రీ ఇచ్చారు. వారే జెనీలియా, లయ, అన్షు. ఈ ముగ్గురు సీనియర్ ముద్దుగుమ్మలు హీరోయిన్స్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. మన్మథుడు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన అన్షు ఆ తర్వాత ప్రభాస్తో రాఘవేంద్ర చేసింది. అనంతరం భూమిక మిస్సమ్మ మూవీలో కెమియో చేసింది.
కేవలం ఈ రెండు, మూడు సినిమాలు చేసిన అన్షు తన బ్యూటీతో చాలా ఫేమ్ తెచ్చుకుంది. పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిపోయిన అన్షు మజాకా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో రావు రమేష్‌తో జోడీ కట్టింది అన్షు.
22 ఏళ్ల తర్వాత
రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన మజాకా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో 22 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన అన్షుకు మంచి కమ్ బ్యాక్ సినిమా పడలేదు. అన్షు తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ లయ. నితిన్ హీరోగా తెరకెక్కిన తమ్ముడు సినిమాలో అక్క పాత్రలో కనిపించింది.
తన నటనతో నంది అవార్డ్ అందుకున్న లయ పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది. తమ్ముడు కథ నచ్చడంతో ఓకే చెప్పిన లయ సుమారు 21 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ, తమ్ముడు సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బెడిసికొట్టింది. రొటీన్ కాన్సెప్ట్, టేకింగ్‌తో వేణు శ్రీరామ్ దర్శకత్వం పాలిపోయిందని కామెంట్స్ వచ్చాయి.
హా హా హాసినిగా
అలా లయకు కూడా రీ ఎంట్రీ బెడిసికొట్టింది. ఇక ముచ్చటగా మూడో ముద్దుగుమ్మ జెనీలియాకు వీరిద్దరి కంటే తెలుగులో ఫుల్ క్రేజ్ ఉండేది. హా హా హాసిని అంటూ అందరి మనసు దోచిన చిన్నది జెనీలియా. అలాంటి జెనీలియా కెరీర్ బాగుండగానే బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడి అక్కడే స్థిరపడిపోయింది.
భర్త, పిల్లలతోపాటు పలు ప్రొడక్షన్ పనులు చూసుకున్న జెనీలియా రీసెంట్‌గానే అమీర్ ఖాన్సితారే జమీన్ పర్ సినిమాతో బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది. దాంతోపాటు తెలుగు, కన్నడలో విడుదలైన జూనియర్ మూవీలో కూడా జెనీలియా కీలక పాత్ర చేసింది.
సేమ్ టు సేమ్
లయ లాగే సేమ్ టు సేమ్ జెనీలియా కూడా హీరోకు అక్కలా నటించింది. కానీ, జూనియర్ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంటోంది. చాలా వరకు ఆడియెన్స్ జూనియర్‌పై నెగెటివ్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ, జెనీలియా సీరియస్ యాక్టింగ్, ఆమె స్క్రీన్ ప్రజెన్స్ బాగుందని కామెంట్స్ వచ్చాయి.
ఇలా హిందీలో జెనీలియా చేసిన సితారే జమీన్ పర్ కూడా పెద్దగా ఆడలేదు. జెనీలియాకు రెండు సినిమాలు కలిసి రాలేదు. దీంతో స్టార్ హీరోయిన్‌గా ముద్ర వేసిన జెనీలియా కమ్ బ్యాక్ చిత్రం బెడిసికొట్టింది. మరి ఈ ముగ్గురికి ఈ సినిమాల తర్వాత మరో మూవీ ఆఫర్ ఏమైనా వస్తుందేమో చూడాలి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



