స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 2 వచ్చేస్తోంది.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. తెలుగులోనూ స్ట్రీమింగ్

స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్పెషల్ ఓపీఎస్ (Special Ops) రెండో సీజన్ వచ్చేస్తోంది. సోమవారం (జూన్ 16) మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈసారి సైబర్ వార్ తో యాక్షన్ థ్రిల్లర్ మరింత రసవత్తరంగా సాగనున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

Published on: Jun 16, 2025, 15:16:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలో ఇప్పటి వరకూ వచ్చిన బెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఒకటి స్పెషల్ ఓపీఎస్ (Special Ops). జియోహాట్‌స్టార్ లో ఇప్పటికే తొలి సీజన్, తర్వాత 1.5 అంటూ మరో షార్ట్ సీజన్ కూడా స్ట్రీమింగ్ అయింది. ఇక ఇప్పుడు రెండో సీజన్ రాబోతోంది. తాజాగా సోమవారం (జూన్ 16) ట్రైలర్ రిలీజ్ కాగా.. జులై 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 2 వచ్చేస్తోంది.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. తెలుగులోనూ స్ట్రీమింగ్
థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 2 వచ్చేస్తోంది.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. తెలుగులోనూ స్ట్రీమింగ్

స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 ట్రైలర్ రిలీజ్

ప్రముఖ బాలీవుడ్ నటుడు కే కే మేనన్.. హిమ్మత్ సింగ్ అనే పాత్రలో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్పెషల్ ఓపీఎస్. ఇప్పుడు రెండో సీజన్ మరింత గ్రాండ్ గా, అదిరిపోయే యాక్షన్ తో రాబోతోంది. జులై 11 నుంచి రెండో సీజన్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు జియోహాట్స్టార్ వెల్లడించింది. ఈ సందర్భంగా ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ అంచనాలను మించి సాగింది.

ఈసారి సైబర్ వార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రపంచానికి ఏర్పడే ముప్పుతో హిమ్మత్ సింగ్ అండ్ టీమ్ ఫైట్ చేయబోతున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. డాక్టర్ భార్గవ్ అనే దేశంలోని టాప్ సైంటిస్ట్ కిడ్నాపింగ్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. అతన్ని కాపాడటానికి హిమ్మత్ సింగ్ అండ్ టీమ్ రంగంలోకి దిగుతుంది.

అయితే ఈసారి సైబర్ వార్ వాళ్లకు మరింత సవాలుగా మారుతుంది. సైబర్ వార్ గెలిచే వాళ్లదే ఈసారి విజయం అనే డైలాగ్ హిమ్మత్ సింగ్ నోటి నుంచి రావడం ఈ ట్రైలర్లో చూడొచ్చు. దేశంలో యూపీఐ డేటాబేస్ లక్ష్యంగా సైంటిస్ట్ కిడ్నాప్, తర్వాత కథ సాగబోతున్నట్లు తెలుస్తోంది.

స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ఇదే

కే కే మేనన్ లీడ్ రోల్లో నటించిన ఈ స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 స్ట్రీమింగ్ తేదీని కూడా జియోహాట్‌స్టార్ వెల్లడించింది. జులై 11 నుంచి ఈ కొత్త సీజన్ ను తీసుకురానున్నట్లు తెలిపింది. “ఈసారి ప్రతి ఒక్కరూ లక్ష్యం కాబోతున్నారు. సైబర్ ఉగ్రవాదం వర్సెస్ హిమ్మత్ సింగ్, అతని టీమ్.

హాట్‌స్టార్ స్పెషల్స్ స్పెషల్ ఓపీఎస్ 2 జులై 11 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో ఈ ట్రైలర్ ను ఆ ఓటీటీ రిలీజ్ చేసింది. తొలి సీజన్ పై పార్లమెంట్ పై దాడి చేసిన ఉగ్రవాదిని పట్టుకునే ప్రయత్నంతో సాగగా.. ఈ రెండో సీజన్ సైబర్ ఉగ్రవాదాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More