జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో దూసుకెళ్తున్న థ్రిల్ల‌ర్ మూవీ.. కోర్టు డ్రామా సిరీస్‌.. ట్రెండింగ్‌లో ఇవే రెండు.. మీరు చూశారా?

జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో ఓ రివేంజ్ థ్రిల్లర్ మూవీ.. మరో కోర్టు ఇన్వెస్టిగేటివ్ డ్రామా సిరీస్ దూసుకెళ్తున్నాయి. ఒక్క రోజు గ్యాప్ లో వచ్చిన ఈ సినిమా, సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ లో ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. మరి ఈ సిరీస్, సినిమాను మీరు కూడా చూశారా? అవి రెండు ఏంటో ఇక్కడ చూసేయండి. 

Published on: Jun 3, 2025, 10:34:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఓటీటీలోకి ఎప్పటికప్పుడూ కొత్త కంటెంట్ వస్తూనే ఉంటోంది. థియేటర్లలో రిలీజైన సినిమాలతో పాటు ఆయా ఓటీటీల స్పెషల్ మూవీస్, సిరీస్ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాయి. అలా గత వారం జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో అడుగుపెట్టిన ఓ సినిమా, మరో సిరీస్ ట్రెండింగ్ లో దూసుకెళ్తున్నాయి. ఈ థ్రిల్లర్ మూవీ, వెబ్ సిరీస్ కు ఫ్యాన్స్ నుంచి గొప్ప రెస్పాన్స్ వస్తోంది.

ట్రెండింగ్ లో సిరీస్, సినిమా (x/jiohotstar)
ట్రెండింగ్ లో సిరీస్, సినిమా (x/jiohotstar)

ఓటీటీ ఒరిజినల్

జియోహాట్స్టార్ స్పెషల్ వెబ్ సిరీస్ గా వచ్చిన క్రిమినల్ జస్టిస్ ఏ ఫ్యామిలీ మ్యాటర్ ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈ ఓటీటీ ఒరిజినల్ వెబ్ సిరీస్ ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ఫ్రాంఛైజీ క్రిమినల్ జస్టిస్ లో భాగంగా నాలుగో సీజన్ గా ఇది నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మే 29ను జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. లాయర్ మాధవ్ మిశ్రాగా సీనియర్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి అదరగొట్టారు.

మూడు భాషల్లో

ఇండియాలో మూడు భాషల్లో క్రిమినల్ జస్టిస్ నాలుగో సీజన్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. నంబర్ వన్ గా ఉంది. జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో హిందీతో పాటు బెంగాలి, మరాఠి భాషల్లో ఈ వెబ్ సిరీస్ నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. ఈ మూడు భాషల్లోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ వెబ్ సిరీస్ ను రిలీజ్ చేశారు. ముందుగా మూడు ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రతి గురువారం మరో కొత్త ఎపిసోడ్ రానుంది.

అదరగొట్టే థ్రిల్లర్

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న సినిమా తుడరుమ్. మోహన్ లాల్ అద్భుతమైన యాక్టింగ్ కు నిలువెత్తు నిదర్శనంలా నిలిచిన ఈ మూవీ బాక్సాఫీస్దగ్గర రికార్డులు కొల్లగొట్టింది. ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజైంది ఈ సినిమా. సుమారు రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.235 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు అంచనా. కేరళ బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ మలయాళ మూవీగా తుడరుమ్ హిస్టరీ క్రియేట్ చేసింది.

ఇందులో ట్రెండింగ్

తుడరుమ్ సినిమా మే 30న జియోహాట్‌స్టార్‌ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రివేంజ్ థ్రిల్లర్కు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ ఫ్యాన్స్ పట్టం కడుతున్నారు. ఇంటెన్సివ్ ఫ్యామిలీ డ్రామాతో పాటు అదిరిపోయే ట్విస్ట్ లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఒరిజినల్ లాంగ్వేజ్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ మూవీ జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో నంబర్ వన్ ప్లేస్ లో ఉంది. హిందీలో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతోంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More