తుడరుమ్ రివ్యూ.. పర్ఫెక్ట్ రివేంజ్ థ్రిల్లర్.. ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండాఫ్ గూస్‌బంప్స్.. మోహన్‌లాల్ నట విశ్వరూపం

తుడరుమ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఇంత పెద్ద హిట్ ఎందుకైందో ఆ సినిమా చూస్తే తెలుస్తుంది. ఇదో పర్ఫెక్ట్ రివేంజ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండాఫ్ అయితే గూస్‌బంప్స్ గ్యారెంటీ. మోహన్‌లాల్ తన నట విశ్వరూపం చూపించాడు.

Published on: May 30, 2025, 14:12:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

థ్రిల్లర్ సినిమా తీయడం అంటే అంత సులువైన విషయం కాదు. ఓ రెగ్యులర్ స్టోరీ అయినా కూడా దానికి ఊహించని ట్విస్టులు జోడించి మొదటి నుంచీ క్లైమ్యాక్స్ వరకూ ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా చేసినప్పుడే ఈ జానర్ సినిమాలు ఆసక్తి రేపుతాయి. మోహన్‌లాల్ నటించిన మలయాళం రివేంజ్ థ్రిల్లర్ తుడరుమ్ (Thudarum) సరిగ్గా అలాంటి సినిమానే.

తుడరుం రివ్యూ.. పర్ఫెక్ట్ రివేంజ్ థ్రిల్లర్.. ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండాఫ్ గూస్‌బంప్స్.. మోహన్‌లాల్ నట విశ్వరూపం
తుడరుం రివ్యూ.. పర్ఫెక్ట్ రివేంజ్ థ్రిల్లర్.. ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండాఫ్ గూస్‌బంప్స్.. మోహన్‌లాల్ నట విశ్వరూపం

తుడరుమ్.. సూపర్ థ్రిల్లర్

ఈ ఏడాది మోహన్లాల్ నటించిన రెండో బ్లాక్‌బస్టర్ మూవీ ఈ తుడరుమ్. అంతకుముందే ఎల్2: ఎంపురాన్ తో అత్యధిక వసూళ్ల మలయాళం సినిమాను అందించాడు. కానీ దాంతో పోలిస్తే ఈ తుడరుం పూర్తి భిన్నమైనది. ఒకప్పటి వింటేజ్ మోహన్‌లాల్ ను మరోసారి ఈ సినిమా మన కళ్ల ముందుకు తీసుకొచ్చింది.

ఆపరేషన్ జావా, సౌదీ వెల్లక్కలాంటి సూపర్ హిట్స్ అందించిన డైరెక్టర్ తరుణ్ మూర్తి ఈ తుడరుమ్ తో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. మనసుకు హత్తుకునే ఫ్యామిలీ ఎమోషన్స్ ను చాలా బాగా చూపించే తరుణ్ మూర్తి.. ఈ తుడరుంలో ఆ ఎమోషన్స్ కు మంచి థ్రిల్ జోడించి అందించాడు.

తుడరుం స్టోరీ ఏంటంటే?

పరువు హత్యలపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ తుడరుమ్ లాగా ఊహించని ట్విస్టులతో వచ్చినవి మాత్రం చాలా తక్కువే. సినిమా ఎక్కడో మొదలై ఎక్కడికో వెళ్తుంది. చాలా వరకు మలయాళం సినిమాలు స్లోగా మొదలై తర్వాత ఆడియెన్స్ ను ఎక్కడికో తీసుకెళ్తాయి.

ఈ తుడరుమ్ కూడా అలాంటిదే. భార్య, ఇద్దరు పిల్లలు, తనకెంతో ఇష్టమైన బ్లాక్ అంబాసిడర్ కారుతో హాయిగా జీవించే బెంజ్ షణ్ముగం (మోహన్‌లాల్) కథే ఈ తుడరుం. ఓ రోజు తన కొడుకు ఫ్రెండ్స్ ఆ కారును తీసుకెళ్లి చిన్న యాక్సిడెంట్ చేయడం, ఆ తర్వాత అది షెడ్డుకు చేరడం, అక్కడి నుంచి ఆ కారులో గంజాయి స్మగ్లింగ్ అంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం, ఆ కారును విడిపించుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు.. ఫస్టాఫ్ అంతా ఇలా సాగిపోతుంది.

అయితే ఇంటర్వెల్ దగ్గరవుతున్న కొద్దీ కథలో ఆసక్తి పెరుగుతుంది. అక్కడ ఉండే చిన్న ట్విస్ట్.. సెకండాఫ్ లో పీక్ స్టేజ్‌కి తీసుకెళ్లి.. ఇక ఆ తర్వాత అంతా గూస్‌బంప్స్ ఇస్తుంది. ముఖ్యంగా బెంజ్ గా మోహన్‌లాల్, లలితగా శోభన, సీఐ జార్జ్ మాథన్ గా ప్రకాశ్ వర్మ నటన మరో లెవెల్ అని చెప్పాలి.

తుడరుం ఎందుకు చూడాలంటే?

తుడరుమ్ ఓ భిన్నమైన రివేంజ్ థ్రిల్లర్ మూవీ. సినిమా మొదట్లో ఫ్యామిలీ అనుబంధాలను చూపిస్తూ డైరెక్టర్ తరుణ్ మూర్తి కథను మొదలుపెడతాడు. ఫస్టాఫ్ పెద్దగా థ్రిల్ ఏమీ ఇవ్వదు. కానీ ఇంటర్వెల్లో వచ్చే ట్విస్టుతోనే కథ మలుపు తిరుగుతుంది. సెకండాఫ్ అంతా ఓ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా సాగుతుంది.

తరుణ్ మూర్తి ఈ కథను చెప్పిన విధానం, లీడ్ క్యారెక్టర్స్ నటన, కంటతడి పెట్టించే ఎమోషన్స్.. తుడరుం మూవీని ప్రత్యేకంగా నిలిపాయి. ఫ్లాష్‌బ్యాక్ లో సినిమాల్లో ఓ స్టంట్ మ్యాన్, ఓ సాధారణ ట్యాక్సీ డ్రైవర్.. తనకు అన్యాయం చేసిన ఇద్దరు పోలీసు అధికారులపై తీర్చుకునే ప్రతీకారమే ఈ తుడరుం కథ. తన ఫ్యామిలీ కోసం ఓ హీరో ఎంత వరకూ వెళ్తాడో గతంలో దృశ్యంలాంటి సినిమాలు చూపించాయి. ఈ తుడరుం కూడా అలాంటిదే. ఆ సినిమాలోని మోహన్‌లాలే ఈ మూవీ చూస్తుంటే కూడా గుర్తుకు వస్తుంటాడు.

తెలుగులోనూ అదే అర్థం కాని టైటిల్ తో రిలీజ్ చేసినందుకు మొదట్లో ఈ మూవీపై విమర్శలు వెల్లువెత్తినా.. తర్వాత సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యారు. దీంతో ఇక్కడా బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదనిపించింది. ఒకవేళ థియేటర్లలో మిస్ అయి ఉంటే.. శుక్రవారం (మే 30) నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను ఈ వీకెండ్ చూసేయండి. కచ్చితంగా థ్రిల్ అవుతారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More