థగ్ లైఫ్ బాక్సాఫీస్ కలెక్షన్లు.. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది.. మూడు రోజుల్లో ఎంతంటే?
థగ్ లైఫ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. తొలి షో నుంచే వచ్చిన నెగటివ్ టాక్ తో కలెక్షన్లు రోజురోజుకూ పడిపోతున్నాయి. మూడు రోజుల్లో ఆ మూవీ ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.52 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన మూవీ థగ్ లైఫ్. జూన్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు పూర్తిగా నెగటివ్ రివ్యూలు రావడంతో ఆ ప్రభావం బాక్సాఫీస్ వసూళ్లపై స్పష్టంగా కనిపించింది. తొలి రోజు కంటే రెండో 70 శాతం పడిపోయిన కలెక్షన్లు.. మూడో రోజు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.

థగ్ లైఫ్ బాక్సాఫీస్ కలెక్షన్లు
కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో 38 ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా థగ్ లైఫ్. అలాంటి మూవీ అసలు ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాకు తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.52 కోట్లు మాత్రమే వచ్చాయి. కేవలం ఇండియా నెట్ కలెక్షన్లు చూసుకుంటే.. మూడు రోజుల్లో రూ.28.49 కోట్లుగా ఉంది. ఇవి చాలా చాలా తక్కువే అని చెప్పాలి.
గత గురువారం (జూన్ 5) మూవీ రిలీజ్ కాగా.. తొలి రోజు ఇండియాలో నెట్ కలెక్షన్లు రూ.15.5 కోట్లుగా ఉన్నాయి. మరుసటి రోజు ఇవి రూ.7.15 కోట్లకు పడిపోగా.. మూడో రోజు మరింత దిగజారి రూ.5.84 కోట్లకు పరిమితమయ్యాయి. మొత్తంగా మూడు రోజుల్లో కలిపి రూ.28.49 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. తమిళ వెర్షన్ లో ఆక్యుపెన్సీ కేవలం 35.62 శాతంగా ఉంది.
థగ్ లైఫ్ ఎలా ఉందంటే?
థగ్ లైఫ్ ఒక గ్యాంగ్‌స్టర్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. 38 ఏళ్ల తర్వాత కమల్-మణిరత్నం కాంబినేషన్‌లో సినిమా అంటే చాలా హైప్స్ ఉన్నాయి. కానీ, ఆ అంచనాలను అంతగా అందుకోలేకపోయింది థగ్ లైఫ్ మూవీ. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో నాయగన్ వంటి కల్ట్ క్లాసిక్ చూసిన అభిమానులు థగ్ లైఫ్‌తో కాస్తా నిరాశ చెందారనే చెప్పొచ్చు.
ఇక థగ్ లైఫ్ సినిమా కథ ఏంటో ప్రచార చిత్రాల్లోనే పూర్తిగా చూపించేశారు. కాపాడిన పిల్లాడిని కొడుకులా చూసుకున్న తండ్రికి అతని నుంచి ద్రోహం ఎదురైతే ఎలా ఉంటుంది, అందుకు గల కారణాలు ఏంటీ అనే ఎలిమెంట్స్‌తో ఈ సినిమా సాగింది. కమల్-శింబు మధ్య వచ్చే ఫైట్ సీన్స్ ఆకట్టుకుంటాయి. అయితే, ఏఆర్ రెహమాన్ మ్యూజికి అంతగా వర్కౌట్ కాలేదు. ఎమోషన్స్ కూడా అంతగా పండలేదు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



