థగ్ లైఫ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఇదో కల్ట్ క్లాసిక్ థ్రిల్లర్.. కమల్ హాసన్ యాక్టింగ్ మరో లెవెల్

కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. గురువారం (జూన్ 5) ఈ మూవీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కల్ట్ క్లాసిక్ థ్రిల్లర్ అంటూ ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు రివ్యూ ఇవ్వడం విశేషం.

Jun 4, 2025, 15:51:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో వస్తున్న థగ్ లైఫ్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడో 37 ఏళ్ల కిందట వచ్చిన నాయకుడు మూవీ ఓ కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోయిన తర్వాత ఈ ఇద్దరూ కలిసి మరో మూవీ చేయడంతో సహజంగానే థగ్ లైఫ్ పై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.

థగ్ లైఫ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఇదో కల్ట్ క్లాసిక్ థ్రిల్లర్.. కమల్ హాసన్ యాక్టింగ్ మరో లెవెల్
థగ్ లైఫ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఇదో కల్ట్ క్లాసిక్ థ్రిల్లర్.. కమల్ హాసన్ యాక్టింగ్ మరో లెవెల్

థగ్ లైఫ్.. కల్ట్ క్లాసిక్ థ్రిల్లర్

థగ్ లైఫ్.. గురువారం (జూన్ 5) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. మణిరత్నం డైరెక్షన్ లో కమల్ హాసన్, శింబు, త్రిషలాంటి వాళ్లు నటించిన ఈ సినిమా ఫస్ట్ రివ్యూ మాత్రం రెండు రోజుల ముందే వచ్చేసింది. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా, ఫిల్మ్ క్రిటిక్ గా కొన్నేళ్లుగా ముందుగానే సినిమాలకు రివ్యూలు ఇచ్చే ఉమేర్ సంధుయే ఈ థగ్ లైఫ్ ఫస్ట్ రివ్యూ ఇవ్వడం విశేషం. అతడు ఈ మూవీని ఆకాశానికెత్తాడు. ఓ కల్ట్ క్లాసిక్ థ్రిల్లర్ అని అన్నాడు.

“ఫస్ట్ రివ్యూ థగ్ లైఫ్. కమల్ హాసన్, శింబు అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో కూడిన కల్ట్ క్లాసిక్ థ్రిల్లర్. పవర్ ప్యాక్డ్ స్టోరీ, యాక్షన్ స్టంట్స్. ఏఆర్ రెహమాన్, మణిరత్నం డెడ్లీ కాంబో బ్యాక్ విత్ బ్యాంగ్. కచ్చితంగా చూడండి” అని ఉమేర్ ట్వీట్ చేశాడు.

థగ్ లైఫ్ మూవీ గురించి..

థగ్ లైఫ్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇది తండ్రీ కొడుకుల మధ్య సాగే కథ. 1987లో వచ్చిన నాయకుడు తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కలిసి చేసిన రెండో మూవీ ఇది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్రిష, శింబు, జోజు జార్జ్, నాజర్ లాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ మూవీ రిలీజ్ కు ముందు కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదం కావడంతో కర్ణాటకలో సినిమా రిలీజ్ కావడం లేదు. క్షమాపణ చెప్పడానికి అంగీకరించని కమల్.. మూవీని అక్కడ రిలీజ్ చేయబోనని స్పష్టం చేశాడు. దీనివల్ల అతనితోపాటు మూవీ టీమ్ రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు నష్టపోతుందని అంచనా వేస్తున్నారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More